నమ్మకు నమ్మకు ఆడాళ్లని...అంటున్న పాప్ స్టార్....!!!
ప్రముఖ పాప్ సింగర్ 50 సెంట్ ఆడవాళ్లని నమ్మనని, ఆడాళ్లంతా మోసగత్తెలేనని బహిరంగంగా ప్రకటిస్తున్నాడు. అసలు పేరు కర్టిస్ జేమ్స్ జాక్సన్ ||| అయిన 50 సెంట్ ఆడవాళ్లంతా డబ్బు మనుషులేనని, డబ్బు వుంటే చాలు వారికి ఇంకేం అక్కర్లేదని వ్యాఖ్యానిస్తున్నాడు. ఇటీవల జర్మనీకి చెందిన పత్రిక బిల్డ్ కు ఇచ్చిన ఇంటర్యూలో పై విధంగా వ్యాఖ్యానించాడు. అసలు తనుఆడాళ్లని నమ్మలేనని తెగేసి చెప్పాడు.
తనకు గర్ల్ ఫ్రెండ్స్ లేరు. ఇక పై వుండరు కూడా, ఎందుకంటే ఆడవారిని నమ్మాలంటే భయమేస్తోంది. మగాళ్లు అందంగా వున్న ఆడవారిని ప్రేమిస్తే ఆడవారు మాత్రం డబ్బు, హోదా వున్న వారిని మాత్రమే ప్రేమిస్తారు. డబ్బు, సమాజంలో మంచి పేరు వుంటే చాలు వాడెలా వున్నా వారి కళ్లకు చాలా సెక్సీగా కనిపిస్తాడు, అవే లేకపోతే వాడెంత అందంగా వున్నా వృథాయే...ఆడవాళ్లు ఆర్థికంగా భద్రతను కల్పించే మగాళ్లనే ప్రేమిస్తారు... వారిది ప్రేమ కాదు, ప్రేమంటే ఎలాంటి స్వార్థం లేనిది కానీ ఆడవారి నుండీ అలాంటి ప్రేమను ఆశించడం ఎండమావిలో నీటి కోసం వెతకడం లాంటిదే అని పెద్ద లెక్చర్ ఇచ్చేసాడు సదురు పత్రికా విలేకరికి. ఇంతకీ 50 సెంట్ ఆడాళ్లంటే అంతలా విసుక్కోవడానికి కారణం ఎవరటే ఆయన మాజీ భార్య. ఆమె అతన్ని మోసం చెయ్యడమే కాకుండా డబ్బును డిమాండ్ చెయ్యడంతో ఆయనీ అభిప్రాయానికి వచ్చాడట. కానీ నేటి ఆధునిక కాలంలో కూడా ప్రేమను ఆశించే వారికి భంగపాటు ఎదురవడం పెద్ద ఆశ్చర్యకరమేమీ కాదు.... ఏమంటారు....!!!


Click it and Unblock the Notifications











