పాన్ ఇండియా మూవీలో సెగలు రేపే సీన్... ఆ హీరోకి పెళ్లయిన హీరోయిన్ ‌‌షాక్

సినిమా చిత్రీకరణ అంత సులువుగా సాగే పని కాదు. మూడు గంటల పాటు సాగే సినిమా కోసం నటీనటులు ఎంతో కష్టపడతారు. ప్రాణాలను పణంగా పెట్టి రిస్కీ స్టంట్స్, యాక్షన్ సీక్వెన్స్‌లతో పాటు రొమాన్స్, శృంగార సన్నివేశాల్లోనూ నటిస్తుంటారు. పెళ్లయిన నటీనటులకు ఇది అత్యంత ఇబ్బందికరం.. ఎలాంటి సీన్స్ అయినా చేసేవారు సైతం బెడ్‌రూం సీన్స్ అంటే భయపడతారు. దర్శక నిర్మాతలు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కన్నీటి పర్యంతమైన వారెందరో. తాజాగా ఇలాంటి పరిస్ధితినే ఎదుర్కొంటున్నారు ఓ నటి. ఈ వివరాల్లోకి వెళితే..

జూన్ 4న టాక్సిక్
రాకింగ్ స్టార్ యష్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ టాక్సిక్. శాండల్‌వుడ్‌తో పాటు 2026లో భారతీయ చిత్ర పరిశ్రమ ఎంతో ఉత్కంఠగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తోంది. తొలుత మార్చి 19న వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. అయితే ధురంధర్ 2 ప్రభంజనం, ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధం తదితర కారణాలతో జూన్ 4కు ఈ సినిమా వాయిదా పడింది. కేజీఎఫ్ సిరీస్ తర్వాత యష్ నటిస్తోన్న చిత్రం కావడంతో పాటు ఇప్పటికే విడుదల చేసిన గ్లింప్స్, టీజర్‌లు సినిమాపై హైప్ మరింత పెంచాయి.

Yash s Toxic Faces Buzz Over Intimate Scenes as Kiara Advani Reportedly Raises Concerns

భారీ బడ్జెట్‌తో టాక్సిక్
కేవీఎన్ ప్రొడక్షన్స్, మోన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్‌పై వెంకట్ కే నారాయణ, యష్‌లు సంయుక్తంగా రూ. 500 కోట్ల భారీ బడ్జెట్‌తో టాక్సిక్‌ను నిర్మిస్తున్నారు. మలయాళ నటి, దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో యష్ సరసన ఏకంగా ఐదుగురు హీరోయిన్లు రుక్మిణీ వసంత్, కియారా అద్వానీ, నయనతార, హ్యూమా ఖురేషీ, తారా సుతారియాలు నటిస్తున్నారు. అక్షయ్ ఒబెరాయ్. బియాట్రిజ్ తౌఫాన్‌బచ్‌, డెరిల్ డీ సిల్వ, సుదేవ్ నాయర్, అమిత్ తివారీ, టోవినో థామస్, కైల్ పాల్‌లు టాక్సిక్‌లో కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ భారీ రవి బస్రూర్ సంగీత దర్శకత్వం వహిస్తుండగా... ఉజ్వల్ కులకర్ణి ఎడిటింగ్, రాజీవ్ రవి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.

ఫ్లాపుల్లో కియారా అద్వానీ
యష్ సరసన హీరోయిన్‌గా నటిస్తోన్న కియారా అద్వానీ పరిస్థితి కూడా ఏమంత బాలేదు. వరుసపెట్టి సినిమాలు ఫ్లాప్ అవుతూ వస్తున్నాయి. గేమ్ ఛేంజర్, వార్ 2 చిత్రాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్‌గా నిలిచాయి. ఆ తర్వాత కియారాకు ఆఫర్లు కూడా తగ్గాయి. రేసులో నిలబడాలంటే ఖచ్చితంగా హిట్ సాధించాల్సిన దశలో టాక్సిక్‌పై ఆమె ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమాలో నదియా అనే పాత్రలో కియారా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఫోటోలలో యష్‌తో ఆమె కెమెస్ట్రీ బాగుందని విశ్లేషకులు చెబుతున్నారు.

యష్- కియారా మధ్య బెడ్ రూం సీన్స్
టాక్సిక్‌లో రొమాన్స్ మోతాదు భారీగా ఉందని ఇప్పటికే వదిలిన టీజర్, గ్లింప్స్ చెబుతున్నాయి. స్మశానం దగ్గర ఓ ఇంగ్లీష్ నటితో యష్ ఇంటిమేట్ సీన్ వివాదాస్పదం అవ్వగా.. ఆ తర్వాత విడుదలైన టీజర్‌లోనూ ఓ నటితో యష్ బెడ్‌రూం సీన్ ఉంది. దీనిని మరింత పెంచేలా కియారా అద్వానీ- యష్‌ల మధ్య ఇంటిమేట్ సీన్ ప్లాన్ చేశారాట దర్శకురాలు గీతూ మోహన్‌దాస్. ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్‌పై ఎవరూ చూపించని విధంగా హీరో హీరోయిన్ల మధ్య ఈ సీన్ ఉంటుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. గ్లామర్, స్టైల్‌తో ఘాటైన సన్నివేశాలు ఉంటాయని టాక్సిక్‌కే ఈ సీన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని సోషల్ మీడియా టాక్.

ఆ సీన్‌కు కియారా నో
అయితే యష్‌తో ఇలాంటి ఇంటిమేట్ సీన్ చేయడానికి కియారా అద్వానీ ససేమీరా అంటున్నట్లుగా గాసిప్స్ వస్తున్నాయి. ఇప్పటి వరకు తను సంపాదించుకున్న క్లీన్ ఇమేజ్ ఒకటైతే, పెళ్లయి పిల్లలు ఉండటంతో అనవసరమైన వివాదాల్లోకి వెళ్లినట్లుగా ఉంటుందని ఆమె భయపడుతున్నారట. అందుకే ఈ సన్నివేశాన్ని సినిమాలోంచి తగ్గించడమో లేదంటే.. దాని తీవ్రతను తగ్గించడమో చేయాలని హీరో, నిర్మాతలు, డైరెక్టర్‌ దృష్టికి కియారా తీసుకెళ్లారట. అయితే దీనిపై యష్, గీతూ మోహన్‌దాస్‌లు ఇప్పటి వరకు ఏ నిర్ణయం తీసుకోలేదట. మరి కియారా విజ్ఞప్తి మేరకు మేకర్స్ వెనక్కి తగ్గుతారా? లేక కియారాతోనే నయానో భయానో ఒప్పించి ఈ సీన్ తీస్తారా? అనేది చూడాలి.

Read more about: yash toxic kiara advani
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X