»   » ఆస్కార్ 2015 ‌:ఇప్పటివరకూ ప్రకటించిన విజేతలు...లిస్ట్

ఆస్కార్ 2015 ‌:ఇప్పటివరకూ ప్రకటించిన విజేతలు...లిస్ట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: లాస్‌ఏంజిల్స్‌ నగరంలో 87వ ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా జరిగింది. విప్‌లాష్‌ చిత్రంలో ఉత్తమ సహాయ నటుడిగా సిమన్స్‌కు ఆస్కార్‌ అవార్డు దక్కింది. ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా ఐడా(పోలాండ్‌)కు, ఉత్తమ డాక్యుమెంటరీ విభాగంలో వెటరన్‌ ప్రెస్‌ 1కు ఆస్కార్‌ లభించింది. వస్త్ర, కేశ అలంకరణ, మేకప్‌ విభాగాల్లో గ్రాండ్‌ బుడాపెస్ట్‌ హోటల్‌ ఆస్కార్‌ కైవసం చేసుకుంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఉత్తమ సహాయనటుడిగా విప్‌ప్లాస్‌ చిత్రంలో నటించిన జేకే సిమిన్స్‌ ఆస్కార్‌ అందుకున్నారు. ఉత్తమ సహాయనటిగా బాయిహుడ్‌లో నటించిన పాట్రిషియా ఆర్కెట్‌ అస్కార్‌ సొంతం చేసుకుంది. ఉత్తమ విదేశీ చిత్రంగా ఐదా(పోలండ్‌)కు ఆస్కార్‌ వరించింది.

- ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైన్‌ : మిలెనా కానొనెరో
- ఉత్తమ మేకప్‌, హెయిర్‌ స్టైలింగ్‌ : ఫ్రాన్సెస్‌ హానన్‌...మార్క్‌ కోలియర్‌ (ది గ్రాండ్‌ బుడాపెస్ట్‌ హోటల్‌)
- ఉత్తమ విదేశీ చిత్రం పోలండ్‌కు చెందిన "ఇడా"
- ఉత్తమ లైవ్‌ యాక్షన్‌ షార్ట్‌ ఫిల్మ్‌- ది ఫోన్‌కాల్‌
- ఉత్తమ డాక్యుమెంటరీ - క్రైసిస్‌ హాట్‌లైన్‌
- ఉత్తమ సౌండ్ మిక్సింగ్- క్రెయిగ్ మన్‌, బెన్‌ విల్కిన్స్...థామస్‌ కర్లే (విప్‌లాష్‌)
- ఉత్తమ సౌండ్ ఎడిటింగ్‌ -రాబర్ట్‌ మరే, బబ్‌ ఆస్మాన్‌ (అమెరికన్‌ స్నైపర్‌)
- ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్‌ - ఇంటర్‌స్టెల్లార్‌
- ఉత్తమ యానిమేటెడ్‌ షార్ట్‌ఫిల్మ్- ఫీస్ట్‌
- ఉత్తమ యానిమేటెడ్‌ ఫీచర్‌ ఫిల్మ్‌- బిగ్‌ హీరో 6
- ఉత్తమ సినిమాటోగ్రఫీ - ఇమాన్యుయెల్ లుబెస్కీ (బర్డ్‌మాన్‌)
- ఉత్తమ ప్రొడక్షన్‌ డిజైన్‌- ది గ్రాండ్‌ బుడాపెస్ట్‌ హోటల్‌
- ఉత్తమ సౌండ్‌ ఎడిటింగ్‌- అమెరికన్‌ స్నైపర్‌
- ఉత్తమ లఘచిత్రం 'ఐ ఫోన్‌కాల్‌'కు ఆస్కార్‌ అవార్డు

2015 Oscar Winners: latest info.

ప్రపంచం మొత్తం ఎదురుచూసి, మాట్లాడుకుని, చర్చించుకునే స్దాయి ప్రత్యేకతను సంతరించుకున్న ఆస్కార్‌ అవార్డును అందుకోవాలన్నది చాలామంది నటీనటులకు, సాంకేతిక నిపుణులకు జీవిత కల. అయితే దానిని సాధించడమంటే మాటలు కాదు. ప్రపంచ నలుమూలల చిత్రాలన్నీ ఈ అవార్డుల కోసం పోటీపడతాయి.

