డీజే టిల్లు హీరోయిన్ నెవ్వర్ బిఫోర్ గ్లామర్ షో.. చూస్తే దిమ్మతిరిగిపోవాల్సిందే!
తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ సమయంలోనే ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకున్న హీరోయిన్లు కొందరు మాత్రమే ఉన్నారు. అలాంటి వారిలో క్యూట్ హీరోయిన్ నేహా శెట్టి ఒకరు. అందానికి అందం, నటనకు నటనతో ప్రేక్షకులను ఫిదా చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ.. వరుసగా అవకాశాలను అందుకుంటూ ముందుకు సాగుతోంది. ఇలా చేతి నిండా ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా గడుపుతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోన్న నేహా శెట్టి.. తాజాగా కొన్ని బోల్డు ఫొటోలను షేర్ చేసింది. ఎందుకు ఆలస్యం? వాటిని మీరే చూసేయండి మరి!
అక్కడి పిల్ల ఇక్కడ ఫేమస్:కర్నాటకకు చెందిన నేహా శెట్టి సినిమాల కంటే ముందు మోడల్‌గా కెరీర్‌ను మొదలెట్టింది. అలా తనదైన అందాలతో మెప్పించడంతో ఫిల్మ్ మేకర్ల దృష్టిలో పడింది. ఈ క్రమంలోనే ఈ భామ 'ముంగారు మేల్ 2' అనే కన్నడ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతో ఒక్కసారిగా ఫుల్ ఫేమస్ అయింది. దీంతో నేహాకు వేరే భాషల్లోనూ జోరుగా ఆఫర్లు వచ్చాయి.

పూరీ కొడుకు.. ఆ మూవీల్లో:నేహా శెట్టి.. పూరీ ఆకాశ్ హీరోగా చేసిన 'మెహబూబా' మూవీతో టాలీవుడ్‌లోకి ఎంటర్ అయింది. ఈ మూవీ మాత్రం అనుకున్న స్థాయిలో ఆడలేదు. అయినా ఆమెకు ఆఫర్లు మాత్రం భారీ స్థాయిలోనే వెల్లువెత్తాయి. దీని తర్వాత నేహా శెట్టి 'గల్లీ రౌడీ', 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' వంటి చిత్రాల్లో కనిపించింది. వీటిలో మెప్పించడంతో ఆమెకు ఇంకా అవకాశాలు వచ్చాయి.
రాధిక పాత్రతో సెన్సేషన్:సిద్దు జొన్నలగడ్డ - విమల్ కృష్ణ కాంబినేషన్‌లో వచ్చిన 'డీజే టిల్లు' మూవీలో నేహా శెట్టి హీరోయిన్‌గా చేసింది. ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో పాటు ఇందులో ఆమె చేసిన రాధిక పాత్రకు ఎనలేని గుర్తింపును కూడా అందించింది. ఫలితంగా ఈ క్రేజీ మూవీ నేహా శెట్టి క్రేజ్‌ను కూడా బాగా పెరిగేలా చేసింది. దీనితో ఆమె తెలుగు రాష్ట్రాల్లో ఈ అమ్మడు సెన్సేషన్ అయిపోయింది.

ఇప్పుడా సినిమాలతో బిజీ:తెలుగు చిత్ర పరిశ్రమలో కొంత కాలంగా వరుసగా ఆఫర్లను అందుకుంటూ దూసుకెళ్తోన్న నేహా శెట్టి.. 'డీజె టిల్లు' తర్వాత మరింతగా హవాను చూపిస్తోంది. ఇటీవలే ఈ ముద్దుగుమ్మ కార్తికేయతో 'బెదురులంక 2012' అనే సినిమాతో వచ్చి హిట్ కొట్టింది. కానీ, కిరణ్ అబ్బవరం 'రూల్స్ రంజన్' షాకిచ్చింది. ఇక విశ్వక్ సేన్‌తో 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' మూవీలో నేహా చేస్తుంది.
సోషల్ మీడియాలో రచ్చ:మోడల్‌గా చేస్తున్నప్పటి నుంచే సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోన్న నేహా శెట్టి.. ఈ మధ్య కాలంలో మరింతగా సందడి చేస్తోంది. ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేస్తోంది. అలాగే తన ఫొటోలు, వీడియోలను సైతం వదులుతూ నేహా శెట్టి తన రేంజ్‌ను పెంచుకుంటూ వెళ్తోంది.

అందాల ఆరబోతతో క్రేజ్:సోషల్ మీడియాలో నేహా శెట్టి చేసే హడావిడి గురించి అందరికీ తెలిసిందే. అంతలా ఆమె కొంత కాలంగా బోల్డు షో చేస్తూ కుర్రాళ్లను కవ్విస్తోంది. ఈ క్రమంలోనే తరచూ తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. వీటిలో తన లేలేత పరువాలను చూపించేవే ఎక్కువగా ఉంటున్నాయి. తద్వారా నేహా శెట్టి తరచూ వార్తల్లో నిలవడంతో పాటు సెన్సేషన్‌గా మారిపోతోంది.
నేహా శెట్టి ఫొటోలు వైరల్:యంగ్ హీరోయిన్ నేహా శెట్టి తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను వదిలింది. వీటిలో ఈ చిన్నది డీప్ నెక్ డిజైనర్ డ్రెస్‌లో అందాలు మొత్తం కనిపించేలా ఘాటు ఫోజులు ఇచ్చింది. దీంతో ఆమె గ్లామర్ చూపరులను రెచ్చగొడుతోంది. దీంతో నేహా షేర్ చేసిన ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది. తద్వారా ఈ పిక్స్ అన్నీ వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











