శృంగార తారను గోకిన క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్.. పబ్లిక్‌గా బయపెట్టిన అడల్ట్ స్టార్!
క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ రొమాంటిక్ లీలల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల కాలంలో బ్రేకప్స్, ఆఫైర్లతో నిత్యం మీడియాలో టాప్ హెడ్‌లైన్లను ఆకర్షిస్తున్నారు. క్రికెట్ మ్యాచులు, రెస్టారెంట్స్‌లో, పబ్లిక్ ప్లేస్‌లలో గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి చెట్టాపట్టాలేసుకొని తిరగడం సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉంటాడు. ఇప్పటికే ఓ గర్ల్‌ఫ్రెండ్‌తో లైఫ్‌ను ఎంజాయ్ చేస్తూనే మరో శృంగార తారను సోషల్ మీడియాలో కెలగడంతో ఆ వ్యవహారాన్ని ఆమె బయటపెట్టడం క్రేజీగా మారింది. అయితే ఈసారి చాహల్ గొకిన తార ఎవరనే వివరాల్లోక వెళితే..
యుజ్వేంద్ర చాహల్ విషయానికి వస్తే.. క్రికెట్ మైదానంలో బంతులతో క్రికెటర్లను దడదడలాడిస్తూనే.. గ్రౌండ్ బయట ప్రియురాళ్లతో షికార్లు జోరుగా చేస్తున్నాడు. ఈ మద్యకాలంలోనే నటి ధనశ్రీ వర్మకు డైవోర్స్ ఇవ్వడంతోపాటు భారీ మొత్తాన్ని సమర్పించుకొన్నట్టు వార్తలు వచ్చాయి. ఆ విడాకుల విషాదం నుంచి బయటపడిన వెంటనే మరో బ్యూటీతో డేటింగ్ చేస్తూ కనిపించాడు.

భార్యతో విడాకులు తీసుకొన్న తర్వాత ఆర్జే మహ్‌వాష్‌తో కొన్నాళ్లు సన్నిహితంగా కనిపించాడు. ఆ తర్వాత వారిద్దరూ ఎవరి దారులు వారు చూసుకొన్నారు. తాజా సమాచారం ప్రకారం టీవీ స్పోర్ట్స్ యాంకర్ షెఫాలీ బగ్గాతో డేటింగ్ చేస్తున్నట్టు తెలిసింది. అయిత అటు చాహల్ గానీ, షెఫాలీ గానీ తమ డేటింగ్ వ్యవహారాన్ని ధృవీకరించకపోవడంతో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కానీ ఇంకా ఎవరితో అఫైర్ పెట్టుకోలేదనే వార్తలు షికారు చేస్తున్నాయి.
ఇది ఇలా ఉండగా, తాజాగా గంధీ బాత్ సిరీస్‌లో నటించిన శృంగార తార తానియా చటర్జీని సోషల్ మీడియాలో కెలికాడు. తానియా తన ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు చేసిన ఫోటోకు లైక్ కొట్టాడు. అంతటితో ఆగకుండా క్యూట్‌గా ఉన్నావు అంటూ మెసేజ్ కూడా చేశాడు. దాంతో తానియా గాల్లో తేలిపోయింది. ఆ మెసేజ్‌ను మీడియా కెమెరాలకు చూపిస్తూ హంగామా చేసింది.
ముంబైలో తానియా మీడియా కెమెరాలకు చాహల్ చేసిన కామెంట్‌ను లైవ్‌లో చూపించింది. చాహల్ తనకు మేసేజ్ చేసి క్యూట్‌గా ఉన్నావని కామెంట్ చేశాడు. ఇదిగో చూడు అంటూ మీడియా ముందు తబ్బిబ్బి పోయింది. దాంతో చాహల్ వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. నెటిజన్లు రొమాంటిక్ లైఫ్, తీరు గురించి రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. ఐపీఎల్‌లో బిజీగా ఉంటూనే మనోడు ఏ మాత్రం తగ్గడం లేదుగా అంటూ కామెంట్ చేస్తున్నారు.
తానియా ఛటర్జీ విషయానికి వస్తే.. గంధీ బాత్, తిత్లియాన్ సిరీస్‌తో ఆమె శృంగార తారగా పాపులర్ అయింది. ఓటీటీలో తనకంటే ఓ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకొన్నది. చాహల్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టుకు ఆడుతున్నాడు. భారత జట్టులో స్థానం కోసం వేచి చూస్తున్నాడు. ఈ మధ్యలోనే ఇలాంటి చిలిపి చేష్టలతో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా నిలిచాడు.


Click it and Unblock the Notifications











