కొంపముంచిన నాజుకు నడుము, కీర్తి లుక్స్ పై పెదవి విరిచేస్తున్న ప్రిన్స్ ఫ్యాన్స్
మహానటి కోసం బాగా బరువెక్కిన కేరళ కుట్టి కీర్తి సురేశ్, సినిమా సూపర్ సక్సెస్ అయిన తరువాత క్రమంగా బరువు తగ్గడం ప్రారంభించింది. ప్రస్తుతం అమ్మడు చక్కని ఫిగర్ తో లైట్ గా కనిపిస్తోంది అన్న మాటే కానీ, ముఖంలో ఏదో మిస్ అయిన ఫీలింగ్ మాత్రం కొట్టొచ్చినట్లే కనిపిస్తోంది. ఇదిగో ఇదే అమ్మడి కొంప ముంచేట్టు కనిపిస్తోంది.
ఈ మధ్య వచ్చిన గుడ్ లక్ సఖి సినిమా ట్రైలర్ చూసిన జనాలు కీర్తిని చూసి వహ్వా అనుకోవడానికి బదులు, అదేంటి అమ్మాయి మరీ ఇంత బక్కగా తయారైందని అనుకోకుండా ఉండలేకపోయారు. అయితే ఈ సినిమాలో కీర్తి మేకప్ లేకుండా నటిస్తోంది కాబట్టి, దాని ఎఫెక్ట్ కూడా అయి ఉండవచ్చు అని సరిపెట్టుకున్నారు. ఇక ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి ఆఖరి షెడ్యూల్ పూర్తి చేసేందుకు హైదరాబాద్ వచ్చిన కీర్తి, షూటింగ్ లో పాలుపంచుకుంటోంది.

అయితే నేరుగా అమ్మాయిని చూస్తున్న ప్రిన్స్ ఫ్యాన్స్ సర్కారు వారిపాట రిజల్ట్ పై అప్పుడే బెంగ పెట్టేసుకున్నారట. బొద్దుగా ముద్దుగా ఉండే కీర్తిని చూసి అలవాటు పడిన జనాలకు అమ్మడి కొత్త రూపం అసలు మింగుడుపడటంలేదని తలుస్తోంది. ఈ నేపథ్యంలో సర్కారు వారి పాట దర్శక-నిర్మాతలు సైతం డైలమాలో పడ్డారని తెలుస్తోంది.
అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరెకెక్కిస్తున్న ఈ సినిమాలో ప్రతి పాత్రనూ ఆచి తూచి ఎంపిక చేస్తున్నారు. ఇక అమ్మడి కొత్త లుక్స్ వల్ల మహేశ్ బాబు పక్కన ఎలా కనిపిస్తుందా అన్న ఆలోచనలో పడ్డారు. మరి, కీర్తి కొత్త లుక్స్ ఆమెకు మరిన్ని తంటాలు తెచ్చిపెడుతుందా లేదా అన్నది చూడాలి.


Click it and Unblock the Notifications











