Tamannaah Bhatia: లవర్‌తో పెళ్లికి తమన్నా.. మిల్కీ బ్యూటీ ఆ ప్లాన్ వర్కవుట్ అవుతుందా?

జెనరేషన్స్ మారుతున్న కొద్దీ తెలుగు సినిమా దగ్గర ఒకో టైం లో ఒకో హీరోయిన్ మంచి ఫేమ్ ని అందుకున్నారు. ఇలా మన తెలుగు సినిమా దగ్గర వచ్చిన లేటెస్ట్ జెనరేషన్ టాప్ హీరోయిన్స్ కొందరు ఉన్నారు. మరి వీరిలో మిల్కీ బ్యూటీ తమన్నా కూడా ఒకామె. కాగా తమన్నా చాలా చిన్న హీరోయిన్ గా తెలుగు సినిమాకి పరిచయం అయ్యిన సంగతి తెలిసిందే.

అవ్వడానికి హిందీ అమ్మాయి అయినప్పటికీ తనకి బ్రేక్ ఇచ్చింది మాత్రం సౌత్ సినిమా మెయిన్ గా మన తెలుగు సినిమానే అని చెప్పవచ్చు. కాగా తమన్నా హీరోయిన్ గా ఒకో సినిమా తెలుగులో స్టార్ట్ చేసి భారీ ఆఫర్స్ సొంతం చేసుకొని తెలుగులో నెంబర్ 1 ప్లేస్ కి వెళ్ళిపోయింది అని అందరికీ తెలిసిందే. ఇలా హీరోయిన్ గా ఒక దశాబ్దం పైగానే తెలుగు సినిమా సౌత్ దగ్గర రూల్ చేసేసింది.

will tamannaah come back with Odela 2 in tollywood before marriage with Vijay Varma

ఇలా తమన్నా కొన్నాళ్ల తర్వాత మరింత మంది కొత్త హీరోయిన్స్ రావడంతో పోటీలో ఆమె కొంచెం వెనుకబడింది. ఇలా ఫేడ్ అవుట్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. దీనితో చేసినన్ని నాళ్ళు సినిమాలు చేసేసి హిందీ సినిమాకి షిఫ్ట్ అయ్యిపోయింది. ఇక అక్కడ నుంచి సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసింది. కాగా హిందీలో పలు వెబ్ సిరీస్ లు అది కూడా బోల్డ్ సిరీస్ లు చేయడం స్టార్ట్ చేసింది.

ఒక టైం లో అయితే బి గ్రేడ్ లెవెల్లో కూడా చేసే రేంజ్ కి వెళ్ళిపోయింది. వీటితో పాటుగా ఐటెం సాంగ్స్ కూడా ఎక్కువగా చేస్తూ సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా బాగానే రాణించింది. అయితే ఇపుడు తనలోని వెర్షన్ 3.0 తో రాబోతుంది అని చెప్పవచ్చు. తెలుగు సినిమాకి చాలా కాలం దూరం అయ్యిన తమన్నా ఈసారి దాదాపు తన సోలో సినిమా లాంటి దానితో వస్తుంది.

will tamannaah come back with Odela 2 in tollywood before marriage with Vijay Varma

కాగా ఆ సినిమానే "ఓదెల 2". దర్శకుడు సంపత్ నంది తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ చూస్తుంటే తమన్నా గట్టిగానే హార్డ్ వర్క్ చేసినట్టు కనిపిస్తుండడమే కాకుండా తెలుగులో మళ్ళీ రీఎంట్రీకి గట్టిగానే ప్లాన్ చేసుకున్నట్టుగా కనిపిస్తుంది అని చెప్పాలి. దీనితో ఇలాంటి రెండు స్టేజ్ ల తర్వాత తమన్నా నుంచి ఈ మూడో వెర్షన్ ఆమెకి మళ్ళీ తెలుగులో పూర్వ వైభవాన్ని తీసుకొస్తుందా లేదా అనేది మాత్రం చూడాలి.

ప్రస్తుతానికి టీజర్ పరంగా ఆమెకి మంచి మార్కులే వస్తున్నాయి. ఇక ప్రస్తుతం తమన్నా ఈ సినిమా తోనే కాకుండా హిందీలో కూడా పలు సినిమాలు చేస్తుంది. అలాగే ఇంకోపక్క తన గ్లామర్ ట్రీట్ తో కూడా సోషల్ మీడియాలో ఓ రేంజ్ ల్లో ట్రీట్ ఇస్తుంది. ఇక ఈ అన్నిటితో పాటుగా తన ప్రియుడు విజయ్ వర్మతో ప్రేమాయణం కొనసాగిస్తుండగా వీరి పెళ్లి కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

More from Filmibeat

Read more about: tamannaah odela 2 sampath nandi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X