twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆస్కార్ 2021 : నామినీస్ ఎవరు? ...ఎప్పుడు, ఎక్కడ, ఎలా చూడాలంటే?

    |

    గత సంవత్సరం బాంగ్ జూన్-హో తెరకెక్కించిన పారాసైట్ సినిమా ఆస్కార్‌ ను కైవసం చేసుకుంది. సినిమా రంగంలో అత్యున్నత పురస్కారం గా చెప్పుకునే ఆస్కార్ అవార్డుల పంపిణీ కార్యక్రమం గత ఏడాది అట్టహాసంగా జరిగింది. 92వ అకాడమీ అవార్డల పేరుతో ఈ అవార్డుల కార్యక్రమం అమెరికా లాస్ ఎంజెలెస్‌ లోని డాల్బీ థియేటర్‌ లో ఘనంగా నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకాదరణ పొందిన చిత్రాలు, యాక్టర్ లను ఎంపిక చేసి ఈ అత్యున్నత పురస్కారం అందచేస్తారు. అయితే ఈసారి ఈ అవార్డుల ఫంక్షన్ ఎక్కడ జరుగుతుంది ? ఏ సమయంలో జరుగుతుంది ? భారత్ లో ఉన్నవారు ఎలా చూడాలి అనే అంశాలు పరిశీలిద్దాం..

    ఆస్కార్ 2021 అవార్డుల పంపిణీ ఎప్పుడు జరుగుతుంది?

    ఆస్కార్ 2021 అవార్డుల పంపిణీ ఎప్పుడు జరుగుతుంది?

    93వ ఆస్కార్‌ వేడుక వచ్చే ఏడాది ఏప్రిల్‌ 25న జరగనుంది. సాధారణంగా ఆస్కార్‌ పండగను ఫిబ్రవరి నెలలో నిర్వహిస్తారు. ఫిబ్రవరి 28న ఈ వేడుకలు నిర్వహించాలని ముందు అనుకున్నారు. అయితే కోవిడ్‌ వల్ల ఓ రెండు నెలలు వాయిదా వేశారు. ఈ చర్య ఆస్కార్ అర్హత వ్యవధిలో కూడా తాత్కాలిక మార్పులు తెచ్చిపెట్టింది. ఈ లెక్క ప్రకారం ఇప్పటి దాకా ఉన్న ప్రామాణిక 31 డిసెంబర్ గడువు ఫిబ్రవరి 28 వరకు పొడిగించారు. ఫిబ్రవరి 28 వరకు విడుదలైన అన్ని సినిమాలు అవార్డుల గుర్తింపుకు అర్హత పొందుతాయి.

    ఇలా రెండు సంవత్సరాల్లో విడుదలయ్యే సినిమాలను ఆస్కార్‌ వేడుకకు పరిశీలించడం గత 85 ఏళ్లలో ఇదే తొలిసారి. అలానే థియేటర్స్‌లో విడుదల కాకపోతే ఆస్కార్‌కు సినిమాను పంపలేం. కోవిడ్‌ వల్ల ఈ నిబంధనను కూడా తప్పించింది అకాడమీ. అకాడమీ చరిత్రలో అవార్డులు వేడుక పోస్ట్‌పోన్‌ అవ్వడం ఇది నాలుగో సారి.

    2021 ఆస్కార్ ఏ ఫార్మాట్ లో?

    2021 ఆస్కార్ ఏ ఫార్మాట్ లో?

    ఈ సంవత్సరం ఆస్కార్‌కు బాధ్యత వహిస్తున్న్న స్టీవెన్ సోడర్‌బర్గ్ - కంటాజియన్ అనే సినిమాకు దర్శకుడు. ఆయన దీర్ఘకాలిక సహచరులు స్టాసే షేర్ అలానే గ్రామీ నిర్మాత జెస్సీ కాలిన్స్ సహాయంతో ఈ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. వానిటీ ఫెయిర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, సోడర్‌బర్గ్ మాట్లాడుతూ, 2021 ఆస్కార్‌ అవార్డ్స్ గురించి మాట్లాడుతూ ఇది "అత్యంత ఉత్తేజకరమైన విషయం" అని అన్నారు.

    ఈ ఈవెంట్ చేయడం అంటే ఒక సినిమా చేస్తున్నట్టు ఉందని, మీకు కూడా ఒక సినిమా చూసినట్లుగా అనిపిస్తుందని మేము ఆశిస్తున్నాము అని చెప్పుకొచ్చారు. అలానే ఈ సంవత్సరం ఆస్కార్ అవార్డ్స్ నిర్వహించడాన్ని వేగంగా వెళ్తున్న పడవ డెక్ మీద పేకలతో ఇల్లు నిర్మించడంతో పోల్చారు.

    2021 ఆస్కార్ అవార్డులకి హోస్ట్ ఎవరు?

    2021 ఆస్కార్ అవార్డులకి హోస్ట్ ఎవరు?

    వరుసగా మూడవ సంవత్సరంలో ఆస్కార్ అవార్డ్స్ కు హోస్ట్ ఎవరూ ఉండడం లేదు. సింగిల్ ఎంసీకి బదులు ఈ అవార్డ్ ఫన్క్ష్ కి వచ్చే ప్రతి ఒక్కరూ ఒక పాత్ర పోషిస్తారని సోడర్‌బర్గ్ పేర్కొన్నారు. ప్రతి నామినీ, అవార్డు ఇచ్చే ప్రతి వ్యక్తి, ఒక సినిమాలోని పాత్రలలానే భావిస్తారని అన్నారు. మేము చేయాలనుకుంటున్నది ఒక మూడు గంటల సినిమా లానే అనిపిస్తుందని అన్నారు.

    Recommended Video

    Akhanda Vs Acharya Vs Narappa, హీరోల లుక్స్ కి ఫ్యాన్స్ ఫిదా !
    2021 ఆస్కార్ ఎక్కడ ? ఎలా చూడాలి

    2021 ఆస్కార్ ఎక్కడ ? ఎలా చూడాలి

    ఆస్కార్ అకాడమీ అవార్డులంటే అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డులు అని సినీ రంగ ప్రముఖులు భావిస్తుంటారు. ప్రతి సంవత్సరం ఆలోచనాత్మకమైన కథలతో పాటుగా ఆకట్టుకునే పాత్రలు సైతం ఈ అవార్డుల రేస్‌లో పోటీపడుతుంటాయి. 2002లో లగాన్‌ తరువాత ఈ సంవత్సరం వైట్‌ టైగర్‌ చిత్రం ఆస్కార్‌ 2021లో ఇండియా నుంచి పోటీపడుతోంది. దాదాపు 20 సంవత్సరాల తరువాత ఇండియన్‌ మూవీ పోటీపడుతుండడంతో ఈసారి అకాడమీ పండుగ మనవారిలో ఆసక్తి రేపుతోంది. ఇక మన సమయం ప్రకారం ఏప్రిల్‌ 26వ తేదీ ఉదయం 5.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకూ స్టార్‌ మూవీస్, స్టార్‌ వరల్డ్‌ ఛానెల్స్‌ లో ఈ పురస్కారాల పండుగ ప్రసారమవుతోంది.

    English summary
    Ahead of Sunday’s 93rd Academy Awards, all are eager to watch them. here are some interesting facts about oscar 2021
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X