ఆ సినిమా పబ్లిసిటీ కోసం జనాన్ని భయపెడుతున్నారు
2012 ఇది ఏదో ఓ సంవత్సరం పేరు కాదు, రాబోవు ప్రళయానికి సూచిక. 2012 అనేది యుగాంతం, ఈ సంవత్సరంతో భూమ్మీద మానవజాతి అంతరించి పోనుంది. దీన్నే ఇతివృత్తంగా తీసుకొని సినిమా తీస్తున్నామని హాలీవుడ్ సినిమా '2012' నిర్మాతలు ఇన్నాళ్లు చెబుతూ వస్తున్నారు. దీనికి ఊతంగా ఇంటర్నెట్ లో ఎన్నో వెబ్ సైట్లు 2012వ సంవత్సరం యుగాంతం అని చాలా కథనాలు ప్రచురించాయి. ఇది నిజమే అనిపించేలా ఎన్నో కథనాలు, ఆధారాలను వారు చూపించారు. కానీ తాజాగా తేలిన వషయమేమిటంటే ఇవన్నీ సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి నిర్మాతల పన్నిన కుయుక్తులట. 2012 అనేది యుగాంతం అన్న వార్తలు వెలువడగానే చాలా మంది భయపడిపోయారు. చాలా మంది అమెరికాలోని 'నాసా' అంతరిక్ష కేంద్రానికి బాధపడుతూ, భయపడుతూ ఉత్తరాలు, ఈ-మెయిల్ లు చేసారట. దీంతో దీనిపై దర్యాప్తు చేసిన నాసా ఇదంతా ఒట్టిదే అని తేల్చేసింది.
ప్రపంచ ప్రసిద్ధి చెందిన ప్రముఖ అంతరిక్ష విషయాలపై పరిశోధనలు జరిపే శాస్త్రవేత్త డాక్టర్ మోర్రిసన్ ప్రజలు 2012 పై అడిగిన ప్రశ్నలకు తానింకా పరిశోధించాలని, కానీ 2012 సినిమా నిర్మాతలు తమ సినిమా ప్రమోషన్ కోసం దొంగ సైన్స్ వెబా సైట్లను రూపొందించి, ఇలాంటి గాలి వార్తలను ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ఇదంతా కేవలం ఓ పబ్లిసిటీ స్టంట్ మాత్రమేనని తెలియజేసారు. 2012 ప్రళయం గురించిన వెబ్ సైట్లు అన్నీ గందరగోళంగా, సరైన వివరణలు లేకుండా వుండటమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. అయిన ఇంతకు ముందు తాము రాసిన పుస్తకాల సేల్స్ పెంచుకోవడానికి చాలా మంది వివదాలకు తెర లేపినట్టే వీరుకూడా తమ సినిమా కోసం వివాదం సృష్టించడం తప్పేం కాదు. అసలు తప్పల్లా ఇలాంటి వివాదాలను ప్రోత్సహించే ప్రజలది...ఏమంటారు ???


Click it and Unblock the Notifications











