వేడి పుట్టించేలా వెంకీ హీరోయిన్ ఫోజు: ఇంట్లో ఇలాగే ఉంటుందా ఏంటి!
సినీ రంగంలో హీరోయిన్లుగా రాణించాలంటే అందం, అభినయం ఉంటే సరిపోయే రోజులు కావు. ఇప్పుడున్న పోటీ పరిస్థితుల్లో లక్ కూడా కలిసొస్తూ ఉండాలి. లేకుంటే అన్నీ ఉన్నా సరిగా రాణించలేరు. దీనికి అసలైన ఉదాహరణే రుహానీ శర్మ. ఎంతో టాలెంట్ ఉన్న ఈ చిన్నది.. ఆశించిన రీతిలో మాత్రం ఆఫర్లను దక్కించుకోవడం లేదు. కానీ, ఈ మధ్య కాలంలో మాత్రం తనదైన రీతిలో సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. ఇక, తాజాగా రుహానీ శర్మ సోషల్ మీడియాలో ఓ బోల్డు ఫొటోను షేర్ చేసింది. దానిపై మీరు కూడా ఓ లుక్కేయండి మరి!
ఆ వీడియోలతో సెన్సేషన్:సినిమాల్లోకి పరిచయం అవడానికి ముందే రుహానీ శర్మ మోడల్‌గా నేషనల్ రేంజ్‌లో గుర్తింపు పొందింది. ఈ క్రమంలోనే పంజాబీలో 'కుడి టు పటాకా', 'కర్వా చౌత్', 'పటియాలే వాల్‌నూ' వంటి ఆల్బమ్స్ చేసింది. వీటికి మంచి రెస్పన్స్ రావడంతో అప్పట్లోనే రుహానీ సెన్సేషన్ అయింది. తద్వారా ఫిల్మ్ మేకర్ల దృష్టిలో పడడంతో పాటు యమ పాపులారిటీని సొంతం చేసుకుంది.

నేషనల్ అవార్డు మూవీతో:ప్రైవేట్ సాంగ్‌లతో సంచలనంగా మారిన రుహానీ.. 'కడాయిసీ బెంచ్ కార్తీ' అనే తమిళ సినిమాతో హీరోయిన్‌గా మారింది. ఈ మూవీలో అదిరిపోయే నటనతో ఆకట్టుకుని అందరి దృష్టినీ ఆకర్షించింది. ఈ క్రమంలోనే 'చి ల సౌ' అనే చిత్రంతో తెలుగులోకి కూడా వచ్చింది. ఈ మూవీకి ఒరిజినల్ స్క్రీన్‌ప్లే విభాగంలో నేషనల్ అవార్డు దక్కడంతో ఆమె క్రేజ్ పెరిగిపోయింది.
ఫుల్ ఆఫర్లు.. లక్ లేదుగా:ఫస్ట్ మూవీనే నేషనల్ అవార్డును సొంతం చేసుకోవడంతో రుహానీ శర్మకు ఆ తర్వాత టాలీవుడ్‌లో ఎన్నో అవకాశాలు దక్కాయి. ఇలా ఈ బ్యూటీ వరుసగా 'హిట్ 1', 'థర్టీ హరి', 'నూటొక్క జిల్లాల అందగాడు' వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. కానీ, ఇందులో హిట్ మినహా భారీ విజయాన్ని దక్కలేదు. దీంతో రుహానీ కెరీర్ ఆశించిన స్థాయిలో మాత్రం ముందుకెళ్లట్లేదు.

హర్ అంటూ.. వెంకీతోనూ:2019లో రుహానీ శర్మ 'పాయిజన్' అనే హిందీ వెబ్ సిరీస్‌లో నటించింది. అలాగే, గత ఏడాది తెలుగులో 'మీట్ క్యూట్' అనే వెబ్ ఫిల్మ్‌లోనూ కనిపించింది. అంతేకాదు, ఇప్పుడీ చిన్నది హిందీలో 'ఆగ్రా' మూవీ చేస్తోంది. ఇటీవలే తెలుగులో రుహానీ 'HER Chapter 1' అనే సినిమాతో వచ్చింది. ఇక, ఇప్పుడు వెంకటేష్ - శైలేష్ కొలను 'సైంధవ్' మూవీలోనూ చేస్తోంది.
అందులో యమ యాక్టివ్:మోడల్‌గా ఉన్నప్పటి నుంచే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోన్న రుహానీ శర్మ.. హీరోయిన్‌గా పరిచయం అయిన తర్వాత నుంచి మరింతగా ఇందులో యాక్టివ్ అయిపోయింది. దీంతో ఈ అమ్మడు విపరీతంగా ఫాలోయింగ్‌ను ఏర్పరచుకుంది. దీంతో ఆమె తన వ్యక్తిగత విషయాలతో పాటు కెరీర్‌కు సంబంధించిన విశేషాలను పంచుకుంటూ.. ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తూనే ఉంది.

బోల్డు షోతో రెచ్చగొట్టేలా:రుహానీ శర్మ సోషల్ మీడియాలో ఏ రీతిలో అందాలను ఆరబోస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో భాగంగానే తరచూ తన బోల్డు ఫొటోలు, వీడియోలు వదులుతూ సంచలనం అవుతోంది. అంతేకాదు, ఈ మధ్య కాలంలో డోస్ పెంచేసి మరీ గ్లామర్ ట్రీట్ ఇస్తోంది. దీంతో రుహానీ శర్మ ఫొటోలు, వీడియోలకు భారీ రెస్పాన్స్ దక్కుతోంది. ఫలితంగా ఆమె పేరు మారుమ్రోగిపోతోంది.

చిన్న డ్రెస్‌లోనే రుహానీ:ఇటీవలి కాలంలో రెచ్చిపోతోన్న రుహానీ శర్మ.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె అతి చిన్న షార్ట్, లోదుస్తులు ధరించి విపరీతంగా గ్లామర్ షో చేస్తూ కనిపించింది. ఫలితంగా ఆమె అందాలు మొత్తం బాగా హైలైట్ అవుతున్నాయి. దీంతో ఈ పిక్‌కు నెటిజన్ల నుంచి భారీ స్పందన లభిస్తోంది. తద్వారా ఇది యమ వైరల్‌గా మారిపోయింది.


Click it and Unblock the Notifications











