ఎలక్షన్ రిజల్ట్ తర్వాత అన్నావ్... ఏమైంది? విజయ్ దేవరకొండను నిలదీసిన హీరోయిన్!
Recommended Video

తెలుగు సినిమా పరిశ్రమలో అతి తక్కువ కాలంలోనే ఎక్కువ విజయాలు అందుకోవడంతో పాటు 'గీత గోవిందం' సినిమాతో డబుల్ బ్లాక్‌బస్టర్ తన ఖాతాలో వేసుకుని రూ. 100 కోట్ల కలెక్షన్స్ సాధించే స్టార్ హీరోల క్లబ్‌లో చేరిపోయాడు విజయ్ దేవరకొండ. గీత గోవిందం చిత్రంలో తనతో పాటు నటించిన హీరోయిన్ రష్మిక ట్విట్టర్ వేదికగా అతడిని నిలదీయడం హాట్ టాపిక్ అయింది.
ప్రస్తుతం విజయ్ దేవరకొండ 'మైత్రి మూవీస్' నిర్మిస్తున్న డియర్ కామ్రేడ్ చిత్రంలో నటిస్తున్నాడు. తెలంగాణ ఎన్నికల్లో తాను అనుకున్నట్లు ఫలితాలు వస్తే యూనిట్ మొత్తానికి పార్టీ ఇస్తానని మాట ఇచ్చాడట.

కేటీఆర్ అభిమాని
విజయ్ దేవరకొండ... టీఆర్ఎస్ నేత కేటీఆర్ అభిమాని అని తెలిసిందే. తెలంగాణ శాసన సభ ఎన్నికల ముందు పలు ఇంటర్వ్యూల్లో కేటీఆర్‌ను, ఆయన ఐడియాలజీని ప్రశంసిస్తూ కామెంట్స్ చేశారు. దీని ద్వారా తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి పరోక్షంగా తన మద్దతు ప్రకటించారు.

పార్టీ ఇస్తాను అన్నావ్.. ఏమైంది?
తెలంగాణ ఎన్నికలు ముగిశాయి. మరోసారి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో హీరోయిన్ రష్మిక ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు. ఎలక్షన్స్ రిజల్ట్ తర్వాత పార్టీ ఇస్తాను అన్నావ్.. ఏమైంది? అంటూ ట్వీట్ చేసింది. రష్మిక ట్వీట్ చూస్తుంటే టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే పార్టీ ఇస్తానని విజయ్ మాట ఇచ్చిటన్లు స్పష్టం అవుతోంది.

ట్వీట్ మామూలుగా లేదుగా...
నా పార్టీ ఏమైంది? ఎన్నికల ఫలితాల తర్వాత సెట్లో అందరికీ పార్టీ ఇస్తాను అన్నావ్..... మిస్టర్ ఫిల్మ్ ఫేర్, రౌడీవేర్ ఓనర్, గూగుల్‌లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన నటుడా, ఎక్కువ మంది గూగుల్ సెర్చ్ చేసిన సినిమాలో కథానాయకుడా... అంటూ ఓ రేంజిలో ట్వీట్ చేసింది రష్మిక.
డియర్ కామ్రేడ్
విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటిస్తున్న ‘డియర్ కామ్రేడ్' చిత్రానికి భరత్ కమ్మ దర్శకత్వం వహిస్తుండగా... మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈచిత్రం ఫిబ్రవరి లేదా మార్చిలో విడుదలయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











