Alan Arkin: ఆస్కార్ విజేత అలాన్ ఆర్కిన్ మృతి.. విషాదంలో సినీ లోకం!

అకాడమీ అవార్డు గ్రహీత, టోనీ అవార్డ్-విజేత నటుడు అలాన్ ఆర్కిన్ 89 సంవత్సరాల వయస్సులో మరణించారు. అతని కుమారులు ఆడమ్, మాథ్యూ అలాగే ఆంథోనీ అతని మరణాన్ని ధృవీకరించారు. ఇక కుటుంబం తరపున ఒక ప్రకటన విడుదల చేసారు. కళాకారుడిగా అతని ప్రత్యేక ప్రతిభను గౌరవిస్తూ ప్రేమగల భర్త, తండ్రిగా తాతగా అతని పాత్రను మారువలేము అని కుటుంబ సభ్యులు తెలియజేశారు.

ఆర్కిన్ వెండితెరపై ఎన్నో మర్చిపోలేని పాత్రలలో నటించారు. చెప్పుకోదగ్గ విజయాలలో నెట్‌ఫ్లిక్స్ సిరీస్ "ది కోమిన్స్కీ మెథడ్" టాప్ లిస్ట్ లో ఉంటుంది. అందులో అతను మైఖేల్ డగ్లస్‌ తో కలిసి నటించాడు. ఇక 2019, 2020లో ఎమ్మీ నామినేషన్‌లను అందుకున్నాడు. అతను 2020 అలాగే 2020లో గోల్డెన్ గ్లోబ్, స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ అవార్డులకు కూడా నామినేషన్‌ లను పొందాడు. ఎక్కువగా ప్రశంసలు పొందిన చిత్రం "లిటిల్ మిస్ సన్‌షైన్" (2006).

Academy Award Winning Actor Alan Arkin Dies at 89

ఇక ఆర్కిన్ ఎడ్విన్ హూవర్ అందులో పనికిమాలిన కుటుంబానికి చెందిన తాతగా నటించాడు. అతని అత్యుత్తమ నటన అతనికి ఉత్తమ సహాయ నటుడిగా ఆస్కార్‌ను అందించింది. ఇక బెన్ అఫ్లెక్ దర్శకత్వం వహించిన 2012 చిత్రం "అర్గో"లో ప్రముఖ నిర్మాత లెస్టర్ సీగెల్‌గా అతని పాత్ర అతనికి నాల్గవ ఆస్కార్ నామినేషన్‌ను సంపాదించిపెట్టింది.

1934 మార్చి 26న న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌లో జన్మించిన ఆర్కిన్ అనంతరం కుటుంబంతో లాస్ ఏంజెల్స్‌కు మకాం మార్చాడు. అయితే, అతను న్యూయార్క్‌లోని చప్పాక్వాలో నివాసం ఎంచుకున్నాడు. ఆర్కిన్ స్కూల్ దశలోనే యాక్టింగ్ పై మక్కువ పెంచుకున్నాడు. అతని కుమారుడు ఆడమ్ ఆర్కిన్ కూడా ప్రసిద్ధ నటుడు. అలాన్ ఆర్కిన్ మృతి పట్ల హాలీవుడ్ దిగ్గజ ప్రముఖులు అలాగే సినీ నటీనటులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఇక అతని అభిమానులు కూడా సోషల్ మీడియా ద్వారా నివాళులర్పిస్తున్నారు. ఇక అలాన్ ఆర్కిన్ పాత్రలు మరువలేనివి అని ఒక మంచి నటుడిని కోల్పోయము అని పలువురు హాలీవుడ్ స్టార్స్ వివరణ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X