అర్ధరాత్రి పబ్‌లో తెలుగు నటిపై నిర్వాహకుల దాడి.. డ్రగ్స్ మత్తులో హీరోయిన్ అంటూ (వీడియో)
యువ హీరోయిన్ కల్పికపై అర్ధరాత్రి నగరంలోని పబ్ యాజమాన్యం దాడికి పాల్పడటం సంచలనంగా మారింది. ఆహార పదార్థాల నాణ్యతపై ప్రశ్నించినందుకు గాను, అలాగే బిల్ చెల్లింపులో వాగ్వాదం జరగడం ఈ గొడవకు, దాడికి కారణమని తెలిసింది. దాదాపు గంటన్నర సేపు పబ్ యాజమాన్యం, హీరోయిన్‌కు మధ్య గొడవ జరిగింది. నటి ఫిర్యాదుతో గచ్చిబౌలి పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకొని గొడవను సద్దుమణిగేందుకు ప్రయత్నించారు. అయితే నటి, పబ్ యాజమాన్యం ఎంతకు రాజీకి రాకపోవడంతో పోలీసులు ఆడియెన్స్‌లో చూస్తూ నిలుచున్నారనే విషయం వీడియోలో స్పష్టమైంది. ఈ వార్త వివరాల్లోకి వెళితే..
గచ్చిబౌలి విప్రో సర్కిల్‌లో ఉన్న ప్రిజమ్ పబ్‌లో తన బర్త్ డేను జరుపుకొనేందుకు టాలీవుడ్ నటి కల్పిక తన స్నేహితులతో కలిసి వెళ్లింది. అర్ధరాత్రి వరకు వారు అక్కడ వేడుకలను జరుపుకొంటూ ఎంజాయ్ చేశారు. పబ్ ముగింపు సమయంలో డిజర్ట్ విషయంలో కల్పిక అభ్యంతరం వ్యక్తం చేసింది. దాంతో వారి మధ్య గొడవకు దారి తీసింది. ఆ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.

అయితే కల్పిక అభ్యంతరం చెప్పిన విధంగా డిజర్ట్‌కు డబ్బు చెల్లించనవసరం లేదు. మిగితా వాటికి బిల్ చెల్లించాలని పబ్ యాజమాన్యం పట్టుబడ్డింది. అయితే తన పట్ల దురుసుగా ప్రవర్తించారు. కాబట్టి బహిరంగంగా, బేషరుతుగా క్షమాపణ చెబితే గానీ బిల్ కట్టనని మొండికేశారు. దాంతో ఇద్దరు తమ బెట్ కొనసాగించడంతో వివాదం కొనసాగడమే కాకుండా ఇరువురు ఒకరిపై మరొకరు మాటల దాడికి పాల్పడ్డారు. తీవ్రమైన ఆరోపణలు చేసుకొన్నారు అనేది వీడియోల స్పష్టమైంది.
నటి కల్పికపై నిర్వాహకులు వివాదంపై సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. వీడియోలో పేర్కొన్న విధంగా అమ్మాయిలు అర్ధరాత్రి పబ్‌కు వస్తారా? అంటూ కల్పికపై నిర్వాహకులు కామెంట్ చేసింది. నిర్వాహకులు బూతులు, అసభ్యంగా ప్రవర్తించారు. నటిని ఉద్దేశించి ఓ అమ్మకే పుట్టావా? నువ్వు అసలు ఆడదానివేనా అంటూ కామెంట్ చేశాడు. పబ్ యజమాని, నిర్వాహకులు ప్రణీత్, అంథోని దురుసుగా వ్యవహరించారు అనే విషయం కల్పిక సోషల్ మీడియా అకౌంట్ స్ట్రీమింగ్‌లో స్పష్టమైంది.
అయితే ఈ వివాదానికి కారణం బ్రౌనీ కేక్ కావడం గమనార్హం. బర్త్ డే పార్టీకి చేసుకొన్న తర్వాత నాకు కాంప్లిమెంటరీగా కేక్ తెప్పించగలరా? అని కల్పిక అడిగితే.. అలాంటి సౌకర్యం మా పబ్ లేదు. కావాలంటే.. పక్కన షాప్ నుంచి తెప్పిస్తామని చెప్పారు. ఆ తర్వాత వారి మధ్య వాగ్వాదం ముదిరి భారీ గొడవకు దారి తీసింది. ఈ సందర్భంగా పోలీసులతో పబ్ యాజమాన్యం తీవ్రమైన ఆరోపణలు చేస్తూ.. ఆమె డ్రగ్స్ తీసుకొన్నారు అంటూ కామెంట్ చేయడం వీడియోలో వినిపించింది. అయితే డ్రగ్స్ స్పెల్లింగ్ నాకు రాదు. కావాలంటే నాకు డ్రగ్స్ టెస్ట్ చేసుకోండి అంటూ అనడం కూడా కనిపించింది.
అయితే తనకు పోలీసులు సహకారం అందించలేదు. తనకు సపోర్ట్ చేయకపోగా పబ్ నిర్వాహకులకు మద్దతు తెలపడంపై కల్పిక ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసులు ముర్దాబాద్ అంటూ ఆమె గట్టిగా అరిచింది అనేది వీడియోలో కనిపించింది. కల్పికపై ఆంథోని దుర్బాషలాడుతూ.. నీవు వేసుకొన్న బట్టలు నీవు ఏమిటో చెబుతుంది అన్నారు. తనను కించపరిచే విధంగా చేశారని కల్పిక ఆరోపించారు.
కల్పిక గణేష్ సినిమాల గురించి వస్తే.. ప్రయాణం సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి ప్రవేశించారు. ఆరెంజ్, జులాయి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, పడిపడి లేచే మనసు, నిప్పు, మా వింత గాథ వినుమా? డియర్ మార్తాండం, హిట్, యశోదా, 8 ఏఎం మెట్రో, అథర్వ సినిమాల్లో నటించింది.


Click it and Unblock the Notifications











