హీరోయిన్ గురించి చెడు ప్రచారం, బెదిరింపులు... మేనేజర్ దుశ్చర్య!
సల్మాన్ ఖాన్ 'వీర్' సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన జరీన్ ఖాన్... తాజాగా ఓ వివాదంలో చర్చనీయాంశం అయింది. తన పేరుచెడగొట్టే విధంగా ప్రవర్తిస్తూ తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న మాజీ మేనేజర్ అంజలి మీద ఆమె ఫిర్యాదు చేశారు.
బాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం... జరీన్ ఖాన్ మీద కక్షపెంచుకున్న మాజీ మేనేజర్ అంజలి ఆమె క్యారెక్టర్ మీద నిందలు వేస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు తెలుస్తోంది. జరీన్ వద్ద మేనేజర్‌గా మానేసిన తర్వాత కూడా ఆమె పేరు చెప్పి డబ్బులు తీసుకుంటున్నట్లు సమాచారం.

అసభ్య పదజాలంతో దూషిస్తూ...
ఈ విషయం జరీన్ ఖాన్ దృష్టికి రావడంతో ఆమెను మందలించగా అంజలి వాగ్వాద్వానికి దిగినట్లు, అసభ్య పదజాలంతో దూషించినట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఫోన్ ద్వారా కొన్ని అభ్యంతరకర సందేశాలు ఆమెకు పంపినపట్లు వార్తలు విపిసిస్తున్నాయి.

సెక్షన్ 509 కింద కేసు
మాజీ మేనేజర్ అంజలి పంపిన అభ్యంతరకర సందేశాలు ఆధారాలుగా చూపుతూ జరీన్ ఖాన్ ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అంజలి మీద పోలీసులు ఐపిసి సెక్షన్ 509 కింద కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.

రెప్యుటేషన్, డిగ్నిటీ దెబ్బతీసే విధంగా
జరీన్ ఖాన్ తరుపు లాయర్ రిజ్వాన్ సిద్ధిఖీ స్పందిస్తూ... తన క్లయింట్ రెప్యుటేషన్, డిగ్నిటీ దెబ్బతీసే విధంగా అంజలి ప్రవర్తిస్తోందని, దాంతో పాటు మరికొన్ని క్రిమినల్ చర్యలకు పాల్పడినట్లు తెలిపారు. ఆమె చర్యల వల్ల తన క్లయింట్ చాలా ఇబ్బంది పడుతుందని, ఈ విషయాలను ఎఫ్ఐఆర్‌లో నమెదు చేయిచినట్లు తెలిపారు.

జరీన్ ఖాన్
2010లో సల్మాన్ హీరోగా రూపొందిన ‘వీర్' సినిమా ద్వారా పరిచయమైన జరీన్ ఖాన్.... ఆ సినిమా ప్లాప్ అయినప్పటికీ బాలీవుడ్లో నటిగా నిలదొక్కుకున్నారు. స్టార్ హీరోయిన్ రేంజిక కాక పోయినా అడపా దడపా అవకాశాలు దక్కించుకుంటూ తన ఉనికిని కాపాడుకుంటున్నారు. ఈ ఏడాది జరీన్ ఖాన్ 1921 చిత్రంలో నటించారు.


Click it and Unblock the Notifications











