సమంత సినిమాలో యంగ్ హీరో.. నందిని రెడ్డి దర్శకత్వంలో!
సమంత అద్భుతమైన అవకాశాలు అందుకుంటూ విజయాలు సాధిస్తోంది. ఈ ఏడాది సమంత నటించిన ప్రతి చిత్రానికి ప్రశంసలు దక్కాయి. సమంత నటించిన రంగస్థలం చిత్రం ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. అభుమన్యుడు, మహానటి చిత్రాలు కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఇక సమంత ప్రధాన పాత్రలో రూపొందిన యూటర్న్ చిత్రానికి ప్రశంసలు లభించాయి.
తాజాగా సమంత మరో ఆసక్తికర చిత్రానికి సిద్ధం అవుతోంది. దర్శకురాలు నందిని రెడ్డి సమంత ప్రధాన పాత్రలో ఓ చిత్రాన్ని ప్లాన్ చేస్తోంది. త్వరలోనే ఈ చిత్రం ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో యంగ్ హీరో నాగ శౌర్య కీలక పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

నందిని రెడ్డి దర్శత్వంలో నాగ శౌర్య కళ్యాణ వైభోగమే చిత్రంలో నటించాడు. ఇదిలా ఉండగా ఈ చిత్రం రీమేక్ అనే ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబందించిన మరిన్ని విశేషాలు తెలియనున్నాయి.


Click it and Unblock the Notifications











