లవర్‌తో యంగ్ హీరోయిన్ బ్రేకప్.. వెంటనే మరొకరితో డేటింగ్.. అంబానీ పెళ్లిలో జరిగిన లవ్ జాదూ!

విడాకులు, మరణం వంటి అసాధారణ పరిస్ధితుల్లో జీవిత భాగస్వామిని కోల్పోయిన వ్యక్తులు ఒంటరితనంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బంధుమిత్రులు ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా ఉండి.. పట్టించుకునేవారు లేక ఎందరో డిప్రెషన్‌లోకి వెళ్లి బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఒంటరితనం అనే వ్యాధి రానున్న రోజుల్లో ప్రపంచాన్ని పట్టి కుదిపేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే వయసుతో సంబంధం లేకుండా ఓ తోడు వెతుక్కునే వారు ఇటీవలికాలంలో ఎక్కువవుతున్నారు.

సామాన్యుల కంటే సెలబ్రెటీలు ఈ విషయంలో ముందుంటున్నారు. పెళ్లి చేసుకోవడానికి, విడిపోవడానికి, మరొకరితో రిలేషన్‌ పెట్టుకోవడానికి వీరు పెద్డగా టైం తీసుకోరు. టాలీవుడ్ టూ బాలీవుడ్ ఇలాంటి జంటలు ఎందరో. ఎప్పుడు ఎవరు సోషల్ మీడియాలో డైవర్స్ అంటూ బాంబు పేలుస్తారోనని ఫ్యాన్స్ , సినీ జనాలు టెన్షన్ పడుతున్నారు. సెలబ్రెటీ కపుల్స్ తమ ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నా.. పర్సనల్ ఫోటోలు డిలీట్ చేసినా, ప్రొఫైల్ పేరు మార్చినా బ్రేకప్‌పై హింట్ ఇచ్చినట్లే . గతంలో కొందరు ఇలాగే తమ ఉద్దేశ్యాన్ని బయటపెట్టడమే అభిమానుల భయానికి కారణం.

young heroine Ananya Panday dating Walker Blanco after breakup with Aditya Roy Kapoor

రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత ముఖేష్ అంబానీ - నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ - రాధిక మర్చంట్‌ల వివాహం ఇటీవల ఘనంగా జరిగింది. దేశ విదేశాలకు చెందిన సినీ, రాజకీయ, పారిశ్రామిక తదితర రంగాల ప్రముఖులు ఈ వేడుకకు తరలివచ్చారు. అయితే ఇంతటి గ్రాండ్ ఈవెంట్‌లో విశ్వసుందరి ఐశ్వర్య రాయ్ తన భర్త అభిషేక్ బచ్చన్‌తో కాకుండా కుమార్తె ఆరాధ్యతో సింగిల్‌గా అటెండ్ కావడంతో విడాకుల వార్తలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో అభిషేక్ బచ్చన్ హీనా ఖండేల్వాల్ ఇన్‌స్టాలో పెట్టిన విడాకుల పోస్ట్‌కు లైక్ కొట్టడంతో పుకార్లకు బలం చేకూరినట్లయ్యింది. ఆల్రెడీ అభిషేక్ - ఐశ్వర్యలకు విడాకులు మంజూరై సెపరేట్ అయినట్లుగా కథనాలు వస్తున్నాయి.

ఇక ఇదే పెళ్లిలో మరో సెలబ్రెటీ కపుల్‌ బ్రేకప్‌‌ను అఫీషియల్‌గా ఇచ్చింది. హిందీ నటి అనన్య పాండే .. ఆదిత్యరాయ్ కపూర్‌తో రిలేషన్‌కు ఫుల్‌స్టాప్ పెట్టి.. అమెరికన్ మోడల్ వాకర్ బ్లాంకో‌తో డేటింగ్ మొదలెట్టినట్లుగా గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. యూరప్‌లో ఓ విలాసవంతమైన క్రూయిజ్‌లో జరిగిన అనంత్ అంబానీ - రాధిక మర్చంట్‌ల ప్రీ వెడ్డింగ్ ఈవెంట్‌లో వాకర్‌ను అనన్య తొలిసారిగా కలిశారట. వీరి పరిచయం ప్రేమగా మారి, ఇటీవలే తన స్నేహితులకు వాకర్‌ను పరిచయం చేసిందట.

young heroine Ananya Panday dating Walker Blanco after breakup with Aditya Roy Kapoor

అమెరికా పౌరుడైన వాకర్.. ప్రస్తుతం జామ్‌నగర్‌లో నివసిస్తూ, అంబానీల ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ వంటారా నేషనల్ పార్క్‌లో పనిచేస్తున్నాడు. అనంత్ అంబానీ పెళ్లిలో వాకర్‌తో కలిసి అనన్య ఓ రొమాంటిక్ సాంగ్‌కి స్టెప్పులేయడాన్ని బాలీవుడ్ జనాలు చూసి అప్పుడే ముక్కున వేలేసుకున్నారు. వాకర్ బ్లాంకోని అనన్య తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవ్వడం ద్వారా.. డేటింగ్ గాసిప్స్‌ ఊహాగానాలు కాదని రుజువు చేస్తున్నాయి. అంతకుముందు యంగ్ హీరో ఆదిత్యరాయ్ కపూర్‌తో ఆగస్ట్ 2022లో డేటింగ్ ప్రారంభించిన అనన్య.. మే 2024లో బ్రేకప్ చెప్పింది. అతనికంటే ముందు .. ఇషాన్ ఖట్టర్‌తో మూడేళ్ల పాటు డేటింగ్ చేసింది. ఇప్పుడు వాకర్‌తోనైనా బంధాన్ని నిలుపుకుంటుందా లేక మధ్యలోనే గుడ్‌బై చెబుతుందా అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X