twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కీర్తి సురేష్ ఫోటోతో చీటింగ్.. అలా చాట్ చేయడంతో ఏకంగా 40 లక్షలు కాజేసిన లేడి!

    |

    సోషల్ మీడియా వలన ఎంతో ఉపయోగముందో అంతకంటే ఎక్కువ స్థాయిలో కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. కేవలం అమాయకులు మాత్రమే కాకుండా చదువుకున్న వాళ్ళు కూడా సోషల్ మీడియా మోసాల బారిన పడుతున్నారు. అయితే ఇటీవల కీర్తి సురేష్ పేరుతో ఫోటోతో ఒక మాయలేడీ చేసిన మోసం వార్తల్లో హాట్ టాపిక్ గా మారింది. తెలివిగా చాటింగ్ చేసిన ఆ మహిళ ఏకంగా 40 లక్షలు కాజేసింది. ఆ వివరాల్లోకి వెళితే..

     భారీగా ఫ్యాన్ ఫాలోవర్స్

    భారీగా ఫ్యాన్ ఫాలోవర్స్

    మహానటిగా కీర్తి సురేష్ సౌత్ ఇండస్ట్రీలో ఏ స్థాయిలో గుర్తింపు అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మహానటి సావిత్రి బయోపిక్ లో నటించిన ఆమె జీవితానికి సరిపోయేంత మంచి గుర్తింపును అయితే అందుకుంది. ఇక సౌత్ ఇండస్ట్రీలో ఆమెకు చాలామంది అభిమానులు ఉన్నారు. ఆమె సినిమాలు సక్సెస్ అయిన కాకపోయినా కూడా ఫాన్స్ ఫాలోవర్స్ అయితే అసలు తగ్గడం లేదు.

    కీర్తి సురేష్ పేరుతో మోసం

    కీర్తి సురేష్ పేరుతో మోసం

    అయితే కీర్తి సురేష్ ను ఎంతగానో అభిమానించే ఒక వ్యక్తి ఇటీవల ఒక మహిళ వలన మోసపోయాడు. కీర్తి సురేష్ తనతో చాటింగ్ చేస్తుంది అని అతను చాలా ఈజీగా నమ్మేశాడు. అంతేకాకుండా ఆమె కొన్ని ఫోటోలు పంపడంతో తనే కీర్తి సురేష్ అని కూడా అతను నమ్మాడు. ఇక కొన్ని రోజుల తర్వాత అవతలి వైపు నుంచి వచ్చిన ఒక రిక్వెస్ట్ చూసి అతను ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అనుమానం వచ్చినప్పటికీ కూడా అతను మోసపోయాడు.

    40 ఏళ్ళ మహిళ

    40 ఏళ్ళ మహిళ

    కీర్తి సురేష్ పేరుతో అలాగే ఫోటోలతో జరిగిన ఒక మోసం ఇప్పుడు కర్ణాటక మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఒక 40 ఏళ్ల మహిళ కర్ణాటకలో ఒక వ్యక్తిని దారుణంగా మోసం చేసింది. ఆ వ్యక్తికి ఫేస్ బుక్ లో కీర్తి సురేష్ ఫోటోతో ఉన్న ఐడి ప్రొఫైల్ కనిపించడంతో రోజుల తరబడి చాటింగ్ చేశాడు. ఇక ఆ చాటింగ్ శృతిమించి మరొక రూట్లో కూడా వెళ్లినట్లు తెలుస్తోంది.

    40 లక్షల మోసం

    40 లక్షల మోసం

    ఇక అతను రోజు అలా చాటింగ్ చేస్తూ ఉండడంతో ఆ మాయలేడీ మాటలకు ఆ వ్యక్తి చాలా ఈజీగా మోసపోయాడు. కొన్ని రోజులపాటు అతని నుంచి మెల్లగా ఆమె డబ్బు తీసుకునే ప్రయత్నం కూడా చేసింది. చదువుకున్న యువకుడు అయినప్పటికీ కూడా అతను కీర్తి సురేష్ తనకు డబ్బులు అడిగిందేమో అనుకొని ఈజీగా ఆమెకు కొన్ని రోజుల వరకు ఆన్ లైన్ లో డబ్బులు పంపుతూ వచ్చాడు. ఆ విధంగానే దాదాపు 40 లక్షల వరకు కాజేసినట్లు బయటపడింది.

    నిజం తెలిశాక..

    నిజం తెలిశాక..

    ఇక ఈ విషయంలో కొంతకాలానికి అసలు నిజం తెలుసుకున్న ఆ వ్యక్తి తనతో చాటింగ్ చేస్తున్నది కీర్తి సురేష్ కాదు అని వెంటనే పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశాడు. తన దగ్గర నుంచి ఆమె డబ్బులు తీసుకుంది అని కూడా చెప్పడంతో పోలీసులు కేసు నమోదు చేసి సదరు మహిళను అదుపులోకి తీసుకున్నారు.

    తరచుగా ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి అని కొంతమంది పరువు కోసం బయటకు కూడా కొన్ని మోసపూరిత విషయాలను బయట పెట్టడం లేదు అని పోలీసులు చెబుతున్నారు. సోషల్ మీడియాలో ఏ సెలబ్రిటీ కూడా ఈ విధంగా డబ్బులు అడగరని అలా అడుగుతూ బ్లాక్మెయిల్ చేస్తే వెంటనే సబర్ క్రైమ్ ను సంప్రదించాలి అని పోలీసులు చెబుతున్నారు.

    English summary
    Women cheating with keerthy suresh photos and took away 40 lakhs..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X