జాంబీ రెడ్డి హీరోయిన్ అందాల ఆరబోత: చూసే వాళ్లకు పండగే మరీ!
ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌లోకి వచ్చిన హీరోయిన్ల సంఖ్య పెద్దదిగానే ఉంది. కానీ, అందులో చాలా అంటే చాలా తక్కువ మంది మాత్రమే ఆరంభంలోనే గుర్తింపును తెచ్చుకున్నారు. అలాంటి వారిలో దక్ష నాగర్కర్ ఒకరు. మొదట్లోనే ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకున్న ఈ భామ.. అందం, టాలెంట్ ఉన్నా ఆశించిన స్థాయిలో రాణించలేకపోతోంది. ఫలితంగా ఆ తర్వాత కొన్ని ఆఫర్లను మాత్రమే అందుకుంది. అయితేనేం సోషల్ మీడియా ద్వారా మాత్రం తన ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తోంది. ఈ క్రమంలోనే దక్ష తాజాగా ఓ బోల్డు ఫొటోను వదిలింది. దాన్ని మీరే చూడండి!
డాక్టర్ అవ్వాలని మోడల్‌గా:డాక్టర్స్ ఫ్యామిలీకి చెందిన దక్ష నాగర్కర్.. వాళ్లలానే వైద్యురాలు కావాలని భావించింది. ఇందుకోసం మెడిసిన్ చదవడంతో పాటు కార్డియాలజిస్ట్ అవ్వాలని ప్లాన్ చేసుకుంది. అలాంటిది ఉన్నట్లుండి మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టేసింది. అందులో తన అందచందాలతో మైమరపించిన దక్ష.. ఆ తర్వాత చదువుకు పుల్‌స్టాప్ పెట్టేసి మరీ యాక్టింగ్‌లో ట్రైనింగ్ తీసుకుంది.

అలా ఎంట్రీ... హుషారుతో:మోడల్‌గా సత్తా చాటుతోన్నప్పుడే దక్ష నాగర్కర్ 'ఏకే రావు.. పీకే రావు' అనే తెలుగు సినిమాతో నటిగా కెరీర్‌ను మొదలు పెట్టింది. ఆ తర్వాత 'హోరా హోరీ' అనే చిత్రంలోనూ నటించింది. అయితే, 2018లో వచ్చిన 'హుషారు' సినిమాతో ఆమెకు విశేషమైన పేరు, గుర్తింపు సొంతం అయ్యాయి. ముఖ్యంగా ఈ చిత్రంతో దక్ష తెలుగు కుర్రాళ్లకు క్రష్‌గా కూడా మారిపోయింది.
జాంబిరెడ్డితో క్రేజీ సక్సెస్:'హుషారు' మూవీతో ఎనలేని క్రేజ్‌ను అందుకున్న దక్ష నాగర్కర్.. ఆ తర్వాత 'జాంబీ రెడ్డి' అనే సినిమా చేసింది. ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అలాగే, ఆమెకు సైతం మంచి పేరును తెచ్చింది. దీని తర్వాత దక్ష 'బంగార్రాజు' సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌లో కనిపించింది. ఇలా వరుసగా హిట్ చిత్రాల్లో భాగం అవుతూ కెరీర్‌ను ఫుల్ స్వింగ్‌లో తీసుకెళ్లింది.

అప్పటి నుంచి నో ఆఫర్స్:ఈ మధ్య కాలంలో దక్ష నాగర్కర్ చేసిన ప్రతి సినిమా విజయం సాధించింది. అయినప్పటికీ ఆమెకు అవకాశాలు మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు. ఈ పరిస్థితుల్లో ఇటీవలే 'రావణాసుర' అనే సినిమాతో వచ్చింది. ఇందులో సుశాంత్ గర్ల్‌ఫ్రెండ్‌గా మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రనే చేసింది. కానీ, ఈ సినిమా డిజాస్టర్‌గా అయింది. ఇక, దీని తర్వాత దక్ష ఒక్క సినిమానూ చేయలేదు.

అక్కడ మాత్రం బిజీగానే:కెరీర్ ఆరంభం నుంచీ అనుకున్న విధంగా మూవీలు చేయకున్నా.. దక్ష నాగర్కర్ మాత్రం తన రేంజ్‌ను ఏమాత్రం తగ్గించుకోలేదు. దీనికి కారణం ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండడమే. దీని ద్వారానే ఈ అమ్మడు తన సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత వివరాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను సైతం వదులుతూ ముందుకెళ్తోంది.

అందాలతో వల వేస్తోంది:సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో హీరోయిన్ దక్ష నాగర్కర్ యమ హడావిడి చేస్తూనే ఉంది. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఆమె గ్లామర్ ట్రీట్ ఇస్తూ రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే తన అందచందాలను చూపిస్తూ దిగిన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటోంది. అప్పుడప్పుడూ డోస్ పెంచేసి మరీ బోల్డు షో చేస్తూ సెన్సేషన్ అవుతోంది.

దక్ష లేటెస్ట్ పిక్ వైరల్‌గా:యంగ్ హీరోయిన్ దక్ష నాగర్కర్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె డిఫరెంట్ డిజైన్ డ్రెస్‌ను వేసుకుని కనిపించింది. దీంతో ఆమె అందాలు బయటకు కనిపిస్తూ కుర్రాళ్లను విపరీతంగా టెంప్ట్ చేస్తున్నాయి. ఫలితంగా దక్ష నాగర్కర్ షేర్ చేసిన ఈ ఫొటోకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఇది వైరల్‌గా మారిపోయింది.


Click it and Unblock the Notifications











