twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మేకప్ లేకున్నా చక్కనైన అందం ఆమె సొంతం..!

    By Nageswara Rao
    |

    హాలీవుడ్ పాప్ సింగర్ కాటి పెర్రీ తాను కొత్తగా రూపొందిస్తున్న టూర్ ఫిల్మ్ 'పార్ట్ ఆఫ్ మి' లో భాగంగా మేకప్ లేని ఫోటోని విడుదల చేసింది. ఈ ఫోటోలో కాటి పెర్రీ చాలా అందంగా ఉందంటూ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇటీవలే కాటి పెర్రీకి సంబంధించిన మేకప్ లేని ఫోటోని తన మాజీ భర్త రస్సెల్ బ్రాండ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. ఈ ఇమేజిని రస్సెల్ బ్రాండ్, కాటి పెర్రీ సగం నిద్రలో ఉండగా అర్దరాత్రి తీసుకున్నట్లు తెలిపాడు.


    కాటి పెర్రీ రూపొందిస్తున్న టూర్ ఫిల్మ్ 'పార్ట్ ఆఫ్ మి' ఎక్కువ భాగం తన జీవితంలో జరిగిన విశేషాలను అభిమానులకు తెలియజేయనుంది. ముఖ్యంగా రస్సెల్ బ్రాండ్‌ని ఏవిధంగా తాను వివాహాం చేసుకున్న విషయాన్ని డాక్యుమెంట్ మాదిరి తీసి ట్రైలర్‌లో పొందు పరచనుంది. ఈ ఫిల్మ్‌ని చూసిన వారంతా ఒకింత భయాందోళనకు లోనవుతారని చెప్పింది.

    27 సంవత్సరాల వయసు కలిగిన కాటి పెర్రీ ఇటీవల ఎల్లీ షోలో పాల్గోని టూర్ ఫిల్మ్ 'పార్ట్ ఆఫ్ మి'కి సంబంధించిన విషయాలను తెలియజేశారు. కాటి పెర్రీ ఈ సినిమాలో తన జీవితంలో జరిగిన మ్యారేజిని హైలెట్ చేస్తుందని తెలిసిన తన మాజీ భర్త రస్సెల్ బ్రాండ్ వారం రోజులు గడవక ముందే తన మనసు ఇప్పటికీ కాటీ పెర్రీనే కోరుకుంటుందని తెలిపాడు.

    రస్సెల్ బ్రాండ్ తన భార్య కాటీ పెర్రీ తనతో సరిగా సంసారం చేయడం లేదని కోర్టులో విడాకులు కోరిన సంగతి తెలిసిందే. వీరిద్దరికి కోర్టు జులైలో విడాకులు మంజారు చేయనుంది. క్రిస్టమస్ తర్వాత నా నుండి విడాకులు కావాలని రస్సెల్ గుడ్డిగా అప్లై చేశాడంటూ కాటి పెర్రీ వాపోయింది. ప్రస్తతుం కాటి పెర్రీ హావాయ్‌లో ఉండగా.. రస్సెల్ తన సొంత నగరం లండన్‌లో నివసిస్తున్నాడు. ఇక కాటి పెర్రీ తన సింగిల్‌ని జులై 2 విడుదల చేస్తుండగా.. టూర్ ఫిల్మ్ 'పార్ట్ ఆఫ్ మి' ని జులై 5న విడుదల చేస్తుంది.

    English summary
    The singer is seen on her upcoming tour film Part Of Me in a wardrobe fitting for her tour - and appears fresh-faced without her war-paint.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X