వాలంటైన్ డే రోజున బీచ్‌లో నగ్నంగా వివాహాలు..
జమైకా: జమైకాలోని పర్యాటక ప్రదేశమైన నెగ్రిల్ బీచ్‌లో ఆరుబయట జరిగిన వాలెంటైన్ డే సందర్బంగా సామూహిక వివస్త్ర వివాహా వేడుక జరగిగింది. ఈ వేడుకని సూపర్ క్లబ్స్ అనే న్యూడిస్ట్ రిసార్ట్ నిర్వహించింది. వాలెంటైన్ డే సందర్బంగా జమైకాలో తొమ్మిది జంటలు నగ్నంగా వివాహా బంధంలోకి అడుగు పెట్టాయి. నగ్నంగా వివాహాం చేసుకునేందుకు అమెరికా, కెనడాకు చెందిన వందకు పైగా జంటలు ఆసక్తి చూపించినప్పటికీ.. రిసార్ట్ యాజమాన్యం కేవలం లాటరీ పద్దతి ద్వారా పది జంటలను మాత్రమే ఎంపిక చేసింది.
చివరి నిమిషంలో ఒక జంట విరమించుకోవడంతో మిగిలిన తొమ్మిది జంటలు పెళ్లిళ్లు చేసుకున్నారు. తెల్లని ఇసుక కలిగిన బీచ్‌లో ఈ వాలెంటైన్ డేలో పాల్గోన్న జంటలను ఎందుకు ఇలా నగ్నంగా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారని ప్రశ్నించగా.. మేము నగ్నంగానే ప్రేమించుకున్నాం.. మా జీవితాలను ఎందుకు నగ్నంగా మొదలుపెట్టుకూడదంటూ సమాధానం ఇచ్చారు. ఇంకో విశేషం ఏమింటంటే ఈ తొమ్మిది జంటలకు 22 ఎకరాల స్దలం కలిగిన రిసార్ట్‌లో నాలుగు రాత్రులు ఉండే విధంగా అన్ని ఏర్పాట్లను ఉచితంగా కల్పించేందుకు రిసార్ట్ యాజమాన్యం సన్నాహాలు చేసింది.


Click it and Unblock the Notifications











