ఆమె తో పడకను పంచుకోవాలనుంది...!!
ప్రముఖ హాలీవుడ్ నటి ఏంజలీనా జోలీ ప్రపంచంలోనే సెక్సీగా వున్న మహిళల్లో ప్రథమస్థానాన్ని కైవసం చేసుకోవడంమే కాకుండా, ఎంతో మంది అభిమానాన్ని సొంతం చేసుకుంది. 34 ఏళ్ల వయసు నిండినా ఆమె ఎంతో మందికి కలల రాణి. అందం తోనే కాకుండా తన సేవా దృక్పథంతో ఎన్నో సేవా కార్యక్రామాలను చేస్తూ, ముగ్గురు పిల్లలను దత్తతకు తీసుకుని వారి ఆలనాపాలనా చూస్తున్న ఈ తారను ఎంతో మంది అభిమానిస్తారు.
ప్రస్తుతం హాలీవుడ్ హాట్ హీరో బ్రాడ్ పిట్ తో సహజీవనం సాగిస్తున్న ఈ నటిని ఆరాధించే వారి జాబితాలో మరో సెలబ్రిటీ చేరిపోయాడు. పాప్ సంచలనం 50 సెంట్ తనకు జోలీ అంటే తగని మక్కువ అని భహిరంగానే ప్రకటిస్తున్నాడు. ఆమె అందం తనకు పిచ్చెక్కిస్తోందని తనకు అవకాశం వస్తే కనీసం ఒక్కరోజైనా బ్రాడ్ పిట్ లాగా మారిపోయి ఆమెతో పడకను పంచుకోవాలని ఉందని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
మరి జోలీ, బ్రాడ్ లు మరో 18 నెలల్లో విడిపోనున్నారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో జోలీ తర్వాతి బాయ్ ఫ్రెండ్ గా తనకు అవకాశం వస్తుందేమోనని ఈ వ్యాఖ్యలు చేసారా అన్ని ప్రశ్నకు మాత్రం ఆయన అలాంటిదేమీ లేదు, నా భార్య చేసిన మోసంతో తనసలు ఆడవాల్లని నమ్మడం మానేసానని కేవలం అమెతో పడకను పంచుకోవాలనే ఆశపడుతున్నాను తప్పితే ఆమె బాయ్ ఫ్రెండ్ గా వుండాలనే ఉద్దేశ్యం లేదని చెప్పుకొచ్చాడు. అంతే కాదండోయ్ ఆడవారిని నమ్మకండని ఉపన్యాసాలు కూడా తెగ దంచేస్తున్నాడు 50 సెంట్.


Click it and Unblock the Notifications











