వంద కోట్ల సినిమా కాదు ఏకంగా 600కోట్ల సినిమా...!?

By Sindhu

600 కోట్ల రూపాయలతో హాలీవుడ్ లో అత్యంత భారీగా రూపొందించిన X-మెన్ ఫస్ట్ క్లాస్ ఈ సీజల్ లో 20 సెంచరీ ఫాక్స్ సంస్థ నుంచి అధిక ప్రింట్స్ తో విడుదలవుతుంది. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఈ చిత్రం విడుదలవుతుంది. అంతే కాదు ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో డైరెక్ట్ చిత్రాలకు పోటీగా అత్యంత భారీగా విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం గురించి చిత్ర పంపిణీ దారులు మాట్లాడుతూ'జపాన్ లో ఇటీవలే ఎలాంటి ప్రళయం వచ్చిందో మనం చూస్తూవున్నాం..త్వరలో ఇలాంటి పరిణామాలు సంభవించి ప్రపంచం నాశనం అవ్వటమే కాక యుగాంతం జరగనుందనే ప్రచారం జోరుగా జరుగుతుంది..

ఈ సంధర్బంలో 2000సంవత్సరంలో హైటెక్నికల్ వాల్యూస్ తో రూపొందించి సంచలన విజయం సాధించిన X-మెన్ చిత్రానికి సీక్వెల్ గా రూపొందిన X-మెన్ ఫస్ట్ క్లాస్ చిత్రం విడుదలకి సిద్దంగా వుంది..అసలు 2003లోనే దీనికి స్వీక్వెల్ గా X2 చిత్రం విడుదలయ్యి అదే రేంజి విజయాన్ని సాందించింది...

2006లో X-మెన్ ద లాస్ట్ స్టాండ్, 2009 లో X-మెన్ ఓరిజన్స్ లు విజయాలు సొంతం చేసుకున్నాయి..ఇదే సీక్వెల్ లో జూన్ 10న అత్యంత భారీగా X-మెన్ ఫస్ట్ క్లాస్ విడుదలవుతుంది. ఈ భూమి పై ప్రభావం చూసే న్యూట్రల్ ప్రాబ్లమ్స్ ని తెరకెక్కించారు..ప్రకృతి భీపత్సాలని ఎలా ఎదుర్కోవాలో ఈ చిత్రం ద్వారా తెలియజేస్తున్నారు..ఈ చిత్రంలో గ్రాఫిక్స్ అందరిని ఆకట్టుకుంటుందని" తెలిపారు. ఈ చిత్రానికి దర్శకుడు మ్యాత్యువాన్ జేమ్స్ మెక్ వాయ్, మైఖేల్ పాస్ బెండర్, కెవిన్ బెకిన్ రోజ్ బిర్నే, జాన్వరి జోన్స్, ఓలివర్ ప్లాట్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి హెన్రి ప్రైస్ జాక్ మెన్ సంగీతాన్ని అందించాడు. దాదాపు 120 మిలియన్ల్ తో రూపొందించిన ఈ చిత్రాన్ని ట్వింటియస్ట్ ఫాక్స్ కంపెనీ వారు ఇంగ్లీష్, హింది, తమిళ మరియు తెలుగు భాషల్లో విడుదల చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X