అందాలతో యంగ్ హీరోయిన్ కవ్వింపు: ఓ రేంజ్‌లో దక్ష గ్లామర్ ట్రీట్
ఇప్పుడున్న పోటీ పరిస్థితుల్లో సినిమా రంగంలోకి చాలా ఎక్కువ మందే అమ్మాయిలు హీరోయిన్లుగా వస్తున్నారు. కానీ, అందులో కొందరు మాత్రమే సక్సెస్ రేటుతో దూసుకుపోతుండగా.. మరికొందరు టాలెంట్ ఉన్నా ఇబ్బందులు పడుతున్నారు. అందులో దక్ష నాగర్కర్ ఒకరు. చేసిన అన్ని చిత్రాల్లో అందం, అభినయంతో రాణించిన ఈ చిన్నది.. విజయాలను కూడా బాగానే అందుకుంది. అయినా ఆఫర్లను మాత్రం దక్కించుకోవడం లేదు. ఇక, సోషల్ మీడియాలో సందడి చేసే దక్ష.. తాజాగా ఓ బోల్డు ఫొటోను షేర్ చేసింది. దానిపై మీరే లుక్కేయండి మరి!
మెడిసిన్ నుంచి మోడల్‌గా:నటన వైపు మళ్లక ముందే దక్ష నాగర్కర్ డాక్టర్ అవ్వాలని డిసైడ్ అయిపోయింది. ఇందుకోసం మెడిసిన్ చదవడంతో పాటు కార్డియాలజిస్ట్ పూర్తి చేయాలని ప్లాన్ చేసుకుంది. కానీ, ఉన్నట్లుండి మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. అందులో తన గ్లామర్‌తో మైమరపించిన దక్ష.. ఆ తర్వాత చదువుకు పుల్‌స్టాప్ పెట్టేసింది. అదే సమయంలో మోడల్‌గా ఎన్నో అవకాశాలు అందుకుంది.

ఏకే రావుతో.. హుషారుగానే:మోడలింగ్ రంగంలో టాలెంట్ చూపించిన దక్ష నాగర్కర్‌కు ఎన్నో సినిమా ఇండస్ట్రీల నుంచి ఆఫర్లు వచ్చాయి. ఈ క్రమంలోనే 'ఏకే రావు.. పీకే రావు' అనే తెలుగు సినిమాతో కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత 'హోరా హోరీ' అనే మూవీనీ చేసింది. అయితే, 2018లో వచ్చిన 'హుషారు' సినిమాతో ఆమెకు ఫస్ట్ హిట్‌తో పాటు విశేషమైన గుర్తింపు కూడా లభించింది.
జాంబి రెడ్డి... బంగార్రాజు:'హుషారు' మూవీతో తెలుగులో ఫుల్ ఫేమస్ అయిన దక్ష నాగర్కర్.. ఆ తర్వాత 'జాంబీ రెడ్డి' అనే సినిమాలో నటించింది. ఈ చిత్రం భారీ హిట్‌గా నిలిచింది. అలాగే, ఆమెకు సైతం మంచి క్రేజ్ రెట్టింపు అయిపోయింది. దీని తర్వాత దక్ష 'బంగార్రాజు' సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌లోనూ కనిపించింది. ఇలా వరుసగా హిట్ చిత్రాల్లో భాగం అవుతూ ఫామ్‌ను కంటిన్యూ చేసింది.

రవితేజ తర్వాత ఖాళీగా:దక్ష నాగర్కర్ కొంత కాలంగా హిట్లు కొడుతూనే ఉంది. అయినప్పటికీ ఆమెకు ఆశించిన స్థాయిలో అవకాశాలు మాత్రం రాలేదు. ఈ పరిస్థితుల్లో ఇటీవలే 'రావణాసుర' అనే సినిమాలో నటించింది. ఇందులో సుశాంత్ గర్ల్‌ఫ్రెండ్‌గా తక్కువ ప్రాధాన్యత ఉన్న పాత్రనే చేసింది. ఈ సినిమా డిజాస్టర్ అయిన తర్వాత దక్ష నాగర్కర్‌కు ఒక్క సినిమా ఛాన్స్ కూడా దక్కలేదు.
అందులో యమ బిజీగా:అందానికి అందం, టాలెంట్‌కు టాలెంట్ ఉన్నా ఆరంభం నుంచీ దక్ష నాగర్కర్ మాత్రం పెద్దగా ప్రభావాన్ని చూపలేకపోతోంది. అయినా ఆమె క్రేజ్ కంటిన్యూ అవుతుందంటే దానికి కారణం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండడమే. దీని ద్వారానే ఈ అమ్మడు తన సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత వివరాలను ఫాలోవర్లతో పంచుకుంటూ తన రేంజ్‌ను పెంచుకుంటూ వెళ్తోంది.

గ్లామర్ కంచె తెంచేస్తూ:ఎన్నో ఏళ్లుగా సోషల్ మీడియాలో హీరోయిన్ దక్ష నాగర్కర్ యమ రచ్చ చేస్తూనే ఉంది. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఆమె అందాలను ఓ రేంజ్‌లో ఆరబోస్తూ రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే తన లేలేత పరువాలను చూపిస్తూ తీసుకున్న హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటోంది. తద్వారా నిత్యం ఈ అమ్మడు హాట్ టాపిక్ అవుతోంది.

దక్ష లేటెస్ట్ పిక్ వైరల్:టాలెంటెడ్ హీరోయిన్ దక్ష నాగర్కర్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె స్ట్రాప్‌లెస్ టాప్‌ను వేసుకుని కనిపించింది. దీంతో ఆమె అందాలు బయటకు కనిపిస్తూ కుర్రాళ్లను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ఫలితంగా దక్ష నాగర్కర్ షేర్ చేసిన ఈ ఫొటోకు భారీ స్థాయిలో స్పందన లభిస్తోంది. దీంతో ఇది ఫుల్ వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











