Year Ender 2023: ఈ ఏడాది ఇండియాలో టాప్ 10 హీరోయిన్స్ వీళ్లే... 2వ స్థానంలో సమంత, నంబర్ 1 ఎవరో తెలుసా?
ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ ఈ ఏడాది 2023లో ఇండియాలో టాప్ 10 హీరోయిన్లు ఎవరు అనే దానిపై సర్వే నిర్వహించింది. దీనికి సంబంధించి ఇండియాలో టాప్ 10 హీరోయిన్స్ జాబితాను రిలీజ్ చేసింది ఆర్మాక్స్. ఇక ఈ టాప్ 10 హీరోయిన్స్ ను సోషల్ మీడియా వేదికగా, ఆన్ లైన్ ఆధారంగా సర్వే నిర్వహిస్తుంది ఆర్మాక్స్. ఇక దేశంలో ఉన్న హీరోయిన్లలో ఎవరు ఎక్కువ ఆదరణ పొందుతున్నారనే దానిపై సర్వే నిర్వహించిన ఆర్మాక్స్ టాప్ 10 హీరోయిన్ల లిస్టును రిలీజ్ చేసింది. ఇండియా వైడ్ గా మన టాలీవుడ్ హీరోయిన్ సమంత నంబర్ 2వ స్థానంలో ఉంది. ఇక నంబర్ వన్ స్థానంలో ఎవరు ఉన్నారు.. టాప్ 10 హీరోయిన్లలో మన టాలీవుడ్ హీరోయిన్స్ ఎవరు అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఇండియాలో టాప్ హీరోయిన్ ఎవరు అంటే టక్కున ఎవరికి నచ్చిన వారిని వారు చెప్పుకుంటారు. అయితే ఎవరికి ఉండే ప్రాముఖ్యత వారికి ఉంటుందనే విషయం తెలిసిందే. అయితే ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ సినీ తారాలపై సర్వే నిర్వహిస్తుంది. తాజాగా 2023 ఇండియాలో టాప్ 10 హీరోయిన్స్ ఎవరో సర్వే నిర్వహించింది. అందులో టాప్ 10 హీరోయిన్ వీళ్లే అంటూ ఓ జాబితాను సోషల్ మీడియా ఖాతా వేదికగా పంచుకుంది.

2023 పాన్ ఇండియా లెవెల్ లో టాప్ 10 హీరోయిన్స్ లో నంబర్ వన్ గా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నిలిచింది. అలియా భట్ బాలీవుడ్ భామ అయినా... ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు వారికి ఈ భామ పరిచయం అయింది. ఇక ఈ భామ 2023 ఏడాదిలో టాప్ హీరోయిన్ గా స్థానం సంపాదించుకుంది.ఇక రెండో స్థానంలో టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత కైవసం చేసుకుంది. సినిమాలకు బ్రేక్ ఇచ్చినా కూడా ఈ భామ టాప్ 2లో నిలవడం గమనార్హం. ప్రస్తుతం ఈ బ్యూటీ సిటాడెల్ అనే వెబ్ సిరీస్ చేస్తుంది.

టాప్ 3లో అందాల భామ దీపికా పదుకునె నిలిచింది. ఇటీవల జవాన్ సినిమాలో అథితి పాత్రలో నటించిన ఈ భామ.. పాన్ ఇండియా లెవెల్ టాప్ 3 హీరయిన్ స్థానాన్ని దక్కించుకుంది. ఇక టాప్ 4లో కత్రీనా కైఫ్ నిలిచింది. ఈ భామ ఇటీవల టైగర్ 3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది కానీ ఆశించిన స్థాయిలో ఆ సినిమా ఆడలేదు. అయినా కత్రీనా సీన్స్ కు మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది
టాప్ 5లో త్రిష నిలువగా... ఈ భామ సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస సినిమాలు చేస్తూ.. టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది. పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1, పార్ట్ 2, లియో, ది రోడ్ వంటి చిత్రాలు చేసిన మెప్పించింది. ఇక ఈ భామ చేతిలో స్టార్ హీరోల చిత్రాలు ఉన్నాయి. చిరంజీవి చిత్రంలో కూడా నటిస్తుందని తెలుస్తోంది. ఇక టాప్ 6 స్థానంలో నయనతార నిలిచింది. ఈ భామ ఇటీవల జవాన్ చిత్రం, అన్నపూర్ణి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకుంది.
టాప్ 7లో బాలీవుడ్ హీరోయిన్ కైరా అద్వానీ నిలిచింది. ఈ భామ ప్రస్తుతం రామ్ చరణ్ తో కలిసి గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. టాప్ 8లో కాజల్ అగర్వాల్ నిలువగా... టాప్ 9 రష్మిక మందన్నా నిలిచింది. ఈ భామ యానిమల్ సినిమాతో హిట్ కొట్టి.. ప్రస్తుతం ది గర్ల్ ఫ్రెండ్ చిత్రంలో నటిస్తుంది. ఇక టాప్ 10లో అనుష్క శెట్టి నిలిచింది. ఇవండి ఇండియాలో టాప్ 10 హీరోయిన్స్ లిస్ట్.


Click it and Unblock the Notifications











