కృతి శెట్టికి అదొక్కటే ఆప్షనా? తప్పితే పాతాళమే

యంగ్ హీరోయిన్ కృతి శెట్టి తెలుగు ప్రేక్షకుల్లో తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. మొదటి సినిమాతోనే టాలీవుడ్ లో సెన్సేషన్ గానూ మారింది. అతి తక్కువ వయస్సుల్లోనే రూ.100 కోట్లు కలెక్ట్ చేసిన హీరోయిన్ గా కృతి శెట్టి రికార్డు క్రియేట్ చేసింది. అంతే కాకుండా ఈ ముద్దుగుమ్మ వరుసపెట్టి సినిమాలు చేస్తూ వచ్చింది. హ్యాట్రిక్ హిట్ కొట్టి తన సత్తా చాటింది. ఉప్పెన, బంగార్రాజు, శ్యాం సింగారాయ్ చిత్రాలతో చక్కటి సక్సెస్ ను అందుకుంది.

రూపసౌందర్యంతో పాటు టాలెంట్ ను జతకలిపి కొద్ది రోజుల పాటు ఇండస్ట్రీలో తన హవాను కొనసాగించింది. కానీ తర్వాత మాత్రం ఈ ముద్దుగుమ్మకు ఉన్నట్టుండి బ్యాడ్ టైమ్ స్టార్ అయ్యింది. వరుసగా రెండు డిజాస్టర్లు పడ్డాయి. ది వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, కస్టడీ, మనమే వంటి చిత్రాలు వరుసగా బెడిసి కొట్టాయి. ఆశించిన మేర ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి.

Young Heroine Krithi Shetty Key Decision for her Best Carrer

దీంతో టాలీవుడ్ ను వదిలి ఈ ముద్దుగుమ్మ కోలీవుడ్ లో అడుగుపెట్టింది. అక్కడ తన లక్ ను పరీక్షించుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ మేరకు తన కెరీర్ ప్రారంభం నుంచి కొన్ని మంచి సినిమాలు, హిట్లు ఉండటంతో తమిళంలో మాత్రం మంచి అవకాశాలే అందుతున్నాయి. చివరిగా మలయాళ చిత్రం ఏఆర్ఎంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ కృతి శెట్టికి మాత్రం ఈ మూవీ పెద్దగా ఉపయోగపడలేదు. మళ్లీ తన కెరీర్ దారిలో పడేందుకు దోహదపడలేదు.

ఇంకొన్నాళ్లు ఈ ముద్దుగుమ్మ కెరీర్ ఇలానే సాగితే... ఆమె సర్దుకోవాల్సిందేనని అంటున్నారు. ఈలోగానే కృతి శెట్టి ఏదోక ప్లాన్ తో గట్టేక్కాలని, మళ్లీ బిగ్ స్క్రీన్ పై అభిమానులను అలరించాలని ఆశిస్తున్నారు. ఈక్రమంలోనే బేబమ్మ తన కెరీర్ ను గాడీలో పెట్టేందుకు ఓ నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఏంటంటే.. కృతి శెట్టి రూటు మార్చి హీరోయిన్ గానే కాకుండా స్పెషల్ అపీయరెన్స్ తోనూ బిగ్ స్క్రీన్ పై ఆకట్టుకోబోతుందని అంటున్నారు.

Young Heroine Krithi Shetty Key Decision for her Best Carrer

ఈ మేరకు బేబమ్మ బాలీవుడ్ లోని ఓ చిత్రంలో స్పెషల్ పెర్ఫామెన్స్ కు సిద్ధమైందని అంటున్నారు. అయితే ఇంకా ఈ యంగ్ హీరోయిన్ కు ఇప్పుడే స్పెషల్ సాంగ్స్ ల్లో నటించాల్సి రావడం ఆశ్చర్యంగా మారింది. అయితే స్పెషల్ సాంగ్స్ లతో సీనియర్ హీరోయిన్లు సెకండ్ ఇన్నింగ్స్ ను జోరుగా నడిపిస్తున్న విషయం తెలిసిందే. ఒకింత బిగ్ స్క్రీన్ పై ఘాటు డాన్స్ తో మైమరిపిస్తున్న విషయం తెలిసిందే. కాగా స్పెషల్ సాంగ్ లో నటిస్తే హీరోయిన్ గా అవకాశాలు కూడా తగ్గే ప్రమాదం ఉంది. ఒకవేళ పాజిటివ్ గా రెస్పాన్స్ వెళితే.. ఒకే కానీ.. బెడికొట్టిందంటే.. ఆమె సాహసానికి కూడా ఫలితం ఉండబోదంటున్నారు. బేబమ్మ స్పెషల్ సాంగ్ లో నటిస్తుందా? అనేది కూడా ఇంకా స్పష్టం తెలియాల్సి ఉంది. ప్రస్తుతం బేబమ్మ మాత్రం తమిళంలో వరుసపెట్టి సినిమాలు చేస్తోంది. వా వాతియార్, లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ, జీనీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

More from Filmibeat

Read more about: krithi shetty tollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X