అనంతపురం హీరోయిన్ టాప్ టూ బాటమ్ షో.. లేలేత అందాలన్నీ దర్శనం ఇచ్చేలా!
సాధారణంగా సినిమాల్లో రాణించాలంటే అందం, టాలెంట్ మాత్రమే ఉంటే సరిపోదు. దానికి తగ్గట్లుగా అదృష్టంతో పాటు కథల ఎంపికలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవి లోపించడం వల్లే ఎంతో మంది కెరీర్‌లను సక్సెస్ చేసుకోవడం లేదు. అలాంటి వారిలో ప్రియాంక జవాల్కర్ ఒకరు. టాలీవుడ్‌లో కొన్ని సినిమాలు చేసిన ఈ భామ.. తనదైన రీతిలో మెప్పించింది. కానీ, ఆశించిన రీతిలో ఆఫర్లను సొంతం చేసుకోవడం లేదు. కానీ, సోషల్ మీడియాలో తెగ హడావిడి చేస్తోంది. ఇలా తాజాగా ప్రియాంక కొన్ని బోల్డు ఫొటోలను షేర్ చేసింది. వాటిని మీరే చూసేయండి మరి!
అలా వచ్చిన తెలుగమ్మాయి
ప్రియాంక జవాల్కర్ అనంతపురానికి చెందిన మరాఠి ఫ్యామిలీలో పుట్టింది. టీనేజ్‌లో మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. అలా తనదైన అందంతో ఫిల్మ్ మేకర్ల దృష్టిని ఓ రేంజ్‌లో ఆకట్టుకుంది. దీంతో ఆమెకు చదువుకునే రోజుల్లోనే సినిమా ఆఫర్లు పోటెత్తాయి. ఈ క్రమంలోనే ప్రియాంక 2017లో వచ్చిన 'కల వర మాయే' అనే చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.

ట్యాక్సీవాలతో బిగ్గెస్ట్ సక్సెస్
టాలీవుడ్‌లో మంచి ప్రారంభాన్ని దక్కించుకోని ప్రియాంక జవాల్కర్‌కు ఆ వెంటనే విజయ్ దేవరకొండ నటించిన 'ట్యాక్సీవాలా' చిత్రంలో ఆఫర్ లభించింది. ఇది సూపర్ డూపర్ హిట్ అయింది. అదే సమయంలో ఈ మూవీలో ప్రియాంక తనదైన అందం, అభినయంతో రాణించడంతో తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ పాపులర్ అయింది. అలాగే క్రష్ లిస్టులోనూ చేరిపోయింది.
మరో హిట్ కొట్టి.. నో ఆఫర్లు
ట్యాక్సీవాలా తర్వాత ప్రియాంక జవాల్కర్‌కు ఆఫర్లు ఆశించిన రీతిలో రాలేదు. ఈ పరిస్థితుల్లో సత్యదేవ్‌తో కలిసి 'తిమ్మరుసు' అనే చిత్రం చేసింది. దీని తర్వాత కిరణ్ అబ్బవరంతో 'ఎస్ఆర్ కల్యాణమండపం' మూవీలో చేసింది. ఈ మూవీ సెన్సేషనల్ హిట్ అయింది. దీని తర్వాత ఊపు వస్తుందని అనుకున్నా ఈ అమ్మడు 'గమనం' అనే సినిమాలో మాత్రమే చేసింది.

అందులో యమా బిజీగానే
సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే దానికంటే ముందే పాపులర్ అయిన ప్రియాంక జవాల్కర్.. సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గానే ఉంటోంది. చాలా కాలం పాటు వరుసగా సినిమాలు చేసినా.. ఈ అమ్మడు మాత్రం ఇందులో యమా సందడి చేస్తూనే ఉంటోంది. ఇలా ఎప్పటికప్పుడు తన సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత వివరాలను ఫాలోవర్లతో పంచుకుంటూ క్రేజ్ పెంచుకుంటోంది.
అందాలతో వల వేస్తోంది
యంగ్ బ్యూటీ ప్రియాంక జవాల్కర్ సోషల్ మీడియాలో చాలా కాలంగా హడావిడి చేస్తోంది. ముఖ్యంగా సినిమాల్లో పెద్దగా గ్లామర్ షో చేయని ఈ భామ.. ఇందులో మాత్రం అప్పుడప్పుడూ పరువాలను ప్రదర్శిస్తోంది. ఇందులో భాగంగానే తన లేలేత అందాలను చూపిస్తూ దిగిన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. ఫలితంగా ప్రియాంక పేరు మారుమ్రోగిపోతోంది.

ఘాటు ఫొటోలు షేర్ చేసి
తెలుగు అమ్మడు ప్రియాంక జవాల్కర్ తాజాగా కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె చినిగిపోయినట్లుగా ఉన్న ఓపెన్ డ్రెస్ వేసుకుని మరీ అందాలను ఫోకస్ చేస్తూ ఎన్నో ఫొటోలు ఇచ్చింది. దీంతో ఈ అమ్మడి అందాలు బాగా కవ్విస్తున్నాయి. దీంతో ప్రియాంక షేర్ చేసిన ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చి.. ఇవన్నీ ఫుల్ వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











