అందాల తెర తీసేసిన హైదరాబాద్ పిల్ల: హాట్ డ్రెస్‌లో ఘాటు ఫోజులతో కేక
తెలుగు చిత్ర పరిశ్రమలో అందం, టాలెంట్ ఉన్నా చాలా మంది అమ్మాయిలు సరైన అవకాశాలను దక్కించుకోవడం లేదు. వీరిలో చాలా మంది కెరీర్‌లను అర్ధాంతరంగా ముగించగా.. మరికొందరు మాత్రం అడపాదడపా ఆఫర్లతో సర్ధుకుపోతున్నారు. అలాంటి వారిలో హైదరాబాద్ చిన్నది నిధి అగర్వాల్ ఒకరు. తక్కువ చిత్రాలతోనే విశేషమైన గుర్తింపును తెచ్చుకున్న ఈ భామ.. తన రేంజ్ సినిమాలు చేస్తూ ముందుకు సాగుతోంది. అలాగే, సోషల్ మీడియాలోనూ సందడి చేస్తోన్న నిధి.. తాజాగా కొన్ని బోల్డు ఫొటోలను షేర్ చేసింది. వాటిని మీరే చూసేయండి!
ఇక్కడ పిల్లే.. అలా ఎంట్రీ:నిధి అగర్వాల్ హైదరాబాద్‌కు చెందిన మార్వాడి కుటుంబంలో జన్మించింది. విద్యాభ్యాసం మొత్తం నగరంలోనే పూర్తి చేసిన తర్వాత ఈ అమ్మడి ఫ్యామిలీ కర్నాటకకు మారిపోయింది. అక్కడ ఈ చిన్నది మోడల్‌గా జర్నీని స్టార్ట్ చేసి.. ఎన్నో బ్రాండ్లకు పని చేసింది. ఈ క్రమంలోనే 2017లో 'మున్నా మైఖేల్' అనే హిందీ సినిమాతో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.

వరుస ఫ్లాప్‌లతో ఇబ్బంది:హీరోయిన్‌గా పరిచయం అయిన తర్వాత నిధి అగర్వాల్ 'సవ్యసాచి' మూవీతో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. కానీ, ఇది ఆమెకు మంచి ఆరంభాన్ని అందించలేదు. ఆ తర్వాత అఖిల్‌తో 'మిస్టర్ మజ్నూ' సినిమాలోనూ చేసింది. ఇది కూడా నిరాశనే మిగల్చడంతో నిధికి ఆరంభంలోనే షాక్‌లు తగిలాయి. అయినప్పటికీ ఆమె నటన పరంగా మంచి పేరు సంపాదించుకుంది.
ఆ విజయం తర్వాత షాక్:రిజల్ట్‌లతో అస్సలు సంబంధం లేకుండా తెలుగులో నిధి అగర్వాల్‌కు ఆఫర్లు వచ్చాయి. ఈ క్రమంలోనే రామ్ 'ఇస్మార్ట్ శంకర్' సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. ఈ మూవీతో ఆమెకు మొట్టమొదటి విజయం దక్కింది. అయితే, ఆ వెంటనే నిధి అగర్వాల్ నటించిన 'హీరో' మూవీ మాత్రం షాక్‌నే ఇచ్చింది. ఆ తర్వాత తమిళంలోనూ ఈ బ్యూటీ ఓ సినిమాలో నటించింది.

పవన్, ప్రభాస్ మూవీలు:కెరీర్ ఆరంభంలో మాదిరిగా నిధి అగర్వాల్ వరుసగా సినిమాలు చేయకున్నా.. తనదైన రీతిలో ఆఫర్లను అందుకుంటోంది. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'హరిహర వీరమల్లు'లో నటిస్తోంది. అలాగే, ప్రభాస్ - మారుతి 'రాజా సాబ్' మూవీలోనూ భాగం అయింది. వీటితో పాటు వెబ్ సిరీస్‌లు, ప్రారంభోత్సవాలు, స్పెషల్ ఈవెంట్లతో నిధి ఫుల్ బిజీగా గడుపుతోంది.
అందులో యమ బిజీగా:హీరోయిన్‌గా తన ప్రయాణంలో హిట్ల కంటే ఎక్కువ ఫ్లాపులనే చూసిన నిధి అగర్వాల్.. సోషల్ మీడియాలో సైతం యమ యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో సుదీర్ఘ కాలంగా సందడి చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు తన సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత వివరాలను ఫాలోవర్లతో షేర్ చేసుకుంటోంది. తద్వారా తన ఫాలోయింగ్‌ను మరింతగా పెంచుకుంటూ ముందుకు వెళ్తోంది.

గ్లామర్ ట్రీట్‌తో సందడి:నిధి అగర్వాల్ సోషల్ మీడియాలో చేసే అందాల ఆరబోత గురించి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఇటీవలి కాలంలో ఈ అమ్మడు హాట్ షో మరింత ఎక్కువ అయిపోయింది. ఇక, ఈ మధ్య తరచూ నిధి అగర్వాల్ అందాలను ఆరబోస్తూ దిగిన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో వదులుతోంది. దీంతో ఈ అమ్మడు నేషనల్ వైడ్‌గా ట్రెండింగ్‌లో నిలుస్తోంది.
నిధి హాట్ పిక్స్ వైరల్‌గా:తాజాగా నిధి అగర్వాల్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను వదిలింది. వీటిలో ఆమె కిందకు జరిపి ఉన్న డ్రెస్‌ను వేసుకుని ఓ రేంజ్‌లో క్లీవేజ్ షో చేస్తోంది. ఫలితంగా ఈ ఫొటోల్లో ఆమె అందాలు కుర్రకారును కవ్విస్తున్నాయి. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన లభిస్తోంది. ఫలితంగా నిధి అగర్వాల్ పిక్స్ యమా వైరల్‌గా మారిపోయాయి.


Click it and Unblock the Notifications











