Yashoda First Glimpse : ఆసక్తి రేపుతున్న యశోద గ్లింప్స్.. సమంతకు అసలు ఏమైంది?
వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్న సమంత ఎలాంటి ఆఫర్ వచ్చినా కాదనకుండా చేసుకుంటూ వెళుతోంది. అందులో భాగంగా ఆమె చేస్తున్న లేడీ ఓరియెంటెడ్ సినిమా యశోదకు సంబంధించిన అప్డేట్ విడుదల చేశారు సినిమా మేకర్స్. యశోద సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇక ఈ గ్లింప్స్ చూస్తుంటే ఈ సినిమా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ అని ఈజీగా అర్థమైపోతుంది. ఇక ఆ గ్లింప్స్ ఎలా ఉంది అనే వివరాల్లోకి వెళితే

కీలక పాత్రల్లో
స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం యశోద. హరీష్ శంకర్ - హరీష్ నారాయణ అనే ఇద్దరు దర్శకులు తెరకెక్కిస్తున్న ఈ సినిమాను శ్రీదేవి మూవీస్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన తాజా అప్డేట్ ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాలో సమంతతో పాటు వరలక్ష్మి శరత్ కుమార్ మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

తనను తాను తడిమి
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏక కాలంలో ఈ సినిమాని ఆగస్టు 12వ తేదీన విడుదల చేస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేశారు. ఇక నిడివి తక్కువ ఉన్న ఫస్ట్ గ్లింప్స్ లో సమంత ఒక బెడ్ మీద నుంచి లేచి చూసుకుంటుంది. ఆమెకు ఎక్కడ ఉన్నాను అనే విషయం అర్థం కాకపోవడంతో తనను తాను తడిమి చూసుకుంటుంది.

గర్భవతిగా?
ఆ తర్వాత ఆమె లేచి వెళ్ళి కిటికీ ఓపెన్ చేయడంతో వీడియో ముగించారు ఇక ఈ వీడియోలో కనిపిస్తున్న దాని ప్రకారం సమంత గర్భవతి పాత్రలో కనిపిస్తుందని కొంత వరకు ప్రచారం మొదలైంది. అలాగే ఆమె ఒక నర్సు పాత్ర లేదా హ్యూమన్ ట్రైల్స్ చేయించుకుంటున్న వ్యక్తి పాత్రలో నటించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది..

హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్
సైన్స్ థ్రిల్లర్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమాకు ఫిమేల్ సెంట్రిక్ సినిమా అని చెబుతున్నారు. అయితే ఫిమేల్ సెంట్రిక్ సినిమా అయినప్పటికీ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు కూడా భారీ ఎత్తున ఉంటాయని తెలుస్తోంది. అందుకోసమే హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ ఒకరిని ఈ సినిమా యాక్షన్ కొరియోగ్రఫీ కోసం తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. శ్రీదేవి మూవీస్ బ్యానర్ మీద శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ సినిమాను భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు.
వరుస సినిమాలతో
ఇక సమంత నటిస్తున్న ఇతర సినిమాల విషయానికి వస్తే ఆమె హీరోయిన్ గా నటించిన కన్మణి రాంబో ఖతీజా విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకుంటోంది. ఇక ఆమె హీరోయిన్ గా గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన శాకుంతలం సినిమా కూడా విడుదలకు సిద్ధమవుతోంది. ఇవి కాకుండా సమంతా ఒక ఇంటర్నేషనల్ ప్రాజెక్టుకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతేగాక విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న శివ నిర్వాణ సినిమాలో కూడా ఆమె హీరోయిన్ గా నటిస్తోంది. ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ లో జరుగుతోంది. ఈ సెట్స్ లో ఉండగానే సమంత పుట్టిన రోజు వేడుకలను కూడా యూనిట్ ఘనంగా జరిపింది.


Click it and Unblock the Notifications











