త్రిష డ్రీమ్ నిజం కాబోతున్నదా? 22 ఏళ్ల కోరిక తీరబోతున్నదా?
తమిళ సినీ రంగంలోనే కాకుండా తమిళ రాజకీయాల్లో సీనియర్ హీరోయిన్ త్రిషా కృష్ణన్ చక్రం తిప్పబోతున్నదా? ఆమె రాజకీయ రంగ ప్రవేశానికి ఎంట్రీ సిద్దమవుతుందా? అనే ప్రశ్నలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. టీవీకే పార్టీ అధినేత, దళపతి విజయ్‌తో ఆమె సహజీవనం చేస్తున్న క్రమంలో తమిళ పాలిటిక్స్‌లో ఆమె ప్రాధాన్యం మరింత పెరగబోతున్నదనే సంకేతాలు వెలువడుతున్నాయి.
అంతేకాకుండా విజయ్‌తోపాటు త్రిష కూడా అధికార ప్రభుత్వంలో భాగం కాబోతున్నారనే ఊహగానాలు మొదలయ్యాయి. అయితే కొన్నేళ్ల క్రితం యధాలాపంగా త్రిష మనసులోని కోరిక త్వరలోనే కార్యరూపం దాల్చబోతున్నదా? అనే విషయం హాట్ టాపిక్ అవుతున్నది. అయితే త్రిష మనసులోని కోరిక ఏమిటి? త్రిషా రాజకీయ ప్రవేశానికి కార్యాచరణ ఏ విధంగా రూపుదాల్చబోతున్నదనే వివరాల్లోకి వెళితే..

22 ఏళ్ల క్రితం త్రిషా ఓ మీడియా ఛానెల్‌లో మాట్లాడుతూ.. రాజకీయాలపై తన ఆసక్తిని వెల్లడించారు. తనకు ఓ కోరిక ఉంది. తమిళనాడుకు సీఎం కావాలనే కోరిక నాకు ఉంది అని చెప్పారు. అయితే ఆమె మనసులో బలంగా కోరిక ఉందో లేదో కానీ.. బయటకు చెప్పడం వల్ల ప్రస్తుతం దానికి అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. విజయ్ ప్రస్తుతం తమిళనాడుకు సీఎం కాబోతున్నాడనే సంకేతాల మధ్య త్రిష తన డ్రీమ్‌కు చేరువ కాబోతున్నారనే విషయంపై రకరకాల కథనాలు సోషల్ మీడియాలో వినబడుతున్నాయి.
త్రిష, విజయ్ కొద్దికాలంగా డేటింగ్ పేరుతో సహజీవనం చేస్తున్నారు. స్వయంగా ఈ విషయాన్ని విజయ్ భార్య తమ విడాకుల పిటిషన్‌లోనే పరోక్షంగా బయటపెట్టారు. దాంతో విజయ్, త్రిష బంధం అధికారికంగా మారింది. అయితే ప్రస్తుతం తమిళనాడుకు విజయ్ సిఏం పగ్గాలు చేపడితే.. అధికారికంగా ఆమె రాష్ట్రానికి మొదటి పౌరురాలు కావడం గ్యారెంటీగా మారుతుంది అని పొలిటికల్ అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు.
అయితే ఎన్నికల ఫలితాలు ఓ పక్క వెలువడుతుండగా.. ఓ ఊహాగానం బలంగా మీడియాలో వినిపిస్తున్నది. విజయ్ రెండు చోట్ల విజయం సాధిస్తున్న నేపథ్యంలో ఒక సీటుకు రాజీనామా చేయడం అనివార్యంగా మారుతుంది. ఆ సీట్ నుంచి త్రిషను పోటీ చేయించడం ఖాయంగా కనిపిస్తున్నది. ఒకవేళ ఆమె గెలిస్తే.. రాష్ట్ర క్యాబినేట్‌లో చేరడం తప్పనిసరి అవుతుందనే అభిప్రాయం ఊహాగానాల రూపంలో వైరల్ అవుతున్నది. ఏదీ ఏమైనా త్రిష తమిళ రాజకీయాల్లో మరో జయలలిత కావడం తథ్యం అనే మాట ఇప్పటికే బలంగా వినిపిస్తున్నది.
త్రిషా సినిమా కెరీర్ విషయానికి వస్తే.. విజయ్‌తో కలిసి లియో, గోట్ చిత్రాల్లో నటించిన తర్వాత.. అజిత్‌తో కలిసి విదాముయార్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ, థగ్ లైఫ్ చిత్రాల్లో నటించింది. సూర్యతో కరుప్పు, చిరంజీవితో విశ్వంభర, మలయాళ చిత్రం రామ్‌లో సూపర్ స్టార్ మోహన్ లాల్‌తో కలిసి నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications