వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న విషాదం
టైటానిక్ ప్రపంచంలో ఓ అధ్బుతమైన ఓడ. సరిగ్గా వందేళ్ల క్రితం బెల్ ఫాస్ట్ ఓడరేవులో తయారై తొలిసారిగా సముద్రయానానికి సిద్దమైన టైటానిక్ ఓడ ప్రపంచంలో ఉన్న సంపన్నులే కాకుండా.. ఎంతో మంది మూడవ తరగతి ప్రయాణికులను కూడా ఎక్కించుకోని ఇంగ్లాండ్ నుండి న్యూయార్క్‌కి బయలు దేరి 14 ఏప్రిల్ 1912న రాత్రి 11.40కి సముద్రం మధ్యలో మంచు కొండను ఢీకొట్టి మునిగి సరిగ్గా ఆదివారం నాటితో వందేళ్లు పూర్తయ్యాయి.
వంద సంవత్సరాల క్రితం జరిగిన ఈ ప్రమాదంలో దాదాపు 1500 మంది మరణించారు. ఈ సందర్భంగా ఉత్తర అట్లాంటిక్ మహా సముద్రంలో టైటానిక్ ఓడ మునిగిన చోట ఎంఎస్ బాల్మోరల్ ఓడ సిబ్బంది, ప్రయాణికులు నివాళులర్పించారు. టైటానిక్ మృతుల ఆత్మశాంతి కోసం కొద్దిసేపు మౌనం పాటించి, ప్రార్థనలు జరిపారు. ఓడ పైనుంచి సముద్రంలోకి మూడు పుష్పగుచ్ఛాలను జారవిడిచారు.
టైటానిక్ ఓడ మునిగిన తర్వాత ఈ నౌక అవశేషాలను రాబర్ట్ బల్లార్డ్ అనే సముద్ర అన్వేషకుడు 1985లో బయట ప్రపంచానికి తెలియజేశాడు. ఇప్పటికీ అప్పుడు మృతి చెందిన వారి బూట్లు, టోపీలు, బ్యాగులు, ఉంగరాలు, వాచీల వంటి వస్తువుల అవశేషాలు పడి ఉన్నట్లు సమాచారం. మానవ అస్దిపంజరం ఏడు సంవత్సరాలకు మించి ఉండలేదు కాబట్టి మానవ అస్దిపంజరం సముద్ర జలాల్లో అంతరించిపోయింది.
1997లో జేమ్స్ కెమరూన్ అనే హాలీవుడ్ దర్శకుడు టైటానిక్ ఓడ ఎలా మునిగి పోయిందో.. అదే విధంగా టైటానిక్ పేరుతో సినిమాని తీసి ఆస్కార్ అవార్డులను సొంతం చేసుకున్నాడు. రికార్డుల పరంగా, రివార్డుల పరంగా ఈ సినిమా సృష్టించిన హాడావుడి అంతా ఇంతా కాదు.


Click it and Unblock the Notifications











