శివాని రాజశేఖర్ అందాల ప్రళయం.. తొలిసారి ఘాటు ఫోజులతో కిక్కిచ్చేలా!

మిగిలిన ఇండస్ట్రీల్లో మాదిరిగానే టాలీవుడ్‌లో కూడా కొందరు సినీ వారసులు సందడి చేస్తున్నారు. అందులో కొందరు అమ్మాయిలు కూడా హీరోయిన్లుగా ప్రేక్షకులను అలరిస్తున్నారు. వారిలో జీవిత రాజశేఖర్ పెద్ద కుమార్తె శివాని రాజశేఖర్ ఒకరు. చాలా కాలం క్రితమే హీరోయిన్‌గా వచ్చిన ఈ చిన్నది.. వరుసగా సినిమాలు చేస్తూ సత్తా చాటుతోంది. తెలుగులోనే కాదు.. తమిళంలోనూ పలు చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో అందాల దాడి చేస్తోంది. ఈ క్రమంలోనే శివాని తాజాగా కొన్ని పిక్స్ షేర్ చేసింది. వాటిని మీరే చూసేయండి!

ఫస్ట్‌దే ఆగింది.. అలా ఎంట్రీ:జీవిత రాజశేఖర్ పెద్ద కుమార్తె శివాని.. అడివి శేష్ హీరోగా మొదలైన '2 స్టేట్స్' ద్వారా సినీ రంగానికి పరిచయం కావాల్సి ఉంది. కానీ, ఈ సినిమా షూటింగ్ పూర్తైన తర్వాత ఆగిపోయింది. ఈ చిత్రం ఎందుకు ఆగిపోయింది అన్న దానిపై ఎన్నో రకాల వార్తలు వైరల్ అయ్యాయి. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని 'పెళ్లి సందD' మూవీలో చిన్న పాత్రలో శివాని పరిచయమైంది.

Young Heroine Shivani Rajasekhar Latest Stunning Photos Viral

అద్భుతంతో హీరోయిన్‌గానే:శివాని రాజశేఖర్ 'అద్భుతం' అనే సినిమా ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. తేజ సజ్జా హీరోగా నటించిన ఈ సినిమాను మల్లిక్ రామ్ అనే దర్శకుడు తెరకెక్కించాడు. టైం లాప్స్ అనే కాన్సెప్టుతో ఇది రూపొందింది. నేరుగా హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అయిన ఈ మూవీకి మంచి స్పందన దక్కింది. దీని తర్వాత WWW అనే సినిమాతో థియేటర్లలో ప్రేక్షకులను అలరించింది.

తెలుగు, తమిళ సినిమాలు:ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా ఆఫర్లను అందుకుంటూ శివాని రాజశేఖర్ వరుస సినిమాలతో సత్తా చాటుతోంది. ఈ క్రమంలోనే రాజశేఖర్ నటించిన 'శేఖర్'లోనూ కీలక పాత్ర చేసింది. అలాగే, 'అన్బరివు', 'నింజాక్ నీతి' అనే తమిళ సినిమాలు కూడా చేసింది. వీటిలో అద్భుతమైన నటనతో అలరించింది. వీటితో పాటు విద్యా వాసుల అహం మూవీ చేస్తోంది.

Young Heroine Shivani Rajasekhar Latest Stunning Photos Viral

అందాల పోటీ.. క్రేజీ మూవీ:శివాని రాజశేఖర్ గత ఏడాదికి గానూ మిస్ ఇండియా పోటీల్లో పాల్గొనాల్సి ఉంది. కానీ, అదే రోజున ఈమె రాస్తున్న మెడికల్ థియరీ ఎక్సామ్ ఉన్నందున ఈ పోటీ నుంచి తప్పుకుంది. ఇక, ఇప్పుడు శివాని రాజశేఖర్ 'కోటబొమ్మాలి పీఎస్' అనే సినిమాలో నటించింది. ఇందులోని 'లింగి లింగి లింగడి' పాట యమ ఫేమస్ అయింది. ఈ చిత్రం నవంబర్ 24న రాబోతుంది.

సోషల్ మీడియాలో యాక్టివ్:వరుస పెట్టి తెలుగు, తమిళంలో సినిమాల మీద సినిమాలు చేస్తూ యమ బిజీగా గడుపుతున్నప్పటికీ.. శివాని రాజశేఖర్ సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు సంబంధించిన పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అదే సమయంలో శివాని తన ఫొటోలు, వీడియోలను కూడా వదులుతూ ఫాలోవర్లను ఖుషీగా ఉంచుతోంది.

Young Heroine Shivani Rajasekhar Latest Stunning Photos Viral

అందాల ఆరబోతతో కూడా:ఎన్నో ఏళ్లుగా సోషల్ మీడియాలో సందడి చేస్తోన్న శివాత్మిక రాజశేఖర్.. పెద్దగా అందాలను ఆరబోసింది లేదు. తన సోదరి శివాత్మిక మాత్రం అప్పుడప్పుడూ గ్లామర్ ట్రీట్ ఇస్తూ తరచూ హైలైట్ అవుతోంది. కానీ, శివాని మాత్రం అలా కనిపించలేదు. అయితే, ఈ మధ్యన మాత్రం ఈ అమ్మడు కూడా జోరు పెంచేసింది. అందుకే తరచూ హాట్ పిక్స్, వీడియోలను వదులుతూనే ఉంటోంది.

Young Heroine Shivani Rajasekhar Latest Stunning Photos Viral

శివాని బోల్డు పిక్స్ వైరల్:యంగ్ హీరోయిన్ శివాని రాజశేఖర్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె డిజైనర్ శారీని ధరించి రెచ్చిపోయింది. పైటను పక్కకు జరిపి క్లీవేజ్ షో చేసింది. అలాగే, థైస్ కనిపించేలా ఘాటు ఫోజులు ఇచ్చింది. ఫలితంగా వీటికి నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. దీంతో శివాని పిక్స్ అన్నీ వైరల్‌గా మారిపోయాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X