»   »  '47 రోనిన్‌' చిత్రం దేని గురించి

'47 రోనిన్‌' చిత్రం దేని గురించి

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్ : భారీ బడ్జెట్‌తో హాలీవుడ్ చిత్రాలను నిర్మించే యూనివర్సల్ పిక్చర్స్ నిర్మాణ సంస్థ మరో భారీ ప్రతిష్ఠాత్మకచిత్రాన్ని అందిస్తోంది. హాలీవుడ్‌ నిర్మాణ సంస్థ యూనివర్సల్‌ పిక్చర్స్‌ రూపొందించిన చిత్రం '47 రోనిన్‌'. కార్ల్‌ ఎరిక్‌రెంచ్‌ దర్శకుడు. క్యున్‌ రివ్యూస్‌, రింకో కికూభీ, హిరోస్కీ సనాద ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని తెలుగు, ఇంగ్లిష్‌, హిందీ భాషల్లో జనవరి 3న విడుదల చేస్తున్నారు.

'47 Ronin' Releasing On Jan.3rd

యూనివర్సల్‌ పిక్చర్స్‌ సంస్థ ప్రతినిధి మాట్లాడుతూ ''జపాన్‌ నేపథ్యంలో సాగే కథ ఇది. అక్కడి గురుకులంలో 47మంది విద్యార్థులు యుద్ధ విద్యల్లో శిక్షణ తీసుకొంటుంటారు. సకల విద్యాసంపన్నుడైన గురువును ప్రత్యర్థిబృందం కిరాతకంగా చంపేస్తుంది. గురువుని చంపిన వారిని ఆ 47మంది యోధులు ఎలా అంతమొందించారన్నదే ఈ చిత్ర కథ. ఇది వరకు వెండి తెరపై ఎవరూ చూపించని యుద్ధ విద్యలు ఈ చిత్రంలో చూపిస్తున్నాం. టూడీ, త్రీడీలలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం'' అన్నారు.

మార్షల్ ఆర్ట్స్‌తో సరికొత్తగా దర్శకుడు రూపొందించారని, నేటి ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి రూపొందించిన ప్రతి సన్నివేశం థ్రిల్ కలిగిస్తుందని ఆయన వివరించారు. రింకో కికూభీ, హిరోస్కీ సనాద తదితరులు నటించిన ఈ చిత్రాన్ని జనవరి 3న తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషల్లో 2డి, 3డి వెర్షన్స్‌లో విడుదల చేస్తున్నామని ఆయన వివరించారు.

English summary

 '47 Ronin', a martial arts film from the Universal Studios is releasing on the 25th December across the world and also in Telugu, Hindi and Tamil languages in 2D and 3D formats. Starring Keenu Reeves of Matrix and Speed fame, Hiroyuki Sanada and Rinkoo Kukichi, the film is directed by Karl Eric Rinsch. Universal representative spoke about the film saying 'This is the story of 47 warriors learning a special form of martial arts from a reknowned Master who is later slain by opponents in a cruel manner. The 47 students take revenge on them. There have been several films based on martial arts but this film has used the latest technology to perfect use'
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu