కోర్టు హాల్‌లో లవర్‌ను ముద్దుల్లో ముంచెత్తిన ర్యాపర్.. జడ్జి ఏం చేశారంటే?

హాలీవుడ్‌లో సంచలనం రేపిన గన్ షూటౌట్ కేసులో ప్రముఖ ర్యాపర్ అసాప్ రాకీ అలియాస్ రాకిమ్ మేయర్‌ను లాస్ ఏంజెలెస్ కోర్టు నిర్ధోషిగా ప్రకటించింది. న్యాయమూర్తి తీర్పు చదువుతుండగానే ఆయన తనను కేసు నుంచి విముక్తి చేశారని విన్న వెంటనే సమీపంలో ఉన్న లవర్ రిహాన్నాపై ఒక్కసారిగా దూకి కౌగిలిలో బంధించి ముద్దుల్లో ముంచెత్తారు. రాకీ చర్యతో కోర్టులోని న్యాయమూర్తితో సహా గ్యాలరీలో ఉన్న అందరూ షాక్ గురయ్యారు. ఈ కేసు గురించి, తీర్పు గురించిన వివరాల్లోకి వెళితే..

రాకిమ్ మేయర్ 2021 సంవత్సరంలో తన స్నేహితుడు అసాప్ రెల్లి అలియాస్ టెర్రెల్ ఎఫ్రాన్‌పై సెమీ ఆటోమెటిక్ ఆయుధంతో కాల్పులు జరిపారు. ఈ ఘటన కాలిఫోర్నియాలోని హాలీవుడ్‌లోని డబ్ల్యూ హోటెల్‌లో జరిగింది. ఈ వ్యవహారంలో అసాప్ రెల్లీ తన స్నేహితుడి రాకీపై కేసు నమోదు చేశారు. గత నాలుగేళ్ల నుంచి ఈ కేసు విచారణ లాస్ ఏంజెలెస్ కోర్టులో జరుగుతున్నది.

A AP Rocky alias Rakim Mayers jumped and hugs partner Rihanna in Los Angeles Court while gun Shoot assault case verdict

గన్ దాడి కేసులో రాకీపై హత్యారోపణలు నమోదు అయ్యాయి. ఈ కేసు విచారణ జరుగుతున్న సమయంలో ఆయన తీవ్ర ఆందోళనకు గురయ్యారు. తనకు జైలు జీవితం తప్పదనే నిర్ణయానికి వచ్చారు. కానీ దాడి కేసులో బలమైన సాక్ష్యాలు లేకపోవడం వల్ల నీరుగారిపోయింది. ఈ కేసులో తుది తీర్పును న్యాయమూర్తి వెల్లడించారు. దాంతో ఆయనకు ఈ కేసు నుంచి ఉపశమనం లభించింది.

అసాప్ రెల్లీపై తుపాకితో దాడి చేసినట్టు వచ్చిన ఆరోపణల కేసులో రాకీకి ఎలాంటి సంబంధం లేదు. సాక్ష్యాలు కోర్టుకు సమర్పించని కారణంగా ఆయనను ఈ కేసు నుంచి నిర్దోషిగా ప్రకటిస్తున్నాం అని న్యాయమూర్తి తీర్పు చదువుతుండగానే ఆయన తన సంతోషాన్ని పట్టలేక తనకు సమీపంలో ఓ టేబుల్ ముందు కూర్చొన్న ప్రియురాలు సింగర్ రిహాన్నాపై అమాంతం దూకేశాడు. ఆ తర్వాత ఆమెను కౌగిలిలో బంధించి ముద్దుల వర్షం కురిపించారు. అసాప్ రాకీ వ్యవహరించిన తీరు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. న్యాయమూర్తి ఆయనను చూసి నవ్వుల్లో మునిగిపోయారు.

తన ప్రియుడు రాకీని కేసు నుంచి విముక్తి చేయడంపై రిహాన్నా ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఈ అభిమానుల ఆదరణకు కారణం భగవంతుడే. భగవంతుడు ఎప్పుడు అండగా ఉంటాడు. అందుకు నేను థ్యాంక్స్ చెబుతున్నాను. క్షమించి వదిలేసినందుకు నేను సంతోషంగా ఉన్నాను అని రిహాన్నా మీడియాతో మాట్లాడుతూ అన్నారు.

ఇదిలా ఉండగా, అసాప్ రాకీ చేసిన పనికి సోషల్ మీడియాలో నెటిజన్లు మీమ్స్‌తో హంగామా చేస్తున్నారు. రిహాన్నాపై దూకిన తీరుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేసి నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. పలు రకాల మీమ్స్‌తో నెటిజన్లు చేస్తున్న ట్రోల్స్‌తో రాకీ ట్రెండింగ్‌లోకి వచ్చారు. ప్రస్తుతం రిహన్నాపై రాకీ దూకిన వీడియో ట్రెండింగ్‌గా మారింది.

More from Filmibeat

Read more about: rihanna
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X