73rd Emmy Awards.. ది క్రౌన్, మాండలోరియన్ హవా.. ఓటీటీదే అగ్రస్థానం
ప్రపంచ సినిమా పరిశ్రమలో ప్రతిష్టాత్మకంగా భావించే ఎమ్మీ అవార్డుల నామినేషన్స్‌ను ప్రకటించారు. 73వ ఎమ్మీ అవార్డుల వేడుకకు నామినేట్ అయిన చిత్రాల జాబితాను నిర్వాహకులు, కమిటీ వెల్లడించింది. ఈ అవార్డుల రేసులో ది క్రౌన్, ది మాండాలోరియన్ చిత్రాలు అత్యధిక నామినేషన్లను సొంతం చేసుకొన్నాయి. ఈ రెండు చిత్రాలు దాదాపు 24 నామినేషన్లను సొంతం చేసుకోవడం విశేషం. ఆ తర్వాత వాండా విజన్ 23 నామినేషన్లను సొంతం చేసుకోవడం గమనార్హం. ఇంకా ఈ నామినేషన్ల జాబితాలో హాండ్‌మెయిడ్స్ టేల్, లవ్ క్రాఫ్ కంట్రీ, ఇతర భారీ చిత్రాలు స్థానం సంపాదించుకొన్నాయి.
కోవిడ్ 19 మహమ్మారి నేపథ్యంలో తక్కువ సంఖ్యలో ఉన్న ఆడియెన్స్, ప్రముఖుల సమక్షంలో ఈ నామినేషన్లను ప్రకటించారు. ఈ కార్యక్రమానికి సెడ్రిక్ హోస్ట్‌గా వ్యవహరించారు. ఈ అవార్డుల ప్రక్రియలో లింగ వివక్షకు చెక్ పెట్టేందుకు టెలివిజన్ అకాడమీస్ బోర్డు ఆఫ్ గవర్నర్స్ సంచలన నిర్ణయం తీసుకొన్నారు. నామినేషన్ సర్టిఫికెట్‌లో మహిళ, పురుషులు అనే వ్యత్యాసం కనిపించకుండా ఫెర్ఫార్మర్ అని స్పష్టం చేయాలని నిర్ణయించుకొన్నారు. ఈ అవార్డుల వేడుకు సెప్టెంబర్ 19 తేదీ ఆదివారం జరుగనున్నది.

ఎమ్మీ అవార్డులకు నామినేట్ అయిన డ్రామా సిరీస్
ది బాయ్స్
బ్రిడ్జెర్టన్
ది క్రౌన్
ది మాండలోరియన్
లవర్‌క్రాఫ్ట్ కంట్రీ
పోజ్
ది హ్యాండ్‌మెయిడ్స్ టేల్
దిస్ ఈజ్ అస్
ఉత్తమ కామెడీ సిరీస్ క్యాటగిరీలో
బ్లాకీష్
కోబ్రా కాయ్
పెన్15
ఎమిలీ ఇన్ ప్యారిస్
హ్యాక్స్
టెడ్ లాస్సో


Click it and Unblock the Notifications











