ముగ్గురిపై అత్యాచారం.. ప్రముఖ నటుడు అరెస్ట్.. 45 ఏళ్లు జైలుశిక్ష?
హాలీవుడ్ నటుడు, ప్రఖ్యాత హోస్ట్ డానీ మాస్టర్‌సన్‌కు ఎదురు దెబ్బ తగిలింది. కొన్ని సంవత్సరాలుగా మానభంగ ఆరోపణలు ఎదుర్కొంటున్నపై నేరారోపణలు రుజువవ్వడంతో శిక్షపై తీర్పు ఇవ్వడానికి రంగం సిద్దమైంది. ఈ క్రమంలో ఈ కేసుల్లో ఆయనను అమెరికా కాలమానం ప్రకారం బుధవారం ఉదయం అరెస్ట్ చేయడం జరిగింది. దీంతో మీటూ ఉద్యమంలో మరో కీలక పరిణామం చోటుచేసుకొన్నది. వివరాల్లోకి వెళితే.

సినీ ప్రముఖుల అరాచకాలతో మీటూ ఉద్యమం
హాలీవుడ్‌లో సినీ తారలపై లైంగిక వేధింపులను ఎండగడుతూ మీటూ ఉద్యమం మొదలైన తర్వాత సినీ ప్రముఖుల అరాచకాలు వెలుగులోకి వచ్చాయి. అందులో నిర్మాత వెయిన్‌స్టెయిన్ సుమారు 27 ఏళ్ల జైలుశిక్ష పడిన సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో That 70s Showలో నటించిన డానీ మాస్టర్‌సన్ కేసు కూడా హాలీవుడ్‌లో సంచలనం రేపింది. మూడు సంవత్సరాల నిరంతర దర్యాప్తు అనంతరం నేర అభియోగాలు రుజువయ్యాయి.

బుధవారం అరెస్ట్, బెయిల్‌పై విడుదల
మాస్టర్‌సన్‌పై నమోదైన నేరారోపణల ఆధారంగా త్రి కౌంట్ష్ (కేసు తీవ్రతను కొలవడం) రేప్‌గా ఈ కేసును నిర్ఱారించారు. మాస్టసర్‌సన్‌పై మంగళవారం జూన్ 16న కేసు నమోదు చేశారు. అనంతరం ఆయనకు అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. వారెంట్ల ఆధారంగా బుధవారం మాస్టర్‌సన్‌ను అరెస్ట్ చేసినట్టు జైలు అధికారులు ధృవీకరించారు. అనంతరం బెయిల్‌పై ఆయనను విడుదల చేశాం. మళ్లీ సెప్టెంబర్ 18వ తేదీన కోర్టులో హాజరుకావాలని ఆదేశించారు.

2001, 2003లో ముగ్గురిపై మానభంగం
మాస్టసర్‌సన్‌పై ప్రాసిక్యూషన్ న్యాయవాది తీవ్రమైన ఆరోపణలు చేశారు. 2001లో 23 ఏళ్ల మహిళను, 2003లో 28 ఏళ్లు, 23 ఏళ్ల మహిళలపై అత్యాచారం జరిపారు. 2003లో అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు హాలీవుడ్ హిల్స్‌లోని తన నివాసానికి ఆహ్వానించి ఓ మహిళపై దారుణంగా మానబంగానికి పాల్పడ్డారు అని తమ ఫిర్యాదులో ప్రాసిక్యూషన్ పేర్కొన్నది. మాస్టసర్‌సన్‌పై మరో రెండు కేసులను కూడా ప్రాసిక్యూషన్ దాఖలు చేయగా, సరైన సాక్ష్యాలు లేవని వాటిని పరిగణనలోకి తీసుకోలేదు.
Recommended Video

నా క్లయింట్ నిరపరాధి, అమాయకుడు
అయితే ప్రాసిక్యూషన్ వాదనలను మాస్టసర్‌సన్ తరఫు న్యాయవాది ఖండించారు. తన క్లయింట్ నిరపరాధి, అమాయకుడు అని పేర్కొన్నారు. సాక్ష్యాలను విచారించిస్తే అసలు వాస్తవాలు బయటపడుతాయి. అప్పుడు నా క్లయింట్ నిజాయితీ బయటకు వస్తుంది అని తన వాదనలను వినిపించారు. ఈ కేసులో సాక్ష్యాలు రుజువైతే మాస్టసర్‌సన్‌కు సుమారు 45 ఏళ్ల జైలుశిక్ష పడే అవకాశం ఉందనే అభిప్రాయాన్ని లీగల్ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











