జాంబీ రెడ్డి బ్యూటీ జబర్ధస్త్ గ్లామర్ షో: ఖతర్నాక్ అందాలతో కిక్కిచ్చేలా!
ఇప్పుడు ఉన్న పోటీలో తెలుగు చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకోవడం హీరోయిన్లకు చాలా కష్టమైన పని. అందుకే చాలా మంది బ్యూటీలు అందం, టాలెంట్ ఉన్నా సరైన అవకాశాలను అందుకోవడం లేదు. అలాంటి వారిలో బొద్దుగుమ్మ దక్ష నాగర్కర్ ఒకరు. చిన్న వయసులోనూ సినిమాల్లోకి వచ్చిన ఈ సుందరాంగి.. చేసిన కొన్ని చిత్రాలకే మంచి ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. కానీ, అవకాశాలను మాత్రం పెద్దగా దక్కించుకోవట్లేదు. అయితేనేం సోషల్ మీడియాలో దక్ష రచ్చ చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా కొన్ని బోల్డు ఫొటోలను షేర్ చేసింది. అవి మీకోసమే!
డాక్టర్ కావాలని యాక్టర్‌గా:సినిమాల్లోకి రాకముందు దక్ష నాగర్కర్ డాక్టర్ అవ్వాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం కార్డియాలజిస్ట్‌గా కోర్స్ పూర్తి చేయాలని భావించింది. కానీ, అనుకోకుండానే మోడలింగ్ రంగంలోకి ప్రవేశించింది. అందులో తన గ్లామర్‌తో మైమరపించిన దక్ష నాగర్కర్.. ఆ తర్వాత చదువుకు పుల్‌స్టాప్ పెట్టాల్సి వచ్చింది. అదే సమయంలో మోడల్‌గా మంచి గుర్తింపును తెచ్చుకుంది.

ఏకే రావు, హుషారులతో:మోడల్‌గా యమ హైలైట్ అయిన దక్ష నాగర్కర్‌కు ఎన్నో సినిమా ఇండస్ట్రీల నుంచి ఆఫర్లు వచ్చాయి. ఈ క్రమంలోనే 'ఏకే రావు.. పీకే రావు' అనే తెలుగు సినిమాతో కెరీర్ మొదలు పెట్టింది. ఆ తర్వాత 'హోరా హోరీ' అనే మూవీలోనూ నటించింది. అయితే, 2018లో వచ్చిన 'హుషారు' సినిమాతో ఆమెకు ఫస్ట్ హిట్ వచ్చింది. దీంతో దక్ష పేరు కూడా బాగా మారుమ్రోగింది.
జాంబి రెడ్డితో సక్సెస్‌గా:'హుషారు' మూవీతో తెలుగులో ఫుల్ పాపులర్ అయిన దక్ష నాగర్కర్.. ఆ తర్వాత 'జాంబీ రెడ్డి' అనే సినిమాలో నటించింది. ఈ చిత్రం భారీ హిట్‌గా నిలిచింది. అలాగే, ఆమెకు సైతం మంచి క్రేజ్ రెట్టింపు అయిపోయింది. దీని తర్వాత దక్ష 'బంగార్రాజు' సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌నూ చేసింది. ఇలా వరుసగా హిట్ చిత్రాల్లో భాగం అవుతూ ఫామ్‌ను కొనసాగిస్తూ వచ్చింది.

అప్పటి నుంచి ఖాళీగా:కొంత కాలంగా దక్ష నాగర్కర్ హిట్లు కొడుతూనే ఉంది. అయినప్పటికీ ఆమెకు ఆశించిన స్థాయిలో అవకాశాలు మాత్రం రాలేదు. ఈ పరిస్థితుల్లో గత ఏడాది 'రావణాసుర' అనే సినిమాలో నటించింది. ఇందులో సుశాంత్ గర్ల్‌ఫ్రెండ్‌గా తక్కువ ప్రాధాన్యత ఉన్న పాత్రలోనే కనిపించింది. ఈ సినిమా డిజాస్టర్ అయిన తర్వాత దక్ష నాగర్కర్‌కు ఒక్క సినిమా ఛాన్స్ కూడా రాలేదు.
అక్కడ యమ యాక్టివ్:అదిరిపోయే అందంతో పాటు యాక్టింగ్ చేయగల సత్తా ఉన్నా ఆరంభం నుంచీ దక్ష నాగర్కర్ మాత్రం పెద్దగా ప్రభావాన్ని చూపలేకపోతోంది. అయినా ఆమె క్రేజ్ కంటిన్యూ అవుతుందంటే దానికి కారణం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండడమే. దీని ద్వారానే ఈ అమ్మడు తన సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత వివరాలను ఫాలోవర్లతో పంచుకుంటూ తన రేంజ్‌ను పెంచుకుంటోంది.

అందాలతో ఊరిస్తూనే:సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో హీరోయిన్ దక్ష నాగర్కర్ యమ రచ్చ చేస్తూనే ఉంది. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఆమె అందాలను ఓ రేంజ్‌లో ఆరబోస్తూ హల్చల్ చేస్తోంది. అలాగే, తన లేలేత పరువాలను చూపిస్తూ తీసుకున్న హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటోంది. తద్వారా నిత్యం ఈ అమ్మడు ట్రెండింగ్‌లో నిలుస్తోంది.
దక్ష లేటెస్ట్ పిక్స్ వైరల్:యంగ్ హీరోయిన్ దక్ష నాగర్కర్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె డీప్ నెక్ టాప్‌ను వేసుకుని కనిపించింది. దీంతో ఆమె అందాలు బయటకు కనిపిస్తూ కుర్రాళ్లను ఓ రేంజ్‌లో ఆకట్టుకుంటున్నాయి. ఫలితంగా దక్ష నాగర్కర్ షేర్ చేసిన ఈ ఫొటోలకు భారీ స్థాయిలో స్పందన లభిస్తోంది. దీంతో ఇవన్నీ బాగా వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











