యాత్ర దర్శకుడితో తమన్నా.. మరో రీమేక్ చిత్రం!

మిల్కీ బ్యూటీ తమన్నాకు యువతలో విపరీతమైన క్రేజ్ ఉంది. అందం, అభినయంతో తమన్నా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఇటీవల వెంకటేష్ సరసన ఎఫ్2 చిత్రంలో నటించి ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. హీరోయిన్ గా కొనసాగుతూనే అప్పుడప్పుడూ ఐటమ్ సాంగ్స్ లో కూడా మెరుస్తోంది తమన్నా. ప్రస్తుతం తమన్నా పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది. హిందీలో ఘనవిజయం సాధించిన క్వీన్ తెలుగు రీమేక్ దట్ ఈజ్ మహాలక్ష్మిలో తమన్నా నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇదిలా ఉండగా తమన్నా మరో రీమేక్ చిత్రంలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వైఎస్ఆర్ బయోపిక్ యాత్రతో గుర్తింపు పొందిన మహి వి రాఘవ్ గతంలో ఆనందో బ్రహ్మ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ చిత్రం పర్వాలేదనిపించింది. ఈ చిత్రాన్ని మహి వి రాఘవ్ తమిళంలో రీమేక్ చేయాలని భావిస్తున్నాడట. తాప్సి నటించిన పాత్రలో తమన్నా నటించబోతోందంటూ వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Yatra fame Mahi V Raghav will going to direct Tamannah for a Tamil movie

తమన్నా ప్రస్తుతం సైరా నరసింహారెడ్డి, అభినేత్రి 2 లాంటి చిత్రాల్లో నటిస్తోంది. సుందర్ సి దర్శత్వంలో విశాల్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రంలో తమన్నా నటిస్తోంది. బాలీవుడ్ చిత్రాల్లో నటించేందుకు కూడా తమన్నా ప్రయత్నాలు చేస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X