అంతేకాదు ఈ అవార్డు దక్కించుకోవాలంటే దీనికి ముందు ఎంతో తతంగం ఉంటుంది. తొలుత ఆస్కార్‌కు నామినేషన్లలో స్థానం దక్కించుకోవాలి. అది అంత సులువేమీ కాదు. అందులో అవకాశం లభిస్తే ఆస్కార్‌ అవార్డుల పోటీ వరకు వెళ్లేందుకు మార్గం సుగమమం అవుతుంది. ఇక అక్కడ జరిగే ఆఖరి పోరాటంలో అసలుసిసలైన విజేతలను వేదికపై ప్రకటించడంతో ఈ ఘట్టం ముగుస్తుంది.

ఈ సారి "బర్డ్‌మ్యాన్‌, ది గ్రాండ్‌ బుడాపెస్ట్‌ హోటల్‌' చిత్రాలు ఎక్కువ శాతం విభాగాల్లో నామినేషన్లను దక్కించుకున్నాయి. ఇంకా "బాయ్‌హుడ్‌, అమెరికన్‌ స్నైపర్‌, సెల్మా, ది ఇమిటేషన్‌ గేమ్‌, ది థియరీ ఆఫ్‌ ఎవ్రీథింగ్‌, విష్‌లాష్‌' చిత్రాలు ఆఖరి పోరాటంలో నువ్వా నేనా అన్నట్లు పోటీపడుతున్నాయి. వీటిలో ఏ చిత్రాలు అవార్డులను దక్కించుకుంటాయన్న అంశం సోమవారంనాడు తేలిపోనుంది.

ఇక అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఆద్యంతం కన్నుల పండువగా సాగుతుంది. అవార్డులతో సంబంధం లేకుండా రెడ్‌కార్పెట్‌ (ఎర్రతివాచీ)పై వయ్యారాలు ఒలకపోసేందుకు హాలీవుడ్‌ తారలే కాదు ప్రపంచ సినీరంగాలకు చెందిన హీరోయిన్లు పోటీపడతారు. గతంలో బాలీవుడ్‌ సోయగం ఐశ్వర్యారాయ్‌ నాలుగైదు సార్లు ఎర్రతివాచీపై నడిచేందు కు పోటీపడిన విషయం గుర్తుండే ఉంటుంది.

అవార్డు కార్యక్రమాన్ని నిర్వహించే హోస్ట్‌ కూడా ఎంతో నేర్పుతో వ్యవహరించాల్సి ఉంటుంది. ఇందుకోసం ఓ ప్రత్యేక బృందం హోస్ట్‌కు తర్ఫీదు ఇస్తుంది. ఈ నేపథ్యంలో అవార్డు విజేతలు ఏం మాట్లాడుతారోనన్న ఆసక్తి ప్రతిఒక్కరిలో ఏర్పడుతుంది.

సాధారణంగా తమకు ఆ అవార్డు రావడానికి కారకులైన దర్శక, నిర్మాతలు, తోటీ నటీనటులు, సాంకేతిక నిపుణులు వంటి అందరి పేర్లు చెప్పడంతో పాటు భార్య, పిల్లలు, పనిమనుషుల వరకు అందరికీ ధన్యవాదాలు చెబుతారట. ఎక్కడ ఎవరి పేరు మరచిపోతే ఎలాంటి వివాదం వస్తుందోనన్న ఉద్దేశం విజేతల మదిలో ఉంటుందని, అందుకే వారు అలా ప్రతిఒక్కరినీ గుర్తుచేసు కుంటారని అంటారు.

English summary
Hollywood's biggest night, the 2015 Academy Awards, got underway with the first winner of the night: J.K. Simmons for actor in a supporting role. Other winners included Patricia Arquette for actress in a supporting role, Common and John Legend for their original song "Glory" from the film "Selma," the Polish film "Ida" for best foreign film, and "Big Hero 6" for best animated feature.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu