'2012' ప్రళయం సృష్టించబోతోందా??

By Kuladeep

'2012'. ఇప్పుడూ హాలీవుడ్ లో ఎవరు కలిసినా చర్చించుకుంటున్న సినిమా. 2012 లో జరగబోయే ప్రళయం గురించిన తీసిన ఈ సినిమా 2009, నవంబరు 13న థియేటర్లలో కలెక్షన్ల ప్రళయం సృష్టించడానికి సిద్ధం అవుతోంది. ఇండిపెండెన్స్ డే(1996), ది డే ఆఫ్టర్ టుమారో(2004) వంటి అద్భుత చిత్రాలను సృష్టించిన సృష్టికర్త రొనాల్డ్ ఎమ్మిరిచ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. సోనీ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమాను ప్రఖ్యాత కొలంబియా పిక్చర్స్ పంపినీ చెయ్యనుంది.

జాన్ సుశాక్, చివెటల్ ఇజియోఫోర్, అమందా పీట్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. మాయన్ లాంగ్ కౌంట్ క్యాలెండర్ ప్రకారం సంభవించబోయే ప్రళయం గురించి తీసిన ఈ సినిమా ట్రెయిలర్లు ఇప్పటికే విడుదలయి అందరినీ ఆకట్టుకుంటూ, సినిమా ఎలా వుండబోతోందా అనే ఉత్సుకతను రేకెత్తిస్తోంది. తొలుత ఈ సినిమాని జులై 10, 2009 న విడుదల చెయ్యాలనుకున్నా, కొన్ని అనివార్య కారణాల వల్ల నవంబరు 13కు వాయిదా వేశారు. ఇప్పటికే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ చిత్రంలో చూపినట్టు 2012లో ప్రళయం వస్తుందో లేదో కానీ, ఈ సినిమా విడుదల అయిన తర్వాత కలెక్షన్ల ప్రళయాన్ని సృష్టింస్తుందనటం నిర్వివాదాంశం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X