టైట్ డ్రెస్‌లో ట్యాక్సీవాలా హీరోయిన్ షో.. అనంతపురం అమ్మాయి అందాలు దాగట్లేదుగా!
సినీ రంగంలో హీరోయిన్లుగా సక్సెస్ అవ్వాలంటే అందం, అభినయం మాత్రమే ఉంటే సరిపోదు. అందుకు తగ్గట్లుగా లక్ కూడా కలిసి రావాలి. ఇది లేకనే ఎంతో మంది టాలెంటెడ్ బ్యూటీలు కెరీర్ పరంగా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారిలో ప్రియాంక జవాల్కర్ ఒకరు. ఆరంభంలోనే హీరోయిన్‌గా సక్సెస్ అయిన ఈ చిన్నది.. అవకాశాలను మాత్రం ఆశించిన రీతిలో సొంతం చేసుకోవడం లేదు. కానీ, సోషల్ మీడియాలో మాత్రం భారీ ఫాలోయింగ్‌తో సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే ప్రియాంక తాజాగా కొన్ని ఫొటోలను షేర్ చేసింది. అవి మీరే చూసేయండి!
ఇక్కడి పిల్లే.. అలా ఎంటర్:అనంతపురానికి చెందిన మరాఠి ఫ్యామిలీలో పుట్టిన ప్రియాంక జవాల్కర్ టీనేజ్‌లో మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టేసింది. అలా తనదైన అందంతో ఫిల్మ్ మేకర్ల దృష్టిని ఓ రేంజ్‌లో ఆకర్షించింది. దీంతో ఆమెకు చదువుకునే రోజుల్లోనే సినిమా అవకాశాలు వచ్చాయి. ఈ క్రమంలోనే ప్రియాంక 2017లో వచ్చిన 'కల వర మాయే' అనే చిత్రంతో హీరోయిన్‌గా ఎంటరైంది.

ట్యాక్సీవాలతో బెస్ట్ సక్సెస్:హీరోయిన్‌గా మంచి ఆరంభాన్ని అందుకోలేకపోయిన ప్రియాంక జవాల్కర్‌కు ఆ వెంటనే విజయ్ దేవరకొండ నటించిన 'ట్యాక్సీవాలా' చిత్రంలో ఆఫర్ లభించింది. ఇది సూపర్ డూపర్ హిట్ అయింది. అదే సమయంలో ఈ మూవీలో ప్రియాంక తనదైన అందం, అభినయంతో రాణించడంతో తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ పాపులర్ అయింది. అదే సమయంలో తెలుగు క్రష్‌గానూ మారింది.
మరో హిట్ కొట్టినా.. ఒక్కటే:ట్యాక్సీవాలా తర్వాత ప్రియాంక జవాల్కర్‌కు ఆశించిన రీతిలో అవకాశాలు మాత్రం రాలేదు. ఈ పరిస్థితుల్లో సత్యదేవ్‌తో కలిసి 'తిమ్మరుసు' అనే చిత్రం చేసింది. దీని తర్వాత కిరణ్ అబ్బవరంతో 'ఎస్ఆర్ కల్యాణమండపం' మూవీలో చేసింది. ఈ మూవీ సెన్సేషనల్ హిట్ అయింది. దీని తర్వాత ఈ అమ్మడు 'గమనం' అనే సినిమాలో మాత్రమే నటించింది.

అక్కడ యమా బిజీగానే:సినిమాల కంటే ముందుగానే పాపులర్ అయిన ప్రియాంక జవాల్కర్.. సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గానే ఉంటోంది. చాలా కాలం పాటు వరుసగా సినిమాలు చేసినా.. ఈ అమ్మడు మాత్రం ఇందులో యమా సందడి చేస్తూనే ఉంటోంది. ఇలా ఎప్పటికప్పుడు తన సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత వివరాలను ఫాలోవర్లతో పంచుకుంటూ ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది.

అందాల ప్రదర్శనలతో:టాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ సోషల్ మీడియాలో చాలా కాలంగా హల్చల్ చేస్తోంది. ముఖ్యంగా సినిమాల్లో పెద్దగా గ్లామర్ షో చేయని ఈ భామ.. ఇందులో మాత్రం అప్పుడప్పుడూ పరువాలను ప్రదర్శిస్తోంది. ఇందులో భాగంగానే తన లేలేత అందాలను చూపిస్తూ దిగిన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. ఫలితంగా ప్రియాంక ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.

ఘాటు ఫొటోలు వదిలింది:తెలుగు అమ్మాయి ప్రియాంక జవాల్కర్ తాజాగా కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె టైట్ డ్రెస్ వేసుకుని మరీ అందాలను ఫోకస్ చేస్తూ ఎన్నో ఫొటోలు ఇచ్చింది. దీంతో ఈ అమ్మడి అందాలు ఓ రేంజ్‌లో కవ్విస్తున్నాయి. దీంతో ప్రియాంక షేర్ చేసిన ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ లభిస్తోంది. ఫలితంగా ఇవన్నీ బాగా వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











