నా కోరికను చిరంజీవి అలా తీర్చారు.. యంగ్ హీరోయిన్ ఎమోషనల్

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరు వింటేనే ఏదో తెలియని వైబ్రేషన్. జీవితానికి ఆయన ఓ మోటివేషన్. ఎవరి సపోర్ట్ లేకుండానే టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన కెరీర్ ప్రారంభించారు చిరంజీవి. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ.. మెగాస్టార్ గా మారారు చిరంజీవి. తన నటనతో పాటు డ్యాన్స్, ఫైట్స్ అన్నింటికీ మించి గ్రేస్, స్టైల్స్‌తో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు. అయితే.. ఆయన ఎంత ఎదిగినా.. తన అభిమానుల కోరికను మాత్రం కాదన్నాడు. తాజాగా ఓ యంగ్ హీరోయిన్ కోరితే.. తన విలువైన సమయాన్ని ఆమె కోరికను తీర్చడానికి వెచ్చించారు చిరు. ఈ ఇంతకీ ఏం జరిగిందో మీరు ఓ లూక్కేయండి.

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ మూవీ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్నది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అయితే ఈ మూవీ ఒక విజువల్ వండర్, సోషియో ఫాంటసీ త్రిల్లర్ గా తెరకెక్కుతోందని అంచనాలు పెంచుతున్నారు. అలాగే.. మూవీలో సిస్టర్ సెంటిమెంట్ కూడా మెయిన్ గా ఉండబోతుందని తెలుస్తోంది.

Young heroine Ramya Pasupaleti made interesting comments on Megastar Chiranjeevi about Vishwambhara movie

ఈ మూవీలో చిరంజీవి చెల్లెలుగా యంగ్ హీరోయిన్ రమ్య పసుపులేటి నటించబోతుంది. సోషల్ మీడియాలో పాపులారిటీ తెచ్చుకున్న ఈ తెలుగు అమ్మాయి చిరంజీవి మూవీలో .. అది కూడా చిరంజీవి చెల్లలుగా నటించే ఛాన్స్ కొట్టేసింది. ఈ ముద్దుగుమ్మ ఇటీవల విడుదల అయినా.. మారుతినగర్ సుబ్రహ్మణ్యం అనే హీరోయిన్ గా నటించింది. తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసింది. తాజాగా రమ్య ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. విశ్వంభర సినిమా గురించి, మెగాస్టార్ చిరంజీవి గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంది.

రమ్య పసుపులేటి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను విశ్వంభర సినిమాలో చిరంజీవి గారి పక్కన చెల్లెలిగా చేస్తున్నాననీ, చిరంజీవితో తాను చాలా సేపు స్క్రీన్ షేర్ చేసుకున్నానన్నారు. ఎవరైనా చిరంజీవి పక్కన నటించే అవకాశాన్ని విడిచిపెట్టుకుంటారా? అని అందుకే.. చిరు మూవీలో నటించే ఛాన్స్ వస్తే వదులుకోలేదనీ, అందుకే చెల్లి పాత్ర అయినా చేస్తున్నాననీ అన్నారు. తనతో పాటు వేరే హీరోయిన్స్ కూడా చిరంజీవికి చెల్లెళ్లుగా నటిస్తున్నారని తెలిపింది.

అలాగే.. ఈ మూవీ సమయంలో చిరంజీవి గారెతో తన వర్క్ ఎక్సీపీరియెన్స్ షేర్ చేసుకుంటూ.. 'చిరంజీవి గారిని సెట్ లో చూసిన మొదటిసారి. సార్, మీతో ఒక్క ఫోటో దిగాలని అడిగాను. తనకు ఆయన ఒకే అన్నారు. కానీ, గెటప్ లో కాకుండా.. నార్మల్ లూక్ లో కావాలని అడిగాను. దీంతో చిరంజీవి '
నీ కోసం నేను త్వరగా రావాలా? అని వెళ్లిపోయారు. ఆ తరువాతి రోజు తన అసిస్టెంట్లు కాల్ చేసి..చిరంజీవి గారు వచ్చారు.. నీకోసమే.. త్వరగా రా' అని పిలిచారు.

Young heroine Ramya Pasupaleti made interesting comments on Megastar Chiranjeevi about Vishwambhara movie

అలా నా కోసం చిరంజీవి మూవీ షూటింగ్ కు త్వరగా వచ్చారు. ఆ ఫోటోనే నేను ఈరోజు ఇన్స్టాగ్రామ్ లో పెట్టాను" అని రమ్య ఎమోషనల్ అయ్యింది.
తాను ఫోటో అడిగినందుకు చిరంజీవి త్వరగా సెట్ కు వచ్చినట్లు తెలిపింది రమ్య. ప్రస్తుతం యంగ్ హీరోయిన్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
ఇదెలా ఉంటే.. విశ్వంభర మూవీలో చిరంజీవి హీరో గా నటించగా.. ఆషికా రంగనాథ్, త్రిష లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ మూవీకి యంగ్ డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. విశ్వంభర మూవీలో రమ్యతో పాటు హీరోయిన్ సురభి, మరో సీనియర్ నటి చిరంజీవికి చెలెళ్ళుగా నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X