స్టార్ హీరో కొడుకుతో సీనియర్ నటి కూతురు డేటింగ్.. అఫైర్‌పై యువ హీరోయిన్ క్లారిటీ!
అందంతోపాటు అభినయంతో ఆకట్టుకొంటున్న బాలీవుడ్ హీరోయిన్లలో పలక్ తివారీ ఒకరు. తల్లి నట వారసత్వంతో హిందీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ ప్రస్తుతం అగ్ర హీరోల చిత్రాల్లో మంచి ఆఫర్లు చేజిక్కించుకొన్నది. అయితే తన సినిమా రిలీజ్ నేపథ్యంలో బాలీవుడ్ సూపర్ స్టార్ కుమారుడితో అఫైర్, డేటింగ్, లివింగ్ రిలేషన్‌షిప్ రూమర్ల గురించి పలక్ తివారీ వివరణ ఇస్తూ..

స్టార్ హీరోలతో రెండు సినిమాలు
పలక్ తివారీ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ నటించిన కిసి కా భాయ్.. కిసి కి జాన్ చిత్రంలో ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నది. అలాగే సంజయ్ దత్ నటిస్తున్న ది వర్జిన్ ట్రీ చిత్రంలో కూడా కీలక పాత్రను పోషిస్తున్నది. ప్రస్తుతం కిసి కా భాయ్.. కిసి కీ జాన్ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా మారింది. తన కెరీర్, వ్యక్తిగత జీవితంపై ఉన్న సందేహాలను క్లారిటీ ఇస్తూ మీడియాను ఆకట్టుకొంటున్నది.

సల్మాన్ ఖాన్, సంజయ్ దత్‌తో
నా కెరీర్ ఆరంభంలో సల్మాన్ ఖాన్, సంజయ్ దత్ లాంటి అగ్ర హీరోల సినిమాల్లో ఆఫర్లు వస్తే ఎవరైనా కాదంటారా? నేను కూడా మరోమారు ఆలోచించకుండా నేను ఆ అవకాశాలను అందుకొన్నాను. ఈ రెండు సినిమాల వల్ల నాకు మంచి పేరుతోపాటు మరిన్ని ఆఫర్లు వస్తాయని నేను అనుకొంటున్నాను అని పలక్ తివారీ తెలిపింది.

అలాంటి ఆఫర్‌తో క్రేజీగా
సల్మాన్ ఖాన్, సంజయ్ దత్ లాంటి హీరోలతో స్క్రీన్ స్పేస్ పంచుకోవడం కంటే.. సెట్లో వారి నుంచి చాలా విషయాలను నేర్చుకొన్నాను. వారి అనుభవం వల్ల నేను కొన్ని విషయాలు తెలుసుకొన్నాను. అలాంటి స్టార్ హీరోల పక్కన నటించాలని వేలాది మంది ఎదురు చూస్తుంటారు. కానీ నాకు అవకాశం రావడం, అది కూడా చాలా తొందరగా రావడం చాలా హ్యాపీగా ఉంది అని పలక్ తివారీ చెప్పింది.

స్టార్ హీరోలు అయినా..
బాలీవుడ్‌లో సల్మాన్, సంజయ్ ఎంతో స్టార్ వాల్యూ ఉన్న హీరోలు. కానీ సెట్లో చాలా సాధారణంగా అందరితో కలిసిపోయారు. ప్రతీ సీన్‌లో ఏదో కొత్తగా చేయాలని ఇప్పటికీ ప్రయత్నించడం నాలాంటి వారికి ఓ కొత్త అనుభవం. నటన, సినిమాల పట్ల వారి అకింతభావం చూస్తే ఎంతో స్పూర్తిగా అనిపించింది అని పలక్ తెలిపింది.

హిందీ స్టార్ హీరో కొడుకుతో అఫైర్
ఇక బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ ఆలీ ఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీ ఖాన్‌తో డేటింగ్, అఫైర్‌పై పలక్ తివారీ వివరణ ఇస్తూ.. ప్రస్తుతం నేను కెరీర్‌పైనే ఫోకస్ పెట్టాను. గత కొద్ది నెలలుగా రెండు సినిమా షూటింగులతో బిజీగా ఉన్నాను. నాపై వచ్చే రూమర్లను నేను పట్టించుకోను. ప్రొఫెషనల్‌గా నాకు ఇది చాలా కీలకమైన సమయం. వేరే విషయాల గురించి నేను ఆలోచించదలచుకోలేదు అని పలక్ చెప్పారు.

పలక్ తివారీ ఎవరి కూతురంటే?
పలక్ తివారీ వ్యక్తిగత విషయానికి వస్తే.. ప్రముఖ టెలివిజన్ నటి, బాలీవుడ్ నటి శ్వేతా తివారీ కూతురు. కసౌటీ జిందగీ కే, బిగ్ బాస్, నాచ్ బలియే, ఝలక్ దిక్లా జా, ఖత్రోంకా ఖిలాడీ లాంటి షోలతో ప్రేక్షకులకు సుపరిచితులు. హిందీ వినోద పరిశ్రమలో మంచి ట్రాక్ రికార్డు ఉన్న శ్వేతా తివారీ నట వారసత్వాన్ని అందిపుచ్చుకొని బాలీవుడ్‌లోకి ప్రవేశించింది. ఆరంభంలోనే సల్మాన్, సంజయ్ చిత్రాల్లో నటించే అవకాశం అందిపుచ్చుకొన్నది.


Click it and Unblock the Notifications











