లైఫ్ పాట్నర్ ను వెతుకోవడానికి చాలా అప్షన్స్ ఉన్నాయి : యామీ గౌతమ్
రవిబాబు 'నువ్విలా', ఆ తర్వాత నితిన్ కొరియర్‌బాయ్ కళ్యాణ్ ,'గౌరవం' లాంటీ సినిమాలతో తెలుగు వారిని అలరించిన యామీ గౌతమ్... ఆ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అలరించకపోవడంతో పెద్దగా గుర్తింపు సంపాదించుకోలేకపోయింది. తెలుగుతోపాటు కన్నడ, తమిళ చిత్రాలు కూడా చేసింది. అయినప్పటికీ ఆమెకు దక్షిణాదిలో నిరాశే ఎదురైంది. అయితే బాలీవుడ్ నుంచి మాత్రం ఆమెకు మంచి అవకాశాలు వచ్చాయి. గ్లామర్‌పరంగానే కాకుండా మంచి నటిగా కూడా గుర్తింపు సంపాదించుకుంది. త్వరలో 'గిన్నీ వెడ్స్ సన్నీ' అనే సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
త్వరలో ఈ సినిమా ఓటీటీ వేదికగా విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా... అందులో ఆసక్తికర విషయాలు వెల్లడించింది. తనకు స్కూల్ డేస్ లవ్ అంటే చాలా ఇష్టమని అంటుంది ఈ సుందరి. కానీ ఆ రోజుల్లో తనతో అబ్బాయిలు మాట్లాడాలంటే భయపడేవాళ్లు అని చెప్పుకొచ్చింది . అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు నిజమైన ప్రేమను కనిపెట్టడం నిజంగా కష్టమైపోతుంది అంటోంది అమ్మడు. ఇప్పుడున్న జనరేషన్స్ లో ప్రేమ అంటే అర్ధం మారిపోయింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో లైఫ్ పాట్నర్ ను వెతుకోవడానికి చాలా అప్షన్స్ ఉన్నాయి .

కానీ అనేక ఇబ్బందులను కూడా తెచ్చిపెడుతుంది . రిలేషన్ షిప్ లో ఉంటే కొన్ని డిమాండ్స్ ఉంటాయి.. అలా అని నేను త్యాగాలు చేయమని చెప్పను కాంప్రమైజ్ అవ్వమని చెప్పను కానీ ఇద్దరు సర్దుకుపోవాలని చెబుతోంది. చిన్నతనంలో నేను ఎప్పుడు లవ్ లో పడలేదు. నేను ఎప్పుడు సైలెంట్ గా ఉంటాను. అబ్బాయిలు నాతో మాట్లాడాలంటే నేను ఎక్కడ కొడతానో అని భయపడే వాళ్ళు అంటూ చెప్పుకొచ్చింది యామీగౌతమ్ .


Click it and Unblock the Notifications











