షారుక్ ఖాన్‌తో శ్రీదేవి స్టెప్పులు.. ఫ్యాన్స్‌కు కిక్కించే పాటలో!
అవును.. మీరు చదుతున్నది నిజమే. తిరిగి రాని లోకాలకు వెళ్లిన అందాల నటి శ్రీదేవి మరోసారి తెరపైన ప్రత్యక్ష్యం కాబోతున్నారు. ఈ ఏడాదిలో ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటైన జీరో చిత్రం డిసెంబర్ 21న రిలీజ్ కాబోతున్నది. ఈ సినిమాలో శ్రీదేవి ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న జీరో సినిమా విషయాలు ఇవే..

భారీగా గెస్ట్ హీరో, హీరోయిన్లు
జీరో సినిమాలో అతిథి పాత్రల్లో కనిపించే స్టార్ల జాబితా భారీగానే ఉంది. ఈ చిత్రంలో బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్, అభయ్ డియోల్, రాణి ముఖర్జీ, కరిష్మా కపూర్, అలియా భట్, కరీనా కపూర్ ఖాన్, కాజోల్, శ్రీదేవి తదితరులు ఉన్నారు.

ఓం శాంతి ఓం మాదిరిగానే
గతంలో ఓం శాంతి ఓం చిత్రంలో ఓ పాటలో బాలీవుడ్ స్టార్లతో ఓ పాట చిత్రీకరించిన విషయం తెలిసిందే. అదే మాదిరిగా బాలీవుడ్‌లోని అగ్ర హీరోయిన్లతో ఓ పాటను జీరో చిత్రంలో కూడా చిత్రీకరించారట. ఆ పాటలో శ్రీదేవి చివరిసారిగా కనిపించనున్నారట.

మరణానికి ముందు జరిగిన షూట్‌లో
మరణానికి ముందు కొద్ది నెలల ముందు జీరో సినిమా షూటింగ్‌కు శ్రీదేవి హాజరయ్యారు. ఆ సందర్భంగా ఓ పాట కోసం జరిగిన షూటింగ్‌లో పాల్గొన్నారు. గత అక్టోబర్‌లో ఈ సినిమాలోని పాటను చిత్రీకరించారు అని బాలీవుడ్ మీడియాలో ఓ కథనాలు వెలువడ్డాయి. ఈ సినిమా ద్వారా శ్రీదేవిని అభిమానులు మరోసారి చూసే భాగ్యం కలుగడం ఖాయం.

శ్రీదేవికి షారుక్ ఘనమైన నివాళి
తనకు అత్యంత ఇష్టమైన శ్రీదేవికి నిజమైన నివాళిని ఘనంగా అర్పించడానికి షారుక్ ఖాన్ ప్లాన్ చేస్తున్నారట. అలాగే ఈ సినిమా పాటను రిలీజ్‌కు ముందు లీక్ కాకుండా, చూపించకుండా ఉండాలని చిత్ర యూనిట్‌కి హెచ్చరిక కూడా చేశారట. శ్రీదేవితో కలిసి డ్యాన్స్ చేసే పాటను అభిమానులకు సర్ఫైజ్ గిఫ్టుగా అందించే ప్రయత్నం చేస్తున్నట్టు తెలిసింది.

మరుగుజ్జుగా షారుక్ ఖాన్
జీరో చిత్రంలో షారుక్ ఖాన్ మరుగుజ్జుగా కనిపించనున్నారు. ఈ చిత్రంలో సల్మాన్ బాలీవుడ్ హీరోగా నటించారు. ప్రముఖ దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ రూపొందిస్తున్న ఈ చిత్రంలో కత్రినా కైఫ్, అనుష్క శర్మ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం డిసెంబర్ 21న రిలీజ్‌కు సిద్దమవుతున్నది.


Click it and Unblock the Notifications











