చెత్త కుప్పలో దొరికిన శునకం.. ఒక్క సినిమాతో జాతకం మారిపోయింది!

చాలా మంది నటులు తమ సినిమా కష్టాలని వివరిస్తుంటారు. తాము సాధించిన విజయాల్ని, పడ్డ కష్టాలని గుర్తు చేసుకుని మురిసిపోతుంటారు. ఈ ఫొటోలో ఉన్న శునకాన్ని కూడా ఓ హిస్టరీ ఉంది. చెత్త కుప్పలో ఓ వీధి కుక్కగా ఉన్న ఈ శునకం ఇప్పుడు సినిమా స్టార్ గా మారిపోయింది. ఎ డాగ్స్ వే హోమ్ అనే చిత్రంతో ఈ శునకం జాతకం మారిపోయింది. ఈ శునకం పేరు షల్బై.

లాస్ ఏంజెల్స్ లోని టెన్నెసే ప్రాంతానికి 20 మైళ్ళ దూరంలో యానిమల్ కంట్రోల్ అధికారిణికి అయిన మేగన్ కు ఓ చెత్త కుప్పలో కనిపించింది. ఆ ప్రాంతంలో వాహనాలు చాల వేగంగా వెళుతుంటాయి. ఈ శునకాన్ని ప్రమాదం జరిగే అవకాశం ఉందని భావించిన ఆమె దానిని డాగ్ షెల్టర్ కు తీసుకుని వెళ్ళింది. కేథరిన్, బ్రూస్ అనే హాలీవుడ్ రచయితలు శునకం నేపథ్యంలో చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు. కథకు సరిపడే శునకం కోసం ఎదురుచూస్తున్నారు.

A Dogs Way Home movie dog became internet sensation

ఆ సమయంలో వారికీ మేగాన్ తీసుకువచ్చిన షల్బై గురించి తెలిసిందే. వెంటనే దానిని చూసి ఎంపిక చేసుకున్నారు. సినిమాకు అవసరమైనంత ట్రైనింగ్ ఇచ్చి చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ ఏడాది జనవరి 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమానే కాదు షల్బై కూడా అభిమానులకు తెగ నచ్చేసింది. సోషల్ మీడియాలో ఈ శునకం గురించే హాలీవుడ్ అభిమానులు చర్చించుకుంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X