47 ఏళ్ల వయసులో ఇంత అందమా? ఉల్లిపొర లాంటి డ్రస్స్‌లో నాగ్ హీరోయిన్ కవ్వింపు!

ఒకప్పుడు సౌత్, నార్త్ తేడా లేకుండా యావత్ దేశాన్ని ఒక ఊపు ఊపింది పూజా బాత్రా. 50కి చేరువ అవుతున్నా ఇప్పటికీ చెక్కు చెరగని అందంతో సెగలు రేపుతున్నారు పూజ. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటోలు, వీడియోలతో హల్ చేస్తుంటారు పూజా బాత్రా. తాజాగా ఈ హాట్ బ్యూటీ ఇన్న‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియో వైరల్ తెగవైరలవుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..

అక్టోబర్ 27, 1976న ఉత్తరప్రదేశ్‌లోని ఫైజాబాద్‌లో జన్మించారు పూజా బాత్రా. మోడలింగ్‌ పై ఇంట్రెస్ట్ తో మోడలింగ్ లోకి అడుగుపెట్టింది. 1993లో ఫెమినా మిస్ ఇండియా రన్నరప్‌గా నిలిచిన ఆమె అదే ఏడాది జరిగిన ఫెమినా మిస్ ఇండియా ఇంటర్నేషనల్ కిరీటాన్ని గెలుచుకున్నారు. ఈ హోదాతో మిస్ ఇంటర్నేషనల్ 1993 కాంటెస్ట్‌లో భారతదేశం తరపున ప్రాతినిథ్యం వహించారు. ఈ దెబ్బతో ఆమె పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది.

yesteryear actress pooja batra looks stunning and sizzling with top class glamour

దేశంలోని ఎన్నో కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వాణిజ్య ప్రకటనల్లో నటించారు. ఈ ఫేమ్‌తో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది పూజ బాత్రా. అలా.. 1997 లో 'విరాసత్'అనే మూవీతో ముఖానికి మేకప్ వేసుకున్నారు. ఈ సినిమా సూపర్‌హిట్‌గా నిలువడంతో ఆమెకు అవకాశాలు క్యూకట్టాయి. ఆ తర్వాత సునీల్ శెట్టితో కలిసి 'భాయ్'లో నటించింది. అనంతరం 'హసీనా మాన్ జాయేగీ', 'దిల్ నే ఫిర్ యాద్ కియా', 'కహిన్ ప్యార్ న హో జాయే', 'నాయక్: ది రియల్ హీరో', 'తాజ్ మహల్: యాన్ ఎటర్నల్ లవ్ స్టోరీ', 'తలాష్', 'సాజీష్' వంటి హిట్ చిత్రాల్లో హీరోయిన్ నటించింది.

హిందీలోనే కాదు.. దక్షిణాదిలోనూ ఎన్నో సినిమాల్లో నటించారు పూజా బాత్రా. తెలుగులో అగ్రకథానాయకుడు నాగార్జునతో సిసింద్రీలో స్పెషల్ సాంగ్ చేసిన ఈ హాట్ బ్యూటీ.. తరువాత దాసరి అరుణ్‌ హీరోగా తెరకెక్కిన గ్రీకు వీరుడు సినిమాలో హీరోయిన్‌గా నటించింది. తెలుగుతో పాటు తమిళ, మలయాళంలో పలు సినిమాలో నటించింది. మోడల్‌గా, హీరోయిన్‌గా కెరీర్ పీక్స్‌లో ఉండగానే వివాహం చేసుకుని షాకిచ్చారు పూజా బాత్రా.

అమెరికాలో స్థిరపడిన డాక్టర్‌ సోను ఎస్ అహ్లువాలియాను ఆమె పెళ్లాడారు. కానీ వీరి కాపురం ఎంతో కాలం సజావుగా సాగకపోవడంతో విడాకులు తీసుకున్నారు. ఈ క్రమంలో నటుడు నవాబ్ షాను పెళ్లాడారు. 2019లో ఢిల్లీలో ఆర్య సమాజ్‌లో వీరి వివాహం జరిగింది. సినిమాలే కాదు తనను ఈ స్థాయికి తీసుకొచ్చిన సమాజానికి ఎంతో కొంత తిరిగివ్వాలనే ఉద్దేశంతో ఎన్నో సేవా కార్యక్రమాలకు పూజా విరాళాలు అందజేశారు. అనాథలు, పేద పిల్లలు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టి తన మంచి మనసు చాటుకున్నారు.

కాగా.. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే పూజా బాత్రా హాట్ హాట్ ఫోటో షూట్లు నిర్వహించి వాటిని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తుంటారు. తాజాగా ఉల్లిపొర లాంటి డ్రెస్ వేసి లోపలి అందాలు కనిపించేలా షూట్ చేసిన వీడియోను పూజా బాత్రా పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి ఇంకేందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి.

More from Filmibeat

Read more about: pooja batra movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X