నిహారిక కొణిదెల ఆ రెండో కష్టాన్ని అధిగమిస్తుందా? మెగా డాటర్‌ను వెంటాడుతున్న స్ట్రాంగ్ సెంటిమెంట్!

మెగా డాటర్ నిహారిక కొణిదెల నటిగానే కాకుండా నిర్మాతగా కూడా సత్తా చాటుతున్నది. పెదనాన్న, తండ్రి, బాబాయ్ నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన టాలెంటెడ్ నటి తనకు అందిన అవకాశాలను అందిపుచ్చుకొని నటిగా తనదైన శైలిలో గుర్తింపు తెచ్చుకొన్నారు. అయితే నటిగా కొనసాగుతూనే ప్రస్తుతం ప్రతిభావంతులైన దర్శకులను, నటీనటులను వెలికి తీసే వినూత్న కార్యక్రమాన్ని భుజానికి ఎత్తుకొన్నది. ఈ క్రమంలో తాజాగా మరో సినిమాను నిర్మాతగా ప్రారంభించారు. ప్రొడ్యూసర్‌గా ఆమె ప్రయాణం గురించిన వివరాల్లోకి వెళితే..

పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ స్థాపించి తొలి ప్రయత్నంగా కమిటీ కుర్రొళ్లు అనే సినిమాను నిర్మించారు. నూతన నటీనటులకు, దర్శకులకు అవకాశం కల్పించారు. ఈ సినిమా ద్వారా యధు వంశీని దర్శకుడిగా పరిచయం చేశారు. సందీప్ సరోజ్, పీ సాయకుమార్, గోపరాజు రమణ, యశ్వంత్ పెండ్యాల, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహ్రా లాంటి నటీనటులతో సినిమాను నిర్మించారు.

Niharika Konidela

నిహారిక కొణిదెల మీడియం బడ్జెట్‌గా తన తొలి సినిమాను నిర్మించారు. సుమారుగా 10 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ చిత్రం 25 కోట్ల రూపాయల షేర్ సంపాదించింది. గతేడాది విడుదలైన సినిమాల్లో భారీ విజయం అందుకొన్న చిత్రంగా ఓ ఘనతను సాధించింది. ఈ సినిమా విజయాన్ని పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్‌ బ్యానర్‌ ఖాతాలో వేసుకొన్నది. ఈ విజయం తర్వాత ద్వితీయ విఘ్నాన్ని నిర్మాతగా అధిగమించే ప్రయత్నం చేస్తున్నారు.

పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెం.2 గా నిహారిక కొణిదెల నిర్మిస్తున్న చిత్రానికి మానస శర్మ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాలో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించనున్నారు. ఈ చిత్రానికి కథను మానస శర్మ అందించగా.. స్క్రీన్ ప్లే, డైలాగ్స్‌ను మానస శర్మ, మహేష్ ఉప్పాల అందించారు. ఈ మూవీకి మన్యం రమేష్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీ కూడా కంటెంట్‌కు పెద్ద పీట వేసి.. నిర్మిస్తున్నట్టు తెలుస్తున్నది.

తెలుగు సినిమాలో తొలి విజయం తర్వాత రెండో సక్సెస్‌ను అందుకోవడం సెంటిమెంట్‌గా భావిస్తుంటారు. తొలి మూవీతోనే భారీ విజయం అందుకొన్న వారు ద్వితీయ విఘ్నాన్ని రెండో సినిమాతో దాటడం కష్టంగా భావిస్తుంటారు. ఈ విషయంలో నిహారిక కొణిదెల తన రెండో కష్టాన్ని గట్టెక్కుతుందా? వరుస విజయాన్ని తన ఖాతాలో వేసుకొంటుందా? పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌కు రెండో సక్సెస్ అందిస్తుందా? సంగీత్ శోభన్ సోలోగా హిట్టు కొడుతాడా? అనేది వేచి చూడాల్సిందే.

నటీనటులు: సంగీత్ శోభన్, నయన్ సారిక, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్థి, గెటప్ శీను, సుఖ్వీందర్ సింగ్, అరుణ భిక్షు, రమణ భార్గవ్, వాసు ఇంటూరి, రోహిణి(జబర్దస్త్), రోహన్ (#90) తదితరులు
దర్శకత్వం: మానస శర్మ,
నిర్మాత: నిహారిక కొణిదెల
బ్యానర్: పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్,
కథ: మానస శర్మ,
స్క్రీన్ ప్లే, డైలాగ్స్: మానస శర్మ & మహేష్ ఉప్పాల,
మ్యూజిక్: అనుదీప్ దేవ్,
సినిమాటోగ్రాఫర్: రాజు ఎడురోలు,
యాక్షన్ కొరియోగ్రాఫర్: విజయ్, ఎడిటర్ - అన్వర్ అలీ,
ప్రొడక్షన్ డిజైనర్: రామాంజనేయులు,
ఆర్ట్ డైరెక్టర్: పుల్లా విష్ణు వర్ధన్

More from Filmibeat

Read more about: niharika konidela tollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X