కృతి శెట్టి అందాల ఉప్పెన.. తొలిసారి హద్దు దాటి మరీ గ్లామర్ షో
సాధారణంగా ఏ హీరోయిన్ అయినా స్టార్‌గా మారాలంటే చాలా సినిమాల్లో నటించాల్సి ఉంటుంది. కానీ, కొందరు మాత్రం కెరీర్ మొదలెట్టిన కొత్తలోనే సెన్సేషన్ అవుతున్నారు. అలాంటి వారిలో క్యూట్ లేడీ కృతి శెట్టి ఒకరు. టాలీవుడ్‌లోకి ఎంటరైన చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన ఈ బ్యూటీ.. ఎన్నో అవకాశాలను సొంతం చేసుకుంది. అయితే, వరుసగా ఫ్లాపులు రావడంతో ఇప్పుడు కాస్త స్లో అయింది. ఇక, సోషల్ మీడియాలో తెగ రచ్చ చేసే కృతి శెట్టి.. తాజాగా కొన్ని బోల్డు ఫొటోలను షేర్ చేసింది. ఎందుకు ఆలస్యం? వాటిని మీరే చూడండి!
ఉప్పెనతో సంచలనంగా:చిన్న వయసులోనే మోడల్ అయిన కృతి శెట్టి 2019లో వచ్చిన 'సూపర్ 30' అనే హిందీ చిత్రం ద్వారా హీరోయిన్‌గా ప్రయాణం మొదలు పెట్టింది. ఆ వెంటనే 'ఉప్పెన' మూవీతో టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంటరైంది. ఇందులో అదిరిపోయే నటన, అందంతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసేసింది. ఫలితంగా మొదటి చిత్రంతోనే ఈ అమ్మడు సంచలనంగా మారింది.

హిట్లతో లక్కీ హీరోయిన్‌గా:'ఉప్పెన' హిట్ అవడంతో కృతి శెట్టికి తెలుగులో ఆఫర్లు పోటెత్తాయి. అందుకు అనుగుణంగానే ఆమె వచ్చిన ప్రతి సినిమానూ చేస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే ఈ అమ్మడు వరుసగా 'శ్యామ్ సింగ రాయ్', 'బంగార్రాజు' వంటి చిత్రాల్లో నటించి హిట్లను ఖాతాలో వేసుకుంది. దీంతో కృతి శెట్టి టాలీవుడ్‌లో లక్కీ హీరోయిన్‌గా మారింది. తద్వారా మార్కెట్‌ను కూడా పెంచుకుంది.
వరుస ఫ్లాపులతో బిగ్ షాక్:హీరోయిన్‌గా వచ్చిన కొత్తలోనే ఎన్నో హిట్లను సొంతం చేసుకున్న కృతి శెట్టికి మరిన్ని అవకాశాలు వచ్చాయి. దీంతో వరుసగా సినిమాలు చేస్తూ వచ్చింది. అయితే ఆమె నటించిన 'ది వారియర్', 'మాచర్ల నియోజకవర్గం', 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి', 'కస్టడీ' మూవీలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మిగిలాయి. దీంతో కృతికి వరుస షాక్‌లు తగిలాయి.

ఆ సినిమాలు మాత్రమే:వరుస ఫ్లాపులతో సతమతం అవుతోన్న కృతి శెట్టికి ఇప్పుడు తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి. కానీ, వేరే భాషల్లో మాత్రం కొన్ని ఆఫర్లను అందుకుని ఫుల్ బిజీగా గడుపుతోంది. ఇలా ప్రస్తుతం కృతి శెట్టి మలయాళంలో Ajayante Randam Moshanam, తమిళంలో 'జీనీ' అనే సినిమాలు చేస్తోంది. అలాగే, కార్తీతో ఒక సినిమా, శర్వానంద్‌తో మరో మూవీలోనూ నటిస్తోంది.
సోషల్ మీడియాలో బిజీ:హీరోయిన్‌గా ప్రమాణం మొదలు పెట్టినప్పటి నుంచి ఏకధాటిగా మూవీలు చేస్తూ వెళ్తోన్న కృతి.. సోషల్ మీడియాలో సైతం యమ యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో సుదీర్ఘ కాలంగా సందడి చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు తన సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత వివరాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. అలాగే, ఫొటోలను, వీడియోలు వదులుతూ రచ్చ లేపుతోంది.

కొంటెగా చూపిస్తూ ట్రీట్:క్యూట్ హీరోయిన్ కృతి శెట్టి సోషల్ మీడియాలో చాలా కాలంగానే హల్చల్ చేస్తోంది. అయితే, చాలా మంది హీరోయిన్లులా ఈ అమ్మడు ఆరంభంలో గ్లామర్ షో మాత్రం పెద్దగా చేయలేదు. కానీ, ఈ మధ్య కాలంలో మాత్రం ఆమె తన అందాలను చూపిస్తూ టెంప్ట్ చేస్తోంది. ఇందులో భాగంగానే తరచూ తన గ్లామర్ ట్రీట్ ఇస్తూ దిగిన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను వదులుతోంది.
కృతి శెట్టి పిక్స్ వైరల్‌గా:బ్యూటిఫుల్ హీరోయిన్ కృతి శెట్టి తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె డీప్ నెక్ డిజైన్‌తో ఉన్న డ్రెస్ వేసుకుని హాట్ షో చేస్తూ ఫొటోలను దిగింది. ఈ పిక్స్‌లో ఆమె లేలేత అందాలు తెగ హైలైట్ అవుతున్నాయి. ఫలితంగా వీటికి నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఇవన్నీ విపరీతంగా వైరల్ అయిపోయాయి.


Click it and Unblock the Notifications











