ప్రభాస్‌తో అలా భయపడుతూ.. రాజాసాబ్ నటి కామెంట్స్ వైరల్..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'ది రాజా సాబ్ (The Raja Saab)'పై రోజురోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. మొదట్లో ఈ సినిమాపై పెద్దగా బజ్ లేకపోయినా, ఇటీవల విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్‌తో ఒక్కసారిగా ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. రొమాంటిక్ హారర్ కామెడీగా తెరకెక్కుతున్న ఈ మూవీ 2026 సంక్రాంతి కానుకగా విడుదలకు సిద్ధమవుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌ను జోరుగా కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా బాలీవుడ్ సీనియర్ నటి జరీనా వహాబ్ (Zarina Wahab) ఇచ్చిన ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ముఖ్యంగా ప్రభాస్ వ్యక్తిత్వంపై ఆమె చేసిన వ్యాఖ్యలు అభిమానులను మరింత ఆకట్టుకుంటున్నాయి.
'రాజా సాబ్' సినిమాలో ప్రభాస్‌కు తల్లి పాత్రలో నటిస్తున్న జరీనా వహాబ్, ఈ సినిమా షూటింగ్ అనుభవాలను పంచుకుంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'ప్రభాస్ సినిమాలు చాలా చూశాను. కానీ మొదటిసారి ఆయనను ప్రత్యక్షంగా చూసినప్పుడు కాస్త భయపడ్డాను. అంత పెద్ద స్టార్... ఎలా ఉంటారో అని అనిపించింది. కానీ ఆయనను దగ్గరగా చూసిన తర్వాత ఆ భయం అంతా పోయింది. మాటల్లో చెప్పలేనంత మంచి మనిషి ఆయన' అంటూ ప్రభాస్‌ను కొనియాడారు. చిరంజీవి, ప్రభాస్‌లాంటి స్టార్లు తమతో పని చేసే వారిని ఎంతో గౌరవిస్తారని చెప్పిన జరీనా వహాబ్, 'సౌత్ ఇండియాలో ఉన్నట్లుగా నార్త్ ఇండియాలో హీరోలు ఎందుకు అలా బిహేవ్ చేయరు అని నాకు చాలా బాధగా ఉంటుంది. ఇక్కడ హీరోలకు ఈగోలు, ఆటిట్యూడ్ ఉండవు'అని అన్నారు.

ప్రభాస్ షూటింగ్ సమయంలో ఎలా ఉంటారన్న విషయాన్ని జరీనా వహాబ్ వివరించారు. 'ప్రభాస్ షూటింగ్‌లో ఉన్నప్పుడు బ్రేక్ ఉంటేనే క్యారవాన్‌కు వెళ్తారు. లేకపోతే సెట్‌లోనే ఉంటారు. అక్కడే ఇతర ఆర్టిస్టులతో ముచ్చటిస్తారు, వాళ్లను ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. తన సీన్లు లేకపోయినా అక్కడే కూర్చుంటారు. నేను చూసి నిజంగానే ఆశ్చర్యపోయాను... ఇండస్ట్రీలో ఇంత మంచి మనుషులు కూడా ఉన్నారా అని. ఇన్నాళ్లు అలాంటి మనసులను మిస్ అయ్యానేమో అని ఫీల్ అయ్యాను' అంటూ తన అనుభావాన్ని వెల్లడించారు.
ఇంతకుముందు ఓ ఇంటర్వ్యూలో కూడా జరీనా వహాబ్ ప్రభాస్‌పై హార్ట్ టచ్చింగ్ కామోంట్స్ చేసింది.'రాజా సాబ్ సెట్‌లో ప్రభాస్ వ్యక్తిత్వాన్ని చూసి, నాకు వచ్చే జన్మలో అలాంటి కొడుకే కావాలని అనిపించింది. ఆయనలో ఎలాంటి ద్వేషం లేదు, ఈగో లేదు. డౌన్ టు ఎర్త్ పర్సన్. తనతో మాత్రమే కాదు, సెట్‌లో పని చేసే ప్రతి ఒక్కరితోనూ అలాగే ఉంటారు. వెళ్లేటప్పుడు అందరికీ చెప్పి వెళ్తారు'అని చెప్పారు. ప్రభాస్ ఒక్కడికే ఫుడ్ ఆర్డర్ చేయించుకోడని, ఇంటికి ఫోన్ చేసి సెట్‌లో ఉన్న అందరికీ ఫుడ్ వచ్చేలా చూసుకుంటారని కూడా వెల్లడించారు. 'అందుకే ప్రభాస్ నిజంగానే డార్లింగ్'అంటూ ఆమె ప్రశంసల వర్షం కురిపించారు.
ప్రస్తుతం ప్రభాస్ 'రాజా సాబ్'సంక్రాంత్రి బరిలో నిలిచింది. ప్రస్తుతం స్పిరిట్ మూవీ షూటింగ్ లో బిజీబిజీగా ఉన్నారు ప్రభాస్.. ఈ మూవీ తరువాత సలార్ 2, కల్కి 2, వంటి భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఇంకా పలు చిత్రాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. మొత్తంగా చూస్తే, స్టార్‌డమ్‌తో సంబంధం లేకుండా తన మంచితనం, హ్యూమానిటీతోనే ప్రభాస్ అభిమానుల సంఖ్యను పెంచుకుంటున్నారని మరోసారి జరీనా వహాబ్ వ్యాఖ్యలు రుజువు చేస్తున్నాయి. అందుకే ఆయనను అభిమానులు 'డార్లింగ్ ప్రభాస్' అని పిలుస్తుంటారు. ఇప్పుడు 'రాజా సాబ్'తో ప్రభాస్ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాడో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











