For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నిర్మాతతో 36 ఏళ్లుగా డేటింగ్.. చివరకు ఇలా కానిచ్చేసిన సినీ నటి.. రహస్యంగా!!

    |

    సెలబ్రిటీల జీవితాల్లో డేటింగ్ వ్యవహారాలు, ప్రేమ ముచ్చట్లు కామన్ గానే వింటుంటాం. అయితే ఆ ప్రేమ, డేటింగ్ ఎన్నిరోజులు నిలుస్తుందో ఖచ్చితంగా చెప్పలేం. ఆ తర్వాత ఎవరికి వారు పెళ్లిళ్లు చేసుకొని సైలెంట్ అవుతారు. కానీ ఆ డేటింగుల్లో కూడా కాస్త డిఫరెంట్‌గా ఉంటూ ఎవరికి వారు పెళ్లి చేసుకున్నాక కూడా.. కొన్ని దాశాబ్దాల పాటు అలానే కంటిన్యూ చేసి ఇప్పుడు పెళ్లిచేసుకుంది ఓ సెలబ్రిటీ జంట. దీంతో ఈ ఇష్యూ హాట్ టాపిక్ అయింది. ఆ వివరాలు చూస్తే..

     52 ఏళ్ల హీరోయిన్.. నిర్మాతతో డేటింగ్

    52 ఏళ్ల హీరోయిన్.. నిర్మాతతో డేటింగ్

    హాలీవుడ్ సీనియర్ హీరోయిన్ పమేలా అండర్సన్.. ఓ నిర్మాతతో చాలా కాలం డేటింగ్ చేసి చివరకు రహస్యంగా పెళ్లాడింది. 52 ఏళ్ల వయసున్న ఆమె తన ఐదో పెళ్లిగా నిర్మాత జాన్ పీటర్స్‌ను వివాహమాడి వార్తల్లో నిలిచింది. ఓ నటి ఇలా ఒకదాని వెంట ఒకటిగా ఏకంగా 5 పెళ్లిళ్లు చేసుకోవడం జనాలకు ఆశ్చర్యకర విషయంగా మారింది.

     అలా సినీ గడపతొక్కి ఏకంగా ఐదుగురితో..

    అలా సినీ గడపతొక్కి ఏకంగా ఐదుగురితో..

    నటి పమేలా అండర్సన్ 1991లో సినీ జీవితాన్ని ప్రారంభించింది. అంతకు ముందే మోడల్ గా రాణించిన ఆమె ప్లే బాయ్ లాంటి శృంగార భరిత మ్యాగజైన్ లకు కూడా ఫోజులిచ్చింది. అలాగే ఆమె తన వైవాహిక జీవితాన్ని కూడా ఏకంగా ఐదుగురితో పంచుకొని తన రూటే సపరేటు అని నిరూపిస్తోంది.

    వరుస పెళ్లిళ్లు.. ఇదీ ఆమె గతం

    వరుస పెళ్లిళ్లు.. ఇదీ ఆమె గతం

    1995 సంవత్సరం టామీ లీ అనే నటుడితో విహాహం చేసుకున్న నటి పమేలా అండర్సన్.. ఆ తర్వాత మూడేళ్లకే అతనితో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత కిడ్ రాక్ అనే మరో వ్యక్తిని పెళ్ళాడి.. ఆ బందాన్ని ఎక్కువకాలం నిలుపుకోలేదు. ఇక ముచ్చటగా మూడోసారి పోకర్ ప్లేయర్ రిక్ సాలోమన్‌ను వివాహం చేసుకున్న ఆమె.. ఇతనితో కొంతకాలం కలిసి జీవించి, విడిపోయింది. చాలా గ్యాప్ తీసుకొని మళ్లీ అతన్నే పెళ్లాడింది. ఆమెకిది నాలుగో వివాహం. ఆ తర్వాత ఈ ఇద్దరూ మళ్లీ విడిపోయారు.

    రహస్యంగా నిర్మాతతో ఐదో వివాహం..

    రహస్యంగా నిర్మాతతో ఐదో వివాహం..

    ఇక ఇప్పుడు హాలీవుడ్ నిర్మాత జాన్ పీటర్స్‌ను రహస్యంగా పెళ్లి చేసుకొని మరోసారి పెళ్లి పీటలెక్కింది పమేలా అండర్సన్. మలీబూలో నిన్న (బుధవారం) వీరి వివాహం జరిగిందట. ఆమెకు ఇది ఐదో వివాహం. మరోవైపు నిర్మాత జాన్ పీటర్స్‌‌కు కూడా ఇది ఐదో వివాహమే కావడం విశేషం.

     36 ఏళ్లుగా పమేలా, జాన్ పీటర్స్‌ డేటింగ్‌

    36 ఏళ్లుగా పమేలా, జాన్ పీటర్స్‌ డేటింగ్‌

    ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ సంగతి ఏంటంటే.. దాదాపు 36 ఏళ్లుగా పమేలా, జాన్ పీటర్స్‌ డేటింగ్‌లో ఉన్నారట. ఈ విషయాన్ని పీటర్స్ స్వయంగా చెప్పారు. తన చుట్టూ ఎంతో మంది అందమైన అమ్మాయిలు ఉన్నప్పటికీ తనకు పమేలాతోనే జీవితాన్ని పంచుకోవాలని ఉండేదని తెలిపారు.

    రసికుడు జాన్ పీటర్స్..

    రసికుడు జాన్ పీటర్స్..

    జాన్ పీటర్స్ రసికుడు అని హాలీవుడ్‌లో ఇప్పటికే పలు ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో ఇతగాడు హాలీవుడ్ నటి కేథరిన్ జీటాతో శృంగారం జరిపినట్లు బయటకు వచ్చిన దృశ్యాలు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జాన్ వయసు 74 ఏళ్ళు కావడం మరో విశేషం.

    English summary
    Pamela Denise Anderson is a Canadian-American actress, model and animal rights activist. She got married for the fifth time, this time, to hairdresser-turned-Hollywood mogul Jon Peters.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X