రౌడీ హీరోయిన్ పరువాల ప్రదర్శన: మరీ ఇంత దగ్గరగా చూపిస్తే ఏలా?
టాలీవుడ్‌లో టాలెంట్ ఉన్నా కెరీర్‌ను సక్రమంగా నడిపించుకోలేని హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. అందులోనూ కొన్ని హిట్లు వచ్చినా అవకాశాలను అందుకోని వాళ్లు కూడా ఉన్నారు. వారిలో ప్రియాంక జవాల్కర్ ఒకరు. అందానికి అందం, నటనకు నటన చేయగల సత్తా ఉన్నా.. ఈ అమ్మడు ఎందుకనో ఆశించిన రీతిలో ఆఫర్లను అందుకోవడం లేదు.
ఫలితంగా కెరీర్‌ను ప్రశ్నార్థకం చేసుకుంది. అయితేనేం సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్‌లో రెచ్చిపోతోంది. ఈ క్రమంలోనే తాజాగా ప్రియాంక జవాల్కర్ కొన్ని బోల్డు ఫొటోలను షేర్ చేసింది. వాటిని మీరే చూడండి!

అనంత పిల్ల.. అలా ఎంట్రీ: అనంతపురంలోని మరాఠి ఫ్యామిలీలో పుట్టిన ప్రియాంక జవాల్కర్ టీనేజ్‌లో ఉన్నప్పటి నుంచే మోడలింగ్ మొదలు పెట్టేసింది. అలా తనదైన అందంతో ఫిల్మ్ మేకర్ల దృష్టిని బాగానే ఆకర్షించింది. దీంతో ఆమెకు చదువుకునే రోజుల్లోనే సినిమా అవకాశాలు వచ్చాయి. ఈ క్రమంలోనే ప్రియాంక 2017లో వచ్చిన 'కల వర మాయే' అనే చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.

రౌడీ హీరోతో సక్సెస్ కొట్టేసి: హీరోయిన్‌గా గ్రాండ్ ఎంట్రీని సొంతం చేసుకోలేకపోయిన ప్రియాంక జవాల్కర్‌కు ఆ వెంటనే విజయ్ దేవరకొండ నటించిన 'ట్యాక్సీవాలా' చిత్రంలో ఛాన్స్ వచ్చింది. ఇది సూపర్ డూపర్ హిట్ అయింది. అదే సమయంలో ఈ మూవీలో ప్రియాంక తనదైన అందం, అభినయంతో రాణించడంతో తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ పాపులర్ అయింది. అదే సమయంలో కుర్రాళ్ల క్రష్‌గా మారింది.

మరో హిట్‌తో జోష్ వచ్చేసి: రౌడీతో బిగ్ హిట్‌ను సాధించినప్పటికీ ప్రియాంక జవాల్కర్‌కు ఆశించిన రీతిలో టాలీవుడ్‌లో భారీ ఆఫర్లు మాత్రం రాలేదు. ఈ పరిస్థితుల్లో సత్యదేవ్‌తో కలిసి 'తిమ్మరుసు' అనే చిత్రం చేసింది. దీని తర్వాత కిరణ్ అబ్బవరంతో 'ఎస్ఆర్ కల్యాణమండపం' మూవీలో చేసింది. ఈ మూవీ సెన్సేషనల్ హిట్ అయింది. ఫలితంగా ఈ చిత్రంతో ప్రియాంక కెరీర్‌కు కొత్త జోష్ వచ్చేసింది.

క్రేజీ యాక్టింగ్.. సీనియర్లతో: 'ఎస్ఆర్ కల్యాణమండపం' తర్వాత ప్రియాంక జవాల్కర్ 'గమనం' అనే మూవీలో నటించింది. ఇందులో క్రేజీ యాక్టింగ్‌తో ఆకట్టుకుని కొన్ని అవార్డులు కూడా అందుకుంది.అయితే, దీని తర్వాత మాత్రం ప్రియాంకకు పెద్దగా ఆఫర్లు రాలేదు. ఇక, ఇటీవలే ఈమె 'భగవంత్ కేసరి', 'సైంధవ్' చిత్రాలకు ఎంపికైనట్లు వార్తలు వచ్చాయి. కానీ, ఆమెకు ఈ ఆఫర్లు దక్కలేదు.

అందులో యమ బిజీగానే: సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకముందే ఫేమస్ అయిన ప్రియాంక జవాల్కర్.. సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గానే ఉంటోంది. చాలా కాలం పాటు వరుసగా సినిమాలు చేసినా.. ఈ అమ్మడు మాత్రం ఇందులో యమా సందడి చేస్తూనే ఉంటోంది. ఇలా ఎప్పటికప్పుడు తన సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత వివరాలను ఫాలోవర్లతో పంచుకుంటూ వాళ్లను యమ ఖుషీ చేస్తూ ముందుకెళ్తోంది.
అందాల ప్రదర్శనలతోనే: యంగ్ హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ సోషల్ మీడియాలో చాలా కాలంగా రచ్చ చేస్తోంది. ముఖ్యంగా సినిమాల్లో పెద్దగా హాట్ షో చేయని ఈ భామ.. ఇందులో మాత్రం అప్పుడప్పుడూ గ్లామర్ ట్రీట్ ఇస్తోంది. ఇందులో భాగంగానే తన లేలేత అందాలను చూపిస్తూ దిగిన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. ఫలితంగా ఇంటర్నెట్‌ను ఊపు ఊపుతోంది.

బోల్డు షోకు మీనింగ్ ఇదే: అనంతపురం అమ్మాయి ప్రియాంక జవాల్కర్ తాజాగా కొన్ని హాట్ సెల్ఫీలను షేర్ చేసింది. వీటిలో ఆమె పైటను పక్కకు జరిపేసి మరీ అందాలను ఫోకస్ చేస్తూ ఎన్నో ఫొటోలను తీసుకుంది. అంతేకాదు, రెచ్చగొట్టేలా చాలా దగ్గరగా చూపిస్తూ ఫోజులిచ్చింది. దీంతో ప్రియాంక షేర్ చేసిన ఫొటోలకు భారీ స్థాయిలో రెస్పాన్స్ లభిస్తోంది. ఫలితంగా ఇవన్నీ బాగా వైరల్ అయిపోయాయి.


Click it and Unblock the Notifications